గాడిలో పడేనా?
కలెక్టర్ చేరికతో యంత్రాంగంలో అప్రమత్తం
ఇంకా విధుల్లో చేరని జెసి
వేధిస్తున్నఖాళీల కొరత
హైదరాబాద్ జిల్లా రాష్ర్టానికి గుండెకాయ. అలాంటి జిల్లాలో కలెక్టర్‌ను ఆరు నెలల ముందే ఆంధ్ర క్యాడర్ గా కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన పాలనా వ్యవస్థపై తీవ్రంగా పడింది. ఈ క్రమంలోనే ఆ కలెక్టర్ పలు సెలవుపై వెళ్లారు. దీనికి తోడు జిల్లాలో జాయింట్ కలెక్టర్ పోస్టు కూడా దాదాపు పది నెలలుగా ఖాళీగానే కొనసాగుతోంది. జిల్లాకు పెద్దబాసే లేకపోవడంతో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు న్నాయి. అయితే ఇటీవలే కొత్త కలెక్టర్ కె నిర్మల జిల్లాకు పూర్తి స్థాయిలో కేటాయించడంతో పాటు జెసిని కూడా కేటాయించడంతో మళ్లీ పాలన గాడిలో పడే అవకాశాలున్నాయని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి.
జిల్లా సమగ్ర అభివృద్ధి జరగాలంటే ముందుగా అధికారులు, ఉద్యోగులు ఐక్యంగా పనిచేయాలి. అయితే జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించిన ముఖేష్ కుమార్ మీనాకు ఐఎఎస్ కేటాయింపుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. ఆయన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటానని ఆప్షన్ ఇచ్చినా ఆంధ్రా క్యాడర్ గానే పోయారు. దీంతో ఆయన ఆ తర్వాత జిల్లా పనుల్లో పెద్దగా ఇన్వాల్వ్ కాలేదన్న విమర్శలున్నాయి. అప్పటి వరకు చాలా ఉత్సాహంగా పనిచేసిన మీనా, చివరిలో పోయేటప్పుడు ఏ ఫైల్ పై సంతకం చేస్తే.. ఏం జరుగుతుందో అనే భయంతో వ్యవహరించారని కలెక్టరేట్ వర్గాలే చెబుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో పలు మార్లు ఆయన సెలవుపై వెళ్లారు. దీనికి తోడు జాయింట్ కలెక్టర్ పోస్టు కూడా ఎనిమిది నెలలుగా ఖాళీగానే ఉంది. దీంతో పాలన భారమంతా అడిషనల్ జాయింట్ కలెక్టర్ సంజీవయ్య, డిఆర్ఓ అశోక్ కుమార్ లపై పడింది. అయితే వీరు సాధ్యమైనంత మేర పాలన సక్రమంగా కొనసాగేలా చూసినా, ఐఎఎస్ అధికారులుంటే బాగుండేదని పలువురు అప్పట్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇటీవల కొత్తగా కలెక్టర్‌గా కె నిర్మల, జాయింట్ కలెక్టర్ గా సురేంద్రమోహన్ ను ప్రభుత్వం కేటాయించింది. కేటాయించిన మరుసటిరోజే బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ నిర్మల తన పనిని వాయిదా వేయబోనని అధికారులకు పరోక్షంగా తెలిపింది. అయితే జాయింట్ కలెక్టర్ గా కేటాయించబడ్డ సురేంద్రమోహన్ మాత్రం ఇంతవరకు బాధ్యతలు స్వీకరించలేదు. అయితే కలెక్టర్ మాత్రం అధికారులతో నిత్యం సమావేశాలు ఏర్పాటు చేస్తూ, పాలనపై పట్టు సాధించే పనిలో ఉంది. ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులతోనూ, కలెక్టరేట్ విభాగాలతోనూ, తహశీల్దార్లతోనూ, ఆర్డీఓలతోనూ వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేసి జిల్లా పరిస్థితులను తెలుసుకుంది. దీనికి తోడు అలసత్వంగా ఉన్న పలువురు తహశీల్దార్లకు కూడా కోటింగ్ ఇచ్చింది. ఇదు వరకు ఉన్న కలెక్టర్ మీనా ఏదైనా నేరుగా తహశీల్దార్లతో మాట్లాడేవారు. కానీ ప్రస్తుత కలెక్టర్ నిర్మల మాత్రం డిఆర్ఓ, ఆర్డీఓలతోనే మాట్లాడి, వారి ద్వారా తహశీల్దార్లకు పనులను అప్పగిస్తుంది. ఇది ఒకంత మంచిదేనని.. ఇదే అడ్మినిస్ర్టేషన్ పద్దని అని పలువురు అధికారులు చెబుతున్నారు.
అయితే ప్రస్తుతం జిల్లాలో అధికారులు, ఉద్యోగుల ఖాళీల కొరత తీవ్రంగా వేధిస్తుంది. జాయింట్ కలెక్టర్ (ఇంకా విధుల్లో చేరలేదు), జిల్లా వెనుకబడిన తరగతుల జిల్లా శాఖాధికారి(డిబిసిడబ్ల్యూఓ), జిల్లా యువజన సంక్షేమాధికారి, నేషనల్ ఛైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ అధికారి, డిసిఓ, ఆర్వీఎం ఇఇ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యాశాఖలో 24 మంది డిప్యూటీ ఐఓఎస్‌కు కేవలం ముగ్గురు మాత్రమే పర్మినెంట్ అధికారులున్నారు. జిల్లాలో 24 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు(ఎఇ), ఆరుగురు డిఇలు, ఇఇ ఉండాలి. కానీ జిల్లాలో కేవలం 9 మంది ఎఇలు, ముగ్గురు డిఇలు ఉన్నారు. ఇఇ పోస్టులో కూడా సీనియర్ డిఇనే ఇన్‌ఛార్జీ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఇలా అన్ని విభాగాల్లోనూ ఖాళీలున్నాయి. వీటన్నింటినీ సమస్వయం చేసుకుంటూ జిల్లాలో గాడీలో పెట్టేపనిలో జిల్లా కలెక్టర్ నిర్మల ఉన్నారు. ఇది జరిగితేనే పాలన సక్రమంగా సాగుతుంది అని అధికారులు, ప్రజలు పేర్కొంటున్నారు.

No comments:
Post a Comment