ఉద్యోగుల ఆఫీసు వేళల్లో మార్పు
సగటున 20 నిమిషాల అదనపు పని
3 నెలల్లో మారిన ఉద్యోగుల వైఖరి
ఓ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: ఆఫీసు పనిగంటల కంటే తక్కువ సమయం పనిచేస్తారు! పది గంటలకు ఆఫీసు అయితే మెల్లగా ఏ పదకొండు గంటలకో వస్తారు! సాయంత్రం వెళ్లేటప్పుడు ఓ అరగంట ముందే వెళ్లిపోతారు! ఇదీ ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుపై కొంతమంది అభిప్రాయం! అయితే రౌతు కొద్దీ గుర్రం అన్న సామెత చందంగా.. నడిపించేవాడు సరిగా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగి అయితే ప్రైవేట్ ఉద్యోగి అయినా ఇలా వ్యవహరించడం పరిపాటే! అందుకే ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా ఆధార్‌తో అనుసంధానించిన బయోమెట్రిక్ విధానం అమలు చేసినదగ్గరనుంచి వారి పనిగంటలు గణనీయంగా పెరిగాయి! గతంలో నిర్దిష్ట పని గంటల కంటే తక్కువ సమయం పనిచేసే ఉద్యోగులు ప్రస్తుతం సగటున రోజుకు 20 నిమిషాలు అధికంగా పనిచేస్తున్నారని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో బయటపడింది. గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మూడు నెలల్లో ప్రతి రోజూ సగటున ఓ ఉద్యోగి 8.5 గంటలు పనిచేస్తున్నట్లు వెల్లడైంది. ఇలా అదనంగా పనిచేసిన గంటలను లెక్కిస్తే.. ఒక రోజులో 1900 మంది అదనంగా పనిచేసినట్లవుతుంది. ఒక ఉద్యోగి ఆఫీసుకు వచ్చిన సమయం, వెళ్లిన సమయాన్ని లెక్కించి ఈ అంచనాకు వచ్చినట్లు అధ్యయనంలో తేలింది.ఉద్యోగులు ఆఫీసుకు వచ్చే సరాసరి సమయం 9.28 గంటలు కాగా తిరిగివెళ్లే సమయం 5.46గా ఉంది. బయోమెట్రిక్‌ను ఉపయోగిస్తున్న 47 వేలమంది ఉద్యోగుల పనిగంటలను లెక్కిస్తే వారు 16 వేల పనిగంటలు అదనంగా పనిచేసినట్లు ఓ అంచనా. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వంలోని 387 సంస్థలు బయోమెట్రిక్‌ను ఉపయోగిస్తున్నాయి. మిగిలిన అన్ని సంస్థల్లోనూ త్వరలోనే బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలనిప్రభుత్వం భావిస్తోంది. ఇదే జరిగితే ఉద్యోగు పనిగంటలు పెరిగి.. మరింత ఉత్పాదకత పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా మోదీ మార్క్ పాలన అని ఆయన ముందుగా ఉద్యోగుల పనివేళలపై చాలా కచ్చితమైన అభిప్రాయంతో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

No comments:
Post a Comment