Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad
Showing posts with label Adilabad. Show all posts
Showing posts with label Adilabad. Show all posts

Saturday, 30 July 2016

వామ్మో.44.... 61, 63 రోడ్లా

వామ్మో.44.... 61, 63 రోడ్లా..
అదిలాబాద్‌, జూలై 30,
ఇదేంటి ఇవోదే కొత్త లెక్కలు అనుకుంటున్నారా... నేషనల్‌ హైవే 44, 61, 63 రోడ్లంటే ఆదిలాబాద్‌ జిల్లా వాసులు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలోని నిర్మల్‌ మండలం సోన్‌ నుంచి జైనథ్‌ మం డలం పిప్పల్‌కోఠి వరకు జాతీయ రహదారి నం.44, తానూర్‌ మండలం బేల్‌ తరోడ నుంచి లక్షెట్టిపేట వరకు హైవే నం.61, దండేపల్లి మండలం గూడెం నుంచి కోటపల్లి మండలం అర్జున్‌గుట్ట వరకు హైవే నం.63 మూడు జాతీయ రహదారులున్నాయి. వీటితో పాటు ముథోల్‌ మం డలం బాసర గోదావరి వంతెన నుంచి భైంసా చెక్‌పోస్టు వరకు, ఖానాపూర్‌ నుంచి బాదన్‌కుర్తి వరకు కొత్తగా జాతీయ రహదారుల పరిధిలోకి చేరుతున్నాయి.
గ్రామాల మధ్యలో నుంచి జాతీయ రహదారి ఉండగా, ఇరువైపులా రాక పోకలకు సర్వీసు రోడ్లు లేవు. ఆదిలాబాద్‌ నుంచి నిర్మల్‌ వెళ్లే బస్సులు కుడి వైపున ఉన్న బస్టాండ్‌లోకి వెళ్లి వస్తుండగా, హైవేపై వేగంగా వచ్చే వాహనాలు ఢీకొంటున్నాయి. బస్టాండ్‌లోకి రాకపోకలు సాగించే ప్రయాణికులకు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఇటీవల ఆర్టీఓ, ఎన్‌హెచ్‌, ఆర్టీసీ, పోలీసు శాఖల అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశమై జాతీయ రహదారి మధ్యలో దారిని మూసివేశారు. దీంతో నిర్మల్‌ వైపు వెళ్లే వాహనాలను డొంగర్‌గావ్‌ చౌరస్తాకు వెళ్లి యూటర్న్‌ తీసుకొని బస్టాండ్‌ వచ్చి.. జవహర్‌ నగర్‌ వైపు వెళ్లి అండర్‌ పాస్‌ నుంచి యూటర్న్‌ తీసుకొని మళ్లీ నిర్మల్‌ వైపు వెళ్లాల్సి వస్తున్నది. డొంగర్‌గావ్‌ వద్ద యూటర్న్‌ తీసుకునేప్పుడు ఒకేసారి మలుగక.. రివర్స్‌ తీసుకుంటున్నారు. దీంతో వేగంగా వచ్చే వాహనాలు ఢీ కొట్టే ప్రమాదాలున్నాయి. గుడిహత్నూర్‌ వద్ద రెండు వైపులా సర్వీసు రోడ్లు, అండర్‌ పాస్‌లు లేక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ప్రతి గ్రామం వద్ద కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. జాతీయ రహదారుల నిర్మాణంలో నిబంధనలు సరిగా పాటించడం లేదు. నాలుగు దశల్లో రోడ్డు భద్రత తనిఖీ చేస్తుండగా.. అసలు డిజైన్‌ కావాలని ఎన్‌హెచ్‌ అధికారులను రవాణా శాఖ అధికారులు పలు మార్లు కోరినా స్పందన లేదు. ఇప్పటికే నిర్మించిన హైవే నం.44, 61కు సంబంధించి నిబంధనలు, ప్రమాణాలు సరిగా పాటించలేదు. ఎక్కడా ప్రయాణికులు, వాహనాలు నేరుగా జాతీయ రహదారిపైకి ఎక్క కూడదు. గ్యాప్‌ ఇన్‌ విూడియం (రహదారిపై డివైడర్‌ అంతరాయం) వచ్చిన చోట అదనపు లైన్‌ తప్పకుండా ఉండాలి. గ్రామస్తులు, ఆర్టీసీ బస్సులు రాక పోకలు సాగించేందుకు సర్వీసు రోడ్లు, అండర్‌పాస్‌లు, అదనపు లైను పెట్టాలి. ఇది జిల్లాలో ఎక్కడా సరిగా అమలు కాలేదు. గ్యాప్‌ ఇన్‌ విూడియం వచ్చిన చోట 200-250విూటర్ల దూరంలో హెచ్చరికలు సూచించే బోర్డులు ఉండాలి. 100విూటర్లకు మరో హెచ్చరిక బోర్డు తప్పని సరిగా పెట్టాలి. రెండు కిలో విూటర్లలోపు ఎక్కడ కూడా గ్యాప్‌ ఇన్‌ విూడియం ఉండకూడదనే నిబంధన ఉంది.విస్తరించిన జాతీయ రహదారులపై గ్రామాలు వచ్చిన చోట సర్వీసురోడ్లు, అండర్‌పాస్‌లు, అదనపు లైన్లు లేవు. వాటి కోసం స్థలం కూడా కేటాయించ లేదు. పెట్రోల్‌ బంక్‌లు ఉన్నచోట యూటర్న్‌, డివైడర్‌ అంతరాయం ఉంది. గ్రామాలు ఉన్న చోట వాహనాలు, ప్రయాణికులు ఇతర పశువులు నేరుగా రోడ్డుపైకి ఎక్కుతున్నాయి. దీంతో 80-100కిలో విూటర్ల వేగంతో వచ్చే వాహనాలు వీరిని ఢీకొడుతున్నాయి. పెద్ద గ్రామాల్లో కూడా సర్వీసు రోడ్లు, అదనపు లైన్లు, అండర్‌ పాస్‌లు లేక పోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్‌, నిర్మల్‌, భైంసా లాంటి పెద్ద పట్టణాలకు వెళ్లే బైపాస్‌ రోడ్లకు కూడా అదనపు లైన్‌, అండర్‌పాస్‌లు లేక పోవడంతో.. జాతీయ రహదారి నుంచే నేరుగా రాకపోకలు జరుగుతున్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్‌లోకి వచ్చే భోరజ్‌, మావల, నిర్మల్‌కు వెళ్లేందుకు బుర్కపల్లి, కర్తాల్‌ వద్ద ఇదే దుస్థితి ఉంది. నిర్మల్‌ మండలం మాదాపూర్‌, గంజాల్‌, ఇచ్చోడ బైపాస్‌లో ఇన్‌, ఔట్‌ రోడ్డు, గుడిహత్నూర్‌, ఆదిలాబాద్‌ బైపాస్‌లో ఇన్‌, ఔట్‌ ఇలాగే ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విస్తరించిన జాతీయ రహదారి 61పై బెల్‌తరోడ నుంచి నిర్మల్‌ వరకు ఒక్క చోట కూడా సర్వీసు రోడ్లు, అండర్‌పాస్‌లు లేవు. భోరజ్‌ వద్ద జైనథ్‌ వెళ్లేందుకు సర్వీసు రోడ్డు ఒకే వైపే ఇవ్వడంతో.. ఎడమ వైపునకు వెళ్లాల్సిన వాహనాలు కుడివైపు వచ్చి హైవే ఎక్కడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
అదిలాబాద్‌ జిల్లాలో తరచూ పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి రవాణా శాఖ అధికారులు ప్రమాద స్థలాలను గుర్తించారు. 20కి పైగా ప్రమాదాలు జరిగితే ఏ కేటగిరి, 10 కంటే పైగా జరిగితే బీ, ఐదు కంటే పైగా జరిగితే సీ కేటగిరిగా తీసుకున్నారు. సీ లో జాతీయ రహదారులకు సంబంధించి హైవే నం.44పై గుడిహత్నూర్‌, నిర్మల్‌ మండలం మాదాపూర్‌ ఎక్స్‌రోడ్డు, గంజాల్‌, హైవే నం.61పై మాటేగావ్‌ బస్టాండ్‌, సిర్గాపూర్‌ వద్ద ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. హైవే నం.63పై గుడిపేట, పాత మంచిర్యాల, శ్రీరాంపూర్‌ భారత్‌ పెట్రోల్‌ బంక్‌, జైపూర్‌ ప్రభుత్వ కళాశాల, చెన్నూర్‌ మండలం కిష్టంపేటను ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా గుర్తించారు. రాష్ట్ర రహదారులకు సంబంధించి ఏ కేటగిరిలో ఎస్‌హెచ్‌ నం.24 పై బాసర ట్రిపుల్‌ ఐటీ వద్ద, ఎస్‌హెచ్‌ నం.1పై మంచిర్యాలలోని పాత మంచిర్యాల, బెల్లంపల్లి ఎక్స్‌రోడ్డు, బీ కేటగిరిలో ఎస్‌హెచ్‌ 24పై బిదిరెల్లి చెక్‌పోస్టు, రైల్వే స్టేషన్‌, ఎస్‌ఎన్‌ నం.1పై జైపూర్‌ మండలం ఇందారం బస్టాండ్‌, మంచిర్యాలలోని ఎస్‌బీహెచ్‌ ప్రధాన శాఖ, ఎఫ్‌సీఐ గోదాం, మందమర్రి మండలం రమణకాలనీ, సీ కేటగిరిలో జైపూర్‌ మండలం పావునూర్‌ ఎక్స్‌రోడ్డు, ఇందారం ఫారెస్టు చెక్‌పోస్టు, వరలక్ష్మీ రైస్‌ మిల్‌, మంచిర్యాలలోని లక్ష్మీ టాకీస్‌ ప్రాంతాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.

Thursday, 12 February 2015

ఆదిలాబాద్: వందశాతం పూర్తి చేయాలి

-కలెక్టర్ జగన్మోహన్
కలెక్టరేట్: స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను జిల్లాలో వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ జగన్మోహ న్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మండలాల్లోని ఎంపీడీఓలు, తహసీల్దార్‌లు, పంచాయతీ అధికారులు, సర్పంచ్‌లతో వ్యక్తిగత మ రుగుదొడ్ల నిర్మాణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వీటి నిర్మాణాలకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు నిర్ధేశించిన లక్ష్యం లో ఇప్పటి వరకు కేవలం 27శాతం మాత్రమే పూర్తి అయ్యాయని ఇంకా 77శాతం మరుగుదొ డ్ల నిర్మాణాలను చేపట్టాల్సి ఉందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు గ్రామాల్లో నిర్మించకపోవడం వల్ల ఈగలు,

దోమలు పెరిగి ప్రజలు రోగాలబారిన పడుతున్నారన్నారు. వీటి నివారణకు స ర్పంచులు బాధ్యత వహించి ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండేలా చూడాలని సూచించారు. 2014డిసెంబర్ వరకు చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణానికి డ్వామా ద్వారా బిల్లు లు చెల్లించామని తెలిపారు. జనవరి 2015 నుంచి చేపట్టే మరుగుదొడ్లకు గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ ద్వారా చెల్లింపులు చేస్తామని పేర్కొన్నారు. నూతన విధానం ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం కోసం 12000ను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఈ విషయాన్ని గ్రామస్థాయిలో ప్రచారం చేసి ప్రతి ఒక్కరూ మరుగుదొ డ్డి నిర్మించుకునేలా చూడాల్సిన బాధ్యత సర్పంచులు, అధికారులపై ఉందన్నారు. ఈసందర్భం గా పలువురు సర్పంచ్‌లు మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి తమ వంతు బా ధ్యతగా కృషి చేస్తామని తెలిపారు. 

కొన్ని గ్రామా ల్లో వీటి నిర్మాణాలకు సంబంధించిన ఉత్తర్వూ లు లేనప్పటికీ సర్పంచులుగా సొంత పూచిపై మరుగుదొడ్లు నిర్మిస్తే ఇప్పటి వరకు బిల్లులు రాలేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ వెంటనే మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. దారిధ్య్రరేఖకు దిగువన ఉన్న వారందరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మంచుకోడానికి అర్హులన్నారు. పెండింగ్‌లో ఉన్న మరుగుదొడ్ల నిర్మాణాలను యుద్ధ్దప్రతిపాదికన మార్చి 15 లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జి ల్లాస్థాయిలో 100శాతం మరుగుదొడ్లను ని ర్మించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సర్పంచులను కలెక్టర్ కోరారు. ఈసమీక్షా సమావేశంలో డీపీఓ పోచయ్య, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఇంద్రసేన్, డివిజనల్ పంచాయతీ అధికారి సుదర్శన్, డ్వామ ఏపీడీ మధుసుధన్‌రావ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Sunday, 4 January 2015

ఆదిలాబాద్‌ :

పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యాసంస్థలు, బెంగళూరు’కు జిల్లాలో విశేష స్పం దన లభించింది. ఆదివారం ఆదిలాబాద్‌, నిర్మల్‌ లో నిర్వహించిన పోటీల్లో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయమే మహిళలు, యువతులు పోటీలు జరిగే ప్రదేశానికి చేరుకు న్నా రు. తమకు కేటాయించిన స్థలాన్ని ముస్తాబు చేసు కున్నారు. ముచ్చటైన ముగ్గుల్ని ఆకర్షణీయంగా వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఆదిలాబాద్‌లో ముఖ్య అతిథిగా ఫారెస్ట్‌ సెటిల్‌మెంట్‌ అధికారి, కలెక్టర్‌ సతీమణి అరుణకుమారి హాజరయ్యారు.
 సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక - ఫారెస్ట్‌ సెటిల్‌మెంట్‌ అధికారి,
కలెక్టర్‌ సతీమణి అరుణకుమారి

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవన్నారు. సంక్రాంతి పండగ విశిష్టతను సం ప్రదాయాలను చాటిచెప్పేలా ప్రతి ఒక్కరూ చక్కని ముగ్గులు వేశారని ప్రశంసించారు. మన సంస్కృతిని కాపాడుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. వీటిని భావితరాలకు అం దించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఇలాంటి పోటీలను ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌ ఆధ్వర్యం లో నిర్వహించడం అభినందనీయమన్నారు. మహనీయుల పరిచయ కార్యక్రమాలను, ఇంటర్వ్యూలను నిర్వహించి ప్రజలను చైతన్య పర్చడంలో ఆంధ్ర జ్యోతి పత్రిక, ఏబీఎన్‌ ఛానెల్‌ ఎప్పుడు ముందుంటాయని ఆమె అన్నారు. నవ్య ప్రత్యేక సంచిక మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ఫ ముగ్గులు మన సంస్కృతికి నిదర్శనం..
కాలం మారిన క్రమంలో ముగ్గులు వేయడం ప్రస్తుతం ఎక్కువ లేనప్పటికీ ముగ్గులు వేయడం మన సంస్కృతికి నిదర్శమని జోగు ఫౌండేషన్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అందన్నారు. వాకిళ్లలో ఇంటి ముందర కల్యాపి చల్లి ముగ్గులు వేసినట్లయితే క్రిమికీటకాలు రాకుండా ఉంటాయని, అంతేకాకుండా ఆరోగ్యంగా జీవించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. అనంతరం విజేతలకు బహు మతులు అందజేశారు. కార్యక్రమంలో మెప్మా పీడీ రాథోడ్‌ రాజేశ్వర్‌, న్యాయనిర్ణేతలు టీఎన్‌జీవోస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వనజారెడ్డి, న్యాయవాది మం జులత, సుందరం బీఎన్‌పీ ఫైనాన్సియర్‌ మేనేజర్‌ జి రాకేష్‌కుమార్‌, సుజాత, సుజాతదేవి, సమాచార శా ఖ సిబ్బంది ఉషారాణి, ఆంధ్రజ్యోతి జిల్లా స్టాఫ్‌ రిపో ర్టర్‌ కొండూరి రవీందర్‌, ఏబీఎన్‌ ప్రతినిధి మాంతయ్య, స్టాఫ్‌ పోటోగ్రాఫర్‌ రవీందర్‌, ఏబీఎన్‌ కెమె రామెన్‌ అవినాష్‌, సర్క్యులేషన్‌ ఇన్‌చార్జి శంకర్‌, రిపోర్టర్లు సుభాష్‌, అశోక్‌, హకీం, అశోక్‌గౌడ్‌, పోచారెడ్డి ఆపరేటర్లు రాజశేఖర్‌, రాకేష్‌ పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ముగ్గులు..
- శోభారాణి, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ 

నిర్మల్‌: తెలంగాణ సంస్కృతిని ప్రతిబింభించేల మహిళలు ముగ్గులు వేశాలని జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ వల్లకొండ శోభారాణి అన్నారు. ఆదివారం పట్టణంలోని మున్సిపల్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు.మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించి సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి యేట సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మహిళల కోసం ఆం ధ్రజ్యోతి నిర్వహిస్తున్న పలు ప్రత్యేక కార్యక్రమాలను గుర్తు చేశారు. అనంతరం మండల పరిషత్‌ అధ్యక్షురాలు అల్లోల సుమతి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడారు. ముగ్గుల పోటీ లకు నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి మహిళ రైతులు కూడ తరలి వచ్చారు. కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా మాజీ మండల పరిషత్‌ అధ్యక్షురాలు నల్ల జలజతోపాటు పలువురు మహిళలు వ్యవహరించారు. పారస్‌ బ్ర హ్మ పత్తి విత్తనాల కంపెనీ వారు అందజేసిన మె మొంటోలను విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులైన జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ వల్లకొండ శోభారాణి, మండల పరిషత్‌ అధ్యక్షురాలు సుమతి గోవర్ధన్‌రెడ్డికి ఆంధ్రజ్యోతి సిబ్బంది మెమోంటోను అందజేసి శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో ముఠాపూర్‌ సొసైటీ చైర్మన్‌ కొరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌, పారస్‌ బ్రహ్మ పత్తి విత్తనాల కంపెనీ సిబ్బంది ఉమా మహేశ్వర్‌రావు, ఆర్‌సీ ఇన్‌చార్జి మాదస్తు రాజేశ్వర్‌, సర్క్యులేషన్‌ అధికారి మోహిన్‌, రిపోర్టర్లు ఓజ స్వామి, కొండ రమేష్‌ పాల్గొన్నారు.

Saturday, 3 January 2015

ఆదిలాబాద్‌ : కదంతొక్కిన బీడీ కార్మికులు జీవన భృతి చెల్లించాలని ర్యాలీలు, రాస్తారోకోలు

బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల జీవనభృతిని చెల్లించాలని తెలంగాణ బీడీసిగార్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వ ర్యంలో శనివారం పట్టణంలోని గాంధీపార్కు నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీ వో కార్యాలయం ఎదుట ధర్నా చేసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్‌కుమార్‌ మాట్లాడుతూ చాలీచాలని కూలి రేట్లతో బీడీ లు చుట్టే కార్మికులకు తగిన ప్రతిఫలం దక్కడంలేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో బీడీ కార్మికులకు జీవన భృతిని కల్పిస్తామని మెనిఫెస్టోలో చేర్చారే తప్ప అమలుచేయడంలో నిర్లక్ష్యదోరణి అవలంభిస్తున్నారన్నారు. సంబంధిత యాజమాన్యాలు వర్ది బీడీ పేరుతో తక్కువ రేట్లను చెల్లిస్తూ కార్మికులకు మో సం చేస్తున్నారన్నారు. బీడీ కార్మికులు పోరా డి సాధించుకున్న 41జీవోను వెంటనే అమలు చేయాలన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకా రం కార్మికులకు జీవనభృతిని విడుదల చే యాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు పోసక్క, జిల్లా నాయకులు వనమాల, లక్ష్మి, లక్ష్మి, సీఐటీయూ డివిజన్‌ నాయకులు పాల్గొన్నారు.
హామీని అమలు చేయాలి
ఉట్నూర్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీడీ కార్మికులకు ఇచ్చిన జీవన భృతి హామీని అమలు చేయాలని కోరుతూ శనివారం స్థానిక తహసీల్దార్‌ కార్యాయలం ఎదుట తెలంగాణ బీడీసిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌, సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి శంకర్‌ మాట్లాడుతూ బీడీ కార్మికుల మద్దతుతో అధికారంలోకి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు.
పారిశ్రామిక విధానం, పెట్టుబడిదారులతో ప్రతినిత్య సమావేశాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం బీడీ కార్మికుల హక్కుల గురించి మాట్లాడడం లేదన్నారు. ప్రభుత్వం బీడీ కార్మీకుల సమస్యలు పరిష్కరించి కనీస వేతనాల జీవో నం.41ని పునరుద్ధరించాలన్నారు. అనం తరం తహసీల్దార్‌ ప్రభాకర్‌ స్వామికి మెమో రాండం సమర్పించారు
Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks