ముంబై, జనవరి 3: ఆమిర్ ఖాన్ నటించిన తాజా బాలీవుడ్ చిత్రం ‘పీకే’ ఇంటా బయటా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. డిసెంబర్ 19న విడుదలైన ఈ చిత్రం శనివారం నాటికి ఏకంగా 544 కోట్ల రూపాయలను వసూలు చేసి ఆల్‌టైమ్ రికార్డును సాధించింది. ఇందులో ఓవర్‌సీస్ వసూళ్లే 134 కోట్ల రూపాయలు కావటం విశేషం. గతంలో 542 కోట్ల గరిష్ఠ వసూళ్లను సాధించిన చిత్రంగా ఉన్న ‘ధూమ్-3’ రికార్డును పీకే బద్దలు కొట్టింది. ఈ చిత్రంలో హిందూ మతాన్ని కించపరిచేలా కొన్ని దృశ్యాలున్నాయని అభ్యంతరాలు వ్యక్తమైనా దాని ప్రభావం వసూళ్ల మీద పడలేదు. ఇక..ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ కావటంపై చిత్ర దర్శకుడు రాజు హిరానీ ఆనందం వ్యక్తం చేశారు. తమ సినిమాకు కథే హీరో అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో హిర్వానీ, ఆమిర్‌ఖాన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘త్రీ ఇడియట్స్’ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. త్వరలోనే ఈ సినిమా 600 కోట్ల రూపాయల లక్ష్యాన్ని సులభంగా అధిగమిస్తుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.


No comments:
Post a Comment