బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల జీవనభృతిని చెల్లించాలని తెలంగాణ బీడీసిగార్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వ ర్యంలో శనివారం పట్టణంలోని గాంధీపార్కు నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీ వో కార్యాలయం ఎదుట ధర్నా చేసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్‌కుమార్ మాట్లాడుతూ చాలీచాలని కూలి రేట్లతో బీడీ లు చుట్టే కార్మికులకు తగిన ప్రతిఫలం దక్కడంలేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో బీడీ కార్మికులకు జీవన భృతిని కల్పిస్తామని మెనిఫెస్టోలో చేర్చారే తప్ప అమలుచేయడంలో నిర్లక్ష్యదోరణి అవలంభిస్తున్నారన్నారు. సంబంధిత యాజమాన్యాలు వర్ది బీడీ పేరుతో తక్కువ రేట్లను చెల్లిస్తూ కార్మికులకు మో సం చేస్తున్నారన్నారు. బీడీ కార్మికులు పోరా డి సాధించుకున్న 41జీవోను వెంటనే అమలు చేయాలన్నారు. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకా రం కార్మికులకు జీవనభృతిని విడుదల చే యాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు పోసక్క, జిల్లా నాయకులు వనమాల, లక్ష్మి, లక్ష్మి, సీఐటీయూ డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
హామీని అమలు చేయాలి
ఉట్నూర్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీడీ కార్మికులకు ఇచ్చిన జీవన భృతి హామీని అమలు చేయాలని కోరుతూ శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాయలం ఎదుట తెలంగాణ బీడీసిగార్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఐటీయూ డివిజన్ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ బీడీ కార్మికుల మద్దతుతో అధికారంలోకి టీఆర్‌ఎస్ ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు.
పారిశ్రామిక విధానం, పెట్టుబడిదారులతో ప్రతినిత్య సమావేశాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం బీడీ కార్మికుల హక్కుల గురించి మాట్లాడడం లేదన్నారు. ప్రభుత్వం బీడీ కార్మీకుల సమస్యలు పరిష్కరించి కనీస వేతనాల జీవో నం.41ని పునరుద్ధరించాలన్నారు. అనం తరం తహసీల్దార్ ప్రభాకర్ స్వామికి మెమో రాండం సమర్పించారు


No comments:
Post a Comment