- వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
ఆర్మూర్, జనవరి 4: ఝార్ఖండ్ తరహాలో రాష్ట్రంలో చేపల పెంపకానికి చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో మత్స్యకారులకు టీవీఎస్ మోపెడ్ వాహనాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఇటీవల తాము ఝార్ఖండ్‌లో చేపల పెంపకం తీరును పరిశీలించామన్నారు. అక్కడ రిజర్వాయర్‌లలో వలలు ఏర్పాటు చేసి పెంచడం బాగుందన్నారు. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, పోచారం, కడెం, మానేరు, కోయిల్‌సాగర్ తదితర ప్రాజెక్టుల్లో సైతం అక్కడి తరహా చేపల పెంపకం చేపడతామని ఆయన ప్రకటించారు. ఇందుకవసరమయ్యే రూ.1.05 లక్షలను సబ్సిడీ ఇస్తామని తెలిపారు. చేపల మార్కెట్‌కు ఉచితంగా స్థలం ఇస్తే మున్సిపాలిటీలకు రూ.15లక్షలు, పంచాయతీలకు రూ.7.50 లక్షలు మంజూరు చేస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపల విత్తనోత్పత్తిపై తీవ్ర నిర్లక్ష్యం జరిగిందన్నారు. దీంతో మధ్య దళారులు ప్రవేశించి చేప పిల్లలు ఇచ్చి బైబ్యాక్ ఒప్పందం చేసుకున్నారన్నారు.
ఆర్మూరు, బాల్కొండ ఎమ్మెల్యేలు ఆశన్నగారిజీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి కృషి వల్ల ఎర్రజొన్న రైతులకు బకాయిలు విడుదలయ్యాయని మంత్రి చెప్పారు. అనంతరం ఆయన ఆర్మూర్‌లోని సైదాబాద్‌కాలనీ ఆరో వార్డు రేషన్ దుకాణంలో ఆహార భద్రతలో భాగంగా బియ్యం పంపిణీ చేశారు. అన్ని పథకాలు అర్హులందరికీ అందేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. అనంతరం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి బీసీ బాలికల వసతిగృహంలో విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు


No comments:
Post a Comment