హైదరాబాద్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటకు చెందిన ఉపాధ్యాయురాలు యాదేశ్వరి రూపొందించిన బ్రెయిలీ లిపి పుస్తకాలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ ఆదివారం ఆవిష్కరించారు. కొమురం భీం జీవిత చరిత్ర, అంధుల వెలుగు ప్రధాత డా. లూయీ బ్రెయిలీ జీవిత పరిచయం, 10 తరగతి సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుల కరదీపిక పుస్తకాలను యాదేశ్వరి రూపొందించారు. ప్రపంచ అంధుల దినోత్సవం సందర్భంగా కేసీఆర్ వాటిని కాకతీయ హోటల్‌లో ఆవిష్కరించారు. యాదేశ్వరిని కేసీఆర్ అభినందించారు.


No comments:
Post a Comment