Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad
Showing posts with label Hydrabad. Show all posts
Showing posts with label Hydrabad. Show all posts

Saturday, 30 July 2016

ఎంసెట్‌ లీకవుతుందని ముందే జ్యోతిష్యం

ఎంసెట్‌ లీకవుతుందని ముందే జ్యోతిష్యం
హైద్రాబాద్‌, జూలై 30,
2016, ఏప్రిల్‌ 8? దుర్ముఖి నామ సంవత్సరం ప్రవేశించిన వేళ, రవీంధ్రభారతిలో యువ సిద్ధాంతి, పంచాంగకర్త చెప్పిన మాటలు సాకారమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు రవీంధ్రభారతిలో ఆసీనులైన వేళ? పంచాంగ శ్రవణం చేసిన సంతోష్‌ కుమార్‌ శర్మ, ఈ సంవత్సరం విద్య, వైద్య రంగాల్లో అవినీతి పెరుగుతుందని, అక్రమాలు జరిగి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భవిష్యత్తు గురించి హెచ్చరికలతో కూడిన వ్యాఖ్యలు చేసారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగిస్తూ? పంచాంగకర్త సంతోష్‌ కుమార్‌ చెప్పిన ముందస్తు అంచనాలను ప్రస్తావిస్తూ, మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలు కాస్తంత జాగ్రత్తగా ఉండాలని నవ్వుతూ సరదా వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే నాడు సరదాగా చేసిన వ్యాఖ్యలే నేడు సీరియస్‌ రూపం సంతరించుకోవడం విశేషం. తాజా ఎంసెట్‌-2 ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన తరువాత, నాటి పంచాంగ శ్రవణం నిజమైందని ఈ సందర్భంగా పలువురు విశ్లేషిస్తున్నారు. ఆనాటి వీడియో క్లిప్పింగ్స్‌ లో పంచాంగకర్త సంతోష్‌ వ్యాఖ్యలను, కేసీఆర్‌ హెచ్చరికలను చూపిస్తూ, టీవీ చానళ్లలో ఇప్పుడు ప్రత్యేక కధనాలు ప్రసారం అవుతున్నాయి. కాగా, ఎంసెట్‌-2 నిర్వహణ బాధ్యతలు తమవి కావంటే తమవి కావని అటు విద్యా శాఖ మంత్రి, ఇటు ఆరోగ్య శాఖా మంత్రులు చెబుతుండటం గమనార్హం. విద్యార్ధులు మాత్రం మరోసారి ఎంసెట్‌ రాసేందుకు ససేవిూరా అంటున్నారు. జ్యోతిష్యం నమ్మకం లేని వారికి ఇదొక ప్రత్యక్ష సాక్ష్యం అంటున్నారు పంచాంగ నమ్మకస్తులు.

హైద్రాబాద్‌ లో ఇంటి నెంబర్లకు ఎనిమిది డిజిట్లతో కోడ్‌

 హైద్రాబాద్‌ లో ఇంటి నెంబర్లకు ఎనిమిది డిజిట్లతో కోడ్‌
హైద్రాబాద్‌, జూలై 30,
హైద్రాబాద్‌ నగరంలో ఏదైనా అడ్రస్‌ వెతకబోతే... ఆగమయ్యే పరిస్థితి నేడు... అందుకే ఇల్లు కోసం గల్లీ గల్లీ తిరిగే పనిలేకుండా.. ఈజీగా అడ్రస్‌ దొరికేలా బల్దియా స్మార్ట్‌ చిరునామాలను అందుబాటులోకి తేనుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా జీహెచ్‌ఎంసీ కసరత్తు చేస్తున్నప్పటికీ నగరంలో ఇంటి నెంబర్ల సులభతరానికి చేస్తున్న ప్రయత్నం కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఎలాగైన నగరవాసులకు సులభమైన ఇంటి నెంబర్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఇప్పటికే జిప్పర్‌ సొల్యూషన్స్‌ సంస్థ ఆధ్వర్యంలో నెంబర్లను సులభతరం చేసే ప్రక్రియను చేపట్టారు. గగన్‌మహెల్‌, కూకట్‌పల్లిలోని రెండువార్డుల్లో దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఇంటి నెంబర్‌ చెప్పాలంటే.. పదుల సంఖ్యలో అంకెలు.. బైలు.. డ్యాష్‌లు, కామాలు.., అబ్లిక్‌లు ఎట్‌సెట్రా.. వారం రోజులు కఠస్తం చేసినా.. గుర్తుండని అడ్రస్‌. చెప్పేవారికి..వినేవారికి ఇది కష్టమే... అయితే ఇక కఠిన చిరునామాకు చెక్‌ పెట్టనున్నారు. వాహన నెంబర్ల తరహాలో ఎనిమిది అంకెల్లో కోడ్‌ నెంబరు ఇవ్వనున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో ఆ నెంబర్‌ను ఎంటర్‌ చేయగానే పూర్తి చిరునామా ప్రత్యక్షమవుతుంది. ఇప్పటికే గగన్‌మహెల్‌, కూకట్‌పల్లిలోని రెండు వార్డుల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేయగా, అందులో స్వల్ప మార్పులు చేస్తూ ఈ కొత్త విధానాన్ని చేపట్టారు. జిప్పర్‌ అప్లికేషన్స్‌ సంస్థ ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఆస్కీ) సహకారంతో ప్రత్యేకంగా ఓ మొబైల్‌ అప్లికేషన్‌ను రూపొందిస్తోంది. ఇప్పటికే గగన్‌మహల్‌, కూకట్‌పల్లి వార్డుల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయగా... ప్రస్తుతం స్వల్ప మార్పులతో తుదిరూపం ఇవ్వనున్నారు. నాలుగు ఆంగ్ల అక్షరాలు, మరో నాలుగు అంకెల రూపంలో మొత్తం ఎనిమిది డిజిట్లలో ఈ కోడ్‌ ఉండనుంది. కోడ్‌ను మొబైల్‌ యాప్‌లో టైప్‌ చేయగానే చిరునామా వివరాలు ప్రత్యక్షమయ్యేలా తయారు చేస్తున్నారు. అక్షరాలు రోడ్డు నంబర్లను... అంకెలు ఇంటి నంబర్లను సూచించనున్నాయి. గూగుల్‌ మ్యాప్‌కు కూడా దీన్ని అనుసంధానం చేయనున్నారు. స్మార్ట్‌ఫోన్‌ లేకుంటే ఎస్‌ఎంఎస్‌ పం పినా అడ్రస్‌ తెలిసేలా టోల్‌ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తేనున్నారు. నెల రోజు ల్లో పూర్తి డేటాను సేకరించి దశలవారీగా అమలు చేయనున్నారు.ఈ కోడ్‌ నెంబర్‌ను మొబైల్‌ యాప్‌లో ఎంటర్‌ చేయగానే చిరునామా ప్రత్యక్షమవుతుంది. గూగుల్‌ మ్యాపింగ్‌తో కూడా దీన్ని అనుసంధానం చేస్తున్నారు. ప్రాంతాలవారీగా వీధుల ప్రారంభంలో బోర్డులు ఏర్పాటు చేసి ఏ ఇంటి నెంబరు నుంచి ఏ ఇంటి నెంబరు వరకు ఆ వీధిలో ఉన్నాయో సూచిస్తారు. కొత్త నెంబర్లలో నాలుగు ఆంగ్ల అక్షరాలు, మరో నాలుగు అంకెలు(నెంబర్లు) ఉంటాయి. నాలుగు ఆంగ్ల అక్షరాల్లో రెండు ప్రధాన రహదారిని, మిగిలిన రెండు అనుబంధ రహదారిని సూచిస్తాయి. అలాగే, నాలుగు అంకెల్లో రెండు ప్రధాన ఇంటి నెంబర్‌ను, మిగిలిన రెండు అనుబంధంగా ఉండే ఇంటి నెంబర్లను సూచిస్తాయి. ప్రతి వంద విూటర్ల వరకు రోడ్డును ఒక సెగ్మెంట్‌గా పరిగణిస్తారు. ఇంగ్లీష్‌ లెటర్స్‌, 1 నుంచి 8 అంకెలను ఈ కోడ్‌లో ఉపయోగిస్తారు. ఉదాహరణకు మూసారంబాగ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌కు నెంబర్లు కేటాయించాలనుకుంటే.. అందులో ముందుగా విజయవాడ వెళ్లే రహదారికి ంం అని, అలాగే దానికి అనుబంధంగా వెళ్లే సబ్‌రోడ్‌కు ఃః అని,అపార్ట్‌మెంట్‌కు 01గా, అందులోని మూడో నెంబరు ఫ్లాట్‌కు 03గా కేటాయిస్తారు. మొత్తంగా ంంఃః0103 అని ఉంటుంది. ఒకవేళ ఇండిపెండెంట్‌ ఇల్లయితే ంంఃః0100గా ఉంటుంది. ఈ నెంబర్‌ను స్మార్ట్‌ఫోన్‌లో సంబంధిత యాప్‌లో ఎంటర్‌ చేయగానే ఇంటి చిరునామా వివరాలు, ఎలా వెళ్లాలో కూడా గూగుల్‌ మ్యాప్‌ ద్వారా వివరంగా వస్తుంది. నేవిగేషన్‌ సెట్‌ చేసుకుంటే గూగుల్‌ మ్యాప్‌ద్వారా సులభంగా ఇంటికి చేరుకునే అవకాశం ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ లేకుంటే మామూలుగా ఎస్‌ఎంఎస్‌ పంపినా వెంటనే చిరునామా ఎస్‌ఎంఎస్‌ రూపంలో వస్తుంది. దీనికోసం త్వర లో టోల్‌ఫ్రీ నెంబరు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. 

హరీష్‌ రావు 24/7

హరీష్‌ రావు 24/7


హైద్రాబాద్‌, జూలై 30,
బిజీగా ఉన్నా తరువాత చేయండి.. అంటూ చాలామంది ఫోన్స్‌ కట్‌ చేస్తూ ఉంటారు! అందరూ చెప్పే రొటీన్‌ సాకు.. ''బిజీగా ఉన్నాను'' అనడం! అయితే తెలంగాణ నీటిపారుదల శాఖమంత్రి హరీష్‌ రావు అలాకాదు. ఆయన ఎంత బిజీగా ఉన్నా తిరిగి కాల్‌ చేస్తారట! ఈరోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఎంతమంది ఉంటారు చెప్పండీ..? చాలా అరుదు కదా. అలాంటి జాబితాలో మంత్రి హరీష్‌ రావు పేరును చేర్చాల్సిందే. ఎందుకంటే ఆయన తెలంగాణ ప్రజలకు ఫోన్‌ లో అందుబాటులో ఉంటున్నారట. రోజులో కొన్ని గంటలే అని కాకుండా.. రోజంతా అంటే 24 గంటలూ 365 రోజలూ ఆయన ఫోన్‌ లో అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఏదైనా విూటింగ్‌ లో ఉన్నప్పుడు ఫోన్లు వచ్చాయే అనుకోండి... ఆ విూటింగ్‌ అయిన వెంటనే మిస్డ్‌ కాల్స్‌ చూసుకుని మరీ కాల్‌ బ్యాక్‌ చేసి ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నారట.సొంత నియోజక వర్గం సిద్ధిపేట నుంచే కాదు - రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రతీ రోజూ ఎన్నో కాల్స్‌ వస్తుంటాయని నాయకులు చెబుతున్నారు. ఎన్ని ఫోన్లు వచ్చినా మంత్రి విసుగు లేకుండా మాట్లాడతారని అన్నారు. రోజువారీ వచ్చే కాల్స్‌ లో ఆరోగ్య సమస్యలకి సంబంధించినీ - ప్రభుత్వం తరఫున చికిత్స కోసం అర్జీలే ఎక్కువగా ఉంటున్నాయని పార్టీ నేతలు వివరించారు. పోలీసు స్టేషన్లలో ఉన్న పెండింగ్‌ కేసులు - ఇతర ప్రభుత్వ శాఖల వద్ద పెండింగ్‌ లో ఉన్న తమ పనుల పరిస్థితుల గురించి ప్రజలు ఎక్కువగా హరీష్‌ తో ఇంటరాక్ట్‌ అవుతున్నట్టు చెప్పారు. ప్రజల సమస్యలకు వెంటనే పరిష్కార మార్గాలను కూడా హరీష్‌ సూచిస్తూ ఉంటారట.నిజానికి - ఇలా ఫోన్‌ లో ప్రజలకు అందుబాటులో ఉండటం అనేది మంత్రి హరీష్‌ రావుకు కొత్తగా అలవడింది కాదు! తెలంగాణ ఉద్యమ సమయం నుంచే ఈ అలవాటు ఆయనకి ఉంది. 2000 సంవత్సరానికి ముందు నుంచే ఆయన ఫోన్‌ లో ప్రజలకు అందుబాటులో ఉండటం ప్రారంభించారు. ఉద్యమ తీరు తెన్నులను ఎప్పటికప్పుడు ప్రజలను అడిగి తెలుసుకుంటూ ఉండేవారు. సో... ఇప్పుడు మంత్రిగా కూడా అదే అలవాటును కొనసాగించడం మెచ్చుకోదగ్గ విషయమే. ఫోన్‌ నంబర్లు బహిర్గతం చేసేందుకు భయపడుతున్న నాయకులున్న ఈ రోజుల్లో - మిస్డ్‌ కాల్‌ ఇచ్చినా కూడా స్పందించే మంత్రి ఉండటం హర్షించదగ్గ విషయం. ఇతర నాయకులు కూడా హరీష్‌ ను ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుంది

వచ్చే నెలలో ఎంసెట్‌ 3

 వచ్చే నెలలో ఎంసెట్‌ 3
హైద్రాబాద్‌, జూలై 30,
ఎంసెట్‌ లీకేజీ నిర్ధారణ కావడంతో వచ్చే నెలలో ఎంసెట్‌ 3 నిర్వహించడానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే లీకేజీ నిజమని ముంబై కేంద్రంగా ఆపరేషన్‌ సాగిందని దాదాపు 150 మందికి పైగ విద్యార్థులు లాభపడ్డారని సీఐడీ తన నివేదికలో తేల్చిచెప్పింది. ఒకవేళ రద్దు చేయకపోతే న్యాయపరమైన చిక్కుల వస్తాయని సూచించారు. దీంతో రద్దు నిర్ణయానికే మొగ్గు చూపారు. ఇప్పడు విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయాల్సి వస్తోంది. అంతకు మందు సవిూక్షంచిన సీఎం ప్రశ్నపత్రాలు లీకయిన సందర్భాల్లో దేశంలోని పలు యూనివర్శిటీలు వ్యవహరించిన తీరు అందుకు సంబంధించి ఆయా రాష్ట్రాల హైకోర్టులు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను న్యాయశాఖ కార్యదర్శి తదితర న్యాయ శాఖ అధికారులతో చర్చించారు.పోలీసు విచారణ రిపోర్టును అనుసరించి లీకుద్వారా ర్యాంకులు పొందిన విద్యార్దులను అనర్హులుగా ప్రకటించి వారికి అవకాశం ఇవ్వకుండా అడ్మిషన్లను చేపడితే ఎట్లా ఉంటుందని సీఎం ఆరా తీశారు. వరుస ఎంట్రెన్స్‌ లతో వైద్యవిద్యార్థులు
ఇప్పటికే అలసిపోయి విసిగిపోయి ఉన్న విషయాన్ని సమావేశం చర్చించింది. వేలాది మందిని మానసిక క్షోభకు గురి చేసిన ఈ దురదృష్టకర సంఘటన పట్ల సీఎం సహా అందరూ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. పరీక్షాపత్రాల లీకేజీల పట్ల తెలంగాణ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరమున్నదని సమావేశం అభిప్రాయ పడింది. నేరస్తులకు కఠిన చట్టాలను వర్తింపచేసి మరోసారి పునరావృతం కాకుండా చూడాలని, పేపరు లీకుకు పాల్పడిన వారితో పాటు ప్రోత్సహించిన వారిని వాటిని వినియోగించుకున్న వారిని కఠినంగా శిక్షించాలని సమావేశంలో పాల్గొన్న వైస్‌ ఛాన్సలర్లతో పాటు పలువురు అధికారులు సీఎం కు సూచించినట్టు తెలిసింది.దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 80 సార్లు వివిధ పరీక్షాపత్రాలు లీకు అయ్యాయని, కాగా దాదాపు అన్ని పరీక్షలను రద్దు చేసి తిరిగి
నిర్వహించారని అధికారులు సిఎంకు వివరించారు. సుప్రీం కోర్టు కూడా పరీక్ష తిరిగి నిర్వహించడమే సరియైనదిగా తీర్పునిచ్చిందని తెలిపారు. అత్యున్నత న్యాయస్తానం గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నడుచుకోవాలని సమావేశం నిర్ణయించినట్టు సమాచారం.ఈ నేపధ్యంలో పలువురు ఉన్నతాధికారులు విద్యా కోవిదులు మంత్రుల సలహా సూచనల మేరకు ఎం సెట్‌ 2 ను రద్దు చేయడమే సరియైన నిర్ణయంగా సిఎం భావించినట్టు సమాచారం.కాగా ఇప్పటికే పరీక్షలు రాసిన విద్యార్ధులకు ఊరటనిచ్చే విధంగా తిరిగి పరీక్షఫీజును చెల్లించాల్సిన అవసరం లేకుండా పాత రిజిష్ట్రేషన్‌ ప్రకారమే తిరిగి పరీక్ష రాసేందుకు వెసులు బాటును కల్పించేదుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నది. పరీక్షరోజున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్దులకు ఉచిత ప్రయాణ వసతి కల్సించేందుకు సిఎం సంబంధిత
అధికారులతో చర్చించినట్టు సమాచారం.వేలాది మంది విద్యార్ధులు వారి తల్లి దండ్రులను క్షోభకు గురిచేసే విధంగా వ్యవహరించి మెడికల్‌ ఎంట్రెన్స్‌ ప్రశ్నపత్రం లీక్‌ కు కారకులు ఎంతటివారయినా వారిని అత్యంత కఠినంగా శిక్షాల్సిందేనని సమావేశం చేసిన సూచనలను సీఎం పరిగణలోకి తీసుకన్నట్టు సమాచారం.భవిష్యత్తులో ఇటువంటి నేరానికి పాల్పడాలంటే భయపడే విధంగా ఆ శిక్షలు అమలు చేయాలని సీఎం నిర్ణయించినట్టు తెలిసింది

నేరగాళ్లుగా మారిన సమైక్యాంధ్ర నేతలు

 నేరగాళ్లుగా మారిన సమైక్యాంధ్ర నేతలు
విశాఖపట్టణం, జూలై 30,
ఉన్నత విద్యావంతులు, ఒకప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమ జేఏసీ నాయకులు, సమైక్యాంధ్ర పార్టీ తరఫున ప్రజా ప్రతినిధులుగా పోటీ చేసిన వ్యక్తులు నేరగాళ్లుగా మారిపోయారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్రైవేటు స్కూళ్ల నుంచి విజిలెన్స్‌ ప్రత్యేక అధికారుల పేరుతో అక్రమ వసూళ్లకు దిగారు. ఆరుగురు సభ్యుల్లో నలుగురిని అరెస్టు చేశామన్నారు. విశాఖపట్నం జిల్లా ఆంటోని నగర్‌ పరిధి మహారాణిపేటకు చెందిన జొల్ల తారకరామారావు, సింగంపల్లి జగదీష్‌, విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మరడాంకు చెందిన లగుడు గోవిందు(డాక్టరేట్‌ విద్యావంతుడు), విజయనగరంలోని వివేకానంద కాలనీకి చెందిన వర్రి హరీష్‌, ఏయూ విద్యార్థులు చల్లా నరేష్‌కుమార్‌, అట్టాడ అవినాష్‌లు బృందంగా ఏర్పడ్డారు. విజిలెన్స్‌ బృందం పేరుతో ఉత్తరాంధ్ర మూడుజిల్లాల్లోని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ వస్తున్నారు. నిందితుడు రామారావు సమైక్యాంధ్ర తరఫున విశాఖపట్నం ఎంపీగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయగా, మరో నిందితుడు గోవిందు ఇదే పార్టీ తరఫున విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ప్రస్తుతం వీరు బ్లూ బుగ్గకారుతో ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్లి అక్రమ వసూళ్లు చేస్తున్నారు. గత 14 రోజులుగా వసూళ్లను ముమ్మరం చేశారు. పాఠశాలలు సందర్శించడం, మరుగ దొడ్లు, మౌలిక వసతుల పరిశీలించడం, పాఠశాలలు బ్లాక్‌లిస్టులో పెట్టి గుర్తింపు రద్దు చేస్తామని బెదిరించి బేరం కుదుర్చు కోవడం, డబ్బులు వసూలయ్యాక వెళ్లిపోవడం వీరి విధి. అయితే, కార్పొరేట్‌ పాఠశాలల జోలికి వెళ్లడంలేదు. చిన్న పాఠశాలు, గ్రావిూణ ప్రాంత పాఠశాలలను లక్ష్యంగా చేసుకున్నారు. మూడు జిల్లాల్లో 54 పాఠశాలల నుంచి రూ.8.50 లక్షలు వసూలు చేశారు. ప్రస్తుతం పోలీసులు రూ. 50,300, ఇన్నోవా కారు, మూడు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై జేఆర్‌ పురం పీఎస్‌ల
రెండు, నరసన్నపేటలో మూడు, కోటబొమ్మాలిలో మూడు, టెక్కలిలో ఒక కేసు నమోదయ్యింది. ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి పట్టుకున్నారు.

బిస్కెట్ల బ్రాండ్‌ అంబాసిడర్‌గా శృతి హాసన్‌

బిస్కెట్ల బ్రాండ్‌ అంబాసిడర్‌గా శృతి హాసన్‌
హైద్రాబాద్‌, జూలై 30,
శృతి హాసన్‌ నేటివ్‌గా సౌత్‌ హీరోయిన్‌ అయినా.. ఇప్పుడు ఇండియా మొత్తంలో క్రేజ్‌ సంపాదించేసింది. అటు పెర్ఫామెన్స్‌ తో పాటు ఇటు గ్లామర్‌ డోస్‌ లోనూ శృతికి ట్యాలెంట్‌ చాలా ఎక్కువ. అందుకే శృతి స్పీడ్‌ని క్యాష్‌ చేసుకునేందుకు చాలా కంపెనీలు ట్రై చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సౌత్‌ బ్యూటీ పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా.. ఇప్పుడో బిస్కెట్ల కంపెనీకి కూడా సైన్‌ చేసింది. యూనిబిక్‌ అనే బిస్కెట్ల కంపెనీ ఈ హాట్‌ బ్యూటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే తీసిన కమర్షియల్స్‌ అటు వెబ్‌ లోను.. ఇటు టీవీలో హల్‌ చల్‌ చేస్తున్నాయి.ప్రస్తుతం శృతి హాసన్‌ యూత్‌ ఐకాన్‌ అని.. ఈ బబ్లీ బేబీకి.. తమ బిస్కెట్లకు దగ్గర పోలికలు ఉండడంతోనే ఆమెను ఎంపికచేసుకున్నామని అంటున్నాయి కంపెనీ వర్గాలు. మొత్తానికి శృతి హాసన్‌ మాత్రం ఇంటర్నేషనల్‌ బ్రాండ్లను బాగానే ఒడిసి
పట్టుకుటోంది. సినిమాల విషయంలో చూపించిన ట్యాలెంట్‌ యాడ్‌ విషయంలోనూ అప్లై చేస్తోంది శృతి. 

జనతా శాటిలైట్‌ రైట్స్‌ కు ఫుల్‌ డిమాండ్‌

 జనతా శాటిలైట్‌ రైట్స్‌ కు ఫుల్‌ డిమాండ్‌
హైద్రాబాద్‌, జూలై 30,
చాలా ప్రముఖ విూడియా ఛానల్స్‌ ఉన్న మన తెలుగులో.. సినిమాలను కొనుక్కో వాలంటే మాత్రం ముగ్గురే ముగ్గురు. మా టివి.. జీ తెలుగు.. జెమిని టివి తప్పిస్తే అసలు మిగిలిన వారు శాటిలైట్‌ బిజినెస్‌ లో మాత్రం వేలు పెట్ట ట్లేదు. ఇకపోతే ఇప్పుడు ''జనతా గ్యారేజ్‌'' శాటిలైట్‌ రైట్ల గురించి మాట్టాడుకోవా ల్సిన సమయం వచ్చేసింది. ఇప్పటికే సినిమాను సెప్టెంబర్‌ 2న వితౌట్‌ ఎనీ డౌట్‌ రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించేశాడు కొరటాల శివ. అందుకే ఈ సినిమా శాటిలైట్‌ రైట్స్‌ను కూడా.. కొరటాల గత సినిమా శ్రీమంతుడుని కొనుక్కున్న జీ తెలుగు ఛానల్‌ కొంటుందని కొందరు అంటే.. అబ్బే కాదు ఎన్టీఆర్‌ గత సినిమాను కొనుక్కున్న జెమిని వారే తీసుకుంటారు అని మొన్నటి వరకు టాక్‌ ఉండేది. అయితే ఇప్పుడు వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ.. మొన్ననే ఎన్టీఆర్‌కు ''ఉత్తమ నటుడు'' అవార్డును ఇచ్చిన మా టివి వారు ఈ సినిమా శాటిలైట్‌ హక్కులను దక్కించు కున్నారట. దాదాపు 12.5 కోట్లకు మా టివి ఈ డీల్‌ క్లోజ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం విన్న ఎవరైనా కూడా.. అవా ర్డిచ్చి రైట్స్‌ పట్టేశా రుగా అంటూ కామెంట్లు చేస్తు న్నారు. నిజానికి పైన పేర్కొన్న మూడు ఛాన ల్స్‌లో ఎవరు బెస్ట్‌ డీల్‌ ఆఫర్‌ చేశారో వారికి అమ్మేశాం అంటున్నారు మైత్రి మూవీస్‌ వర్గాలు.

Saturday, 11 June 2016

రోగుల సహనాన్ని టెస్ట్‌ చేస్తున్న చెస్ట్‌

 రోగుల సహనాన్ని టెస్ట్‌ చేస్తున్న చెస్ట్‌


హైదరాబాద్‌, జూన్‌ 11,
పేదలకు మెరుగైన వైద్యమందించేందుకు ఏర్పాటైన చెస్ట్‌ హాస్పెటల్‌ లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ఇక్కడి వసతులలేమి రోగుల సహనానికి పరీక్షపెడుతోంది. బ్లడ్‌ టెస్ట్‌ లు చేయించుకోవాలన్నా, హాస్పిటల్లో బెడ్‌ దొరకాలన్నా నెలల తరబడి వేచి ఉండాల్సిందే. చాంతాడంత ఉంటే వెయిటింగ్‌ లిస్ట్‌ లో తమ టర్న్‌ ఎప్పుడొస్తుందో తెలీక రోగులు నానాపాట్లు పడుతున్నారు. సరిగ్గా చెప్పాలంటే ఇక్కడి పరిస్థితి చూసి విసిగెత్తిపోతున్నారు.
టిబి, ఆస్తమా రోగాల ట్రీట్‌ మెంట్‌ కు చెస్ట్‌ హాస్పిటల్‌ ను ఏర్పాటుచేశారు. అయితే ఆసుపత్రి తీరు పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా ఉంది. చికిత్స కోసం రోజుల తరబడి రోగులు వేచి ఉండాల్సిన స్థితి నెలకొంది. టెస్ట్‌ ల పేరుతో కాలయాపన జరుగుతోంది. ఈ హాస్పిటల్‌ కు సాధారణంగా పేద రోగులే అధికంగా వస్తుంటారు. దీంతో ఇంటికి వెళ్లి తిరిగి రాలేక ఆసుపత్రి ప్రాంగణంలోనే అనేకమంది కాలం వెళ్లదీస్తున్నారు.
చెస్ట్‌ హాస్పిటల్‌ లో టీబీ, ఆస్తమా రోగులందరికీ ఒకే ప్రాంగణంలో చికిత్సనందించడం ఆందోళనకరంగా మారింది. రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతున్నా హాస్పిటల్‌ లో మార్పులు చేపట్టకపోవడం మరో సమస్య. మొత్తంగా చెస్ట్‌ హాస్పిటల్‌ రోగుల సహనాన్ని టెస్ట్‌ చేస్తోంది. ఆసుపత్రిలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించి మెరుగైన చికిత్సనందించేలా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. 

Saturday, 16 April 2016

ఒకవైపు ఆరాటం..మరోవైపు ఆర్బాటం

ఒకవైపు ఆరాటం..మరోవైపు ఆర్బాటం
హైదరాబాద్‌ , ఏప్రిల్‌ 16 :
వేసవి లో భానుడి ప్రతాపం తీవ్ర రూపం దాల్చాడు.రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సగటు జీవిని బెంబేలెత్తిస్తుంది.ఇక ఈ వేసవిలో నీటి సమస్య అంతా ఇంతా కాదు.ఓవైపు నీటు కోసం జనాలు పడిగాపులు పడుతుంటే మరో వైపు నీటి తో ఆటలు ఆడుతున్నారు.జనాలు గుక్కెడు నీరు కోసం ఇబ్బందులు పడుతుంటే...నీటి తో ఆటలు ఆడుతున్నది ఎవరు.
తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచి కొడుతున్నాయి.మార్చి నుండి మొదలైన ఎండలు రోజు రోజు కి టెంపరరేచర్‌ ను పెంచెస్తున్నాయి.దాదాపు ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో 46డిగ్రీల వరకు నమోదయ్యాయి.ఈ ఎండలో తాగాడానికి గుక్కెడు నీరు లేక ఇరు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నీటిని కూడా రైళ్ళలలో తరలించే పరిస్థితి వచ్చిందంటే దేశం లో నీటి ఎద్దడి ఏ స్థితి లతో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఓ వైపు తాగడానికి నీరు లేవని ప్రజలు అల్లాడుతుంటే నీటి తో ఆటలాడుతున్నారు బడా బాబులు. స్విమ్మంగ్‌ పూల్స్‌ లో నీటిని వృథా చేస్తున్నారు.ఇక సంపన్న వర్గాల వారైతే పండగ వచ్చిన పబ్బం వచ్చినా..వాటర్‌ తో చేయాల్సినా నానా రచ్చ చేసేస్తున్నారు. పూల్‌ డాన్స్‌, రైన్‌ డాన్స్‌, ఇలా అన్ని రకాలుగా వాటర్‌ ని వృధా చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఎండా కాలం కాబట్టి నీటి లో సేద తీరుతున్నామని కవరింగ్‌ మరీ...
ఇక మరో వైపు అయితే ఐపిఎల్‌ మ్యాచ్‌ లకు వాటర్‌ ను దేశవ్యాప్తంగా ఉన్న గ్రౌండ్‌ ల ను క్లీన్‌ చేయడానికి వినియోగిస్తున్నారు.రాష్ట్రాలలో నెలకొన్న తీవ్ర కరువు, నీటి సమస్యను పరిష్కరించేందుకు ముంబాయ్‌ ప్రభుత్వం తొలి అడుగుగా మహరాష్ట్ర లో మ్యాచ్‌ లను కాన్సిల్‌ చేసుకున్నాయి. నీరు అందుబాటులో లేక కొంత మంది మృత్యువాత పడుతున్న నేపథ్యం లో ఇలా నీటిని గ్రౌండ్‌ క్లీన్‌ చేయడానికి వాడడం ఎంటని విమర్శకులు పెదవి విరుస్తున్నారు.

కొత్త విద్యాసంవత్సరంలో ప్రవేశాలు లేనట్లే

కొత్త విద్యాసంవత్సరంలో ప్రవేశాలు లేనట్లే
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 :
తెలంగాణలో ఇంజనీరింగ్‌ కాలేజీల పతనావస్థ కొనసాగుతోంది. ఓవైపు ఇంజనీరింగ్‌ కాలేజీలపై ప్రభుత్వ కఠిన వైఖరి, మరోవైపు ఊపిరాడకుండా చేస్తున్న సమస్యల నేపథ్యంలో రేసు నుంచి తప్పుకొనేందుకు యాజమన్యాలు నిర్ణయించుకుంటున్నాయి. నూతన విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే జేఎనటీయూ కాలేజీల జాబితా నుంచి 58 ఇంజనీరింగ్‌ కాలేజీలు 'ఔట్‌ అయ్యాయి. 2016-17 విద్యా సంవత్సరానికిగాను కాలేజీ నడిపించేందుకు తప్పనిసరిగా కావాల్సిన వర్సిటీ అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్‌) కోసం ఆ కాలేజీలు దరఖాస్తు చేసుకోలేదు. దీంతో నిబంధనల ప్రకారం వర్సిటీ అఫిలియేషన లేని ఆ కాలేజీల్లో 2016-17 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలు నిర్వహించేందుకు అవకాశం లేదు. గుర్తింపునకు దరఖాస్తు కోసం జేఎనటీయూ ఈ యేడాది ఫిబ్రవరి 10న నోటిఫికేషన జారీ చేసింది.
మార్చి 20వ తేదీ వరకు అవకాశం కల్పించింది. కాగా 266 కాలేజీలకుగాను 208కాలేజీలు మాత్రమే అఫిలియేషన కోసం దరఖాస్తు చేసుకున్నాయి. 58 కాలేజీలు దరఖాస్తు చేసుకోలేదు. ఈ కాలేజీల జాబితాను జేఎనటీయూ గురువారం బయటపెట్టింది. సదరు కాలేజీలకు నోటీసులు జారీచేసి, చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కాలేజీల్లో ఇప్పటికే ఇంజనీరింగ్‌ సెకండ్‌, థర్డ్‌, ఫోర్త్‌ ఇయర్‌ కోర్సులు నడుస్తున్నాయి. అన్ని కోర్సుల్లో కలిపి దాదాపు 7వేల మంది విద్యార్థుల వరకు ఉంటారని అంచనా. దీంతో ఈ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ప్రతి యేడాది నూతన విద్యా సంవత్సరంతో పాటు ఇప్పటికే కొనసాగుతున్న కోర్సులకు కూడా కాలేజీ యాజమాన్యం వర్సిటీ అనుంబంధ గుర్తింపు తీసుకోవాలి. కానీ ఈ కాలేజీల యాజమాన్యాలు మాత్రం మొదటి సంవత్సర ప్రవేశాలతో పాటు ఇప్పటికే కొనసాగుతున్న మిగతా మూడు సంవత్సరాలకు కూడా అఫిలియేషనకు దరఖాస్తు చేయలేదు దీంతో ఆ కాలేజీల్లోని విద్యార్థులకు వార్షిక పరీక్షలు రాసే అవకాశం ఉండదు. వారికి డిగ్రీలు కూడా ఇవ్వరు. మరోవైపు కాలేజీలు చేసిన తప్పులకు విద్యార్థులు ఇబ్బంది పడకుండా జేఎనటీయూ చర్యలు చేపట్టనుంది. ఈ కాలేజీలు అఫిలియేషన తీసుకునేందుకు నిరాకరిస్తే, వారిపై చర్యలు తీసుకుని, విద్యార్థులను ఇతర కాలేజీల్లో చేర్పించాలని నిర్ణయించింది.
భారీగా తగ్గనున్న సీట్లు :
రెండేళ్లుగా తగ్గుముఖం పడుతున్న ఇంజనీరింగ్‌ సీట్ల సంఖ్య ఈ యేడాది కూడా భారీగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. 2015-16 విద్యా సంవత్సరానకి సంబంధించి తెలంగాణలో 266 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 1,26,468 సీట్లు అందుబాటులో ఉండగా 51621 సీట్లు భర్తీ అయ్యాయి. ప్రస్తుతం 2016-17 విద్యా సంవత్సరానికి అఫిలియేషన్‌కు 58 కాలేజీలు దరఖాస్తు చేసుకోకపోవడంతో ఈ కాలేజీల్లో ఉన్న 20వేల సీట్లు తగ్గే అవకాశం ఉంది. మరోవైపు జేఎనటీయూ అనుబంధ కాలేజీల్లో నిర్వహిస్తున్న తనిఖీలు మరో వారంలో పూర్తికానున్నాయి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కాలేజీలపై కొరడా ఝుళిపించనున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని కాలేజీలు మూతపడి సీట్ల సంఖ్యలో కొతపడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

Thursday, 14 April 2016

హైదరాబాద్‌ :'అవసరమయితే బిక్షమెత్తుకుంటాం'

'అవసరమయితే బిక్షమెత్తుకుంటాం'

హైదరాబాద్‌ :

ఆఖరికి బిక్షమెత్తుకుంటాం కాని అధికారం కోసం తెరాస పంచన చేరబోనని కాంగ్రెస్‌ మహిళా నేత, గద్వాల్‌ ఎమ్మెల్యే డీకే ఆరుణ వ్యాఖ్యానించారు. తన సోదరుడు, మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ లో చేరడంపై ఈ మధ్యాహ్నం స్పందించిన ఆమె, రామ్మోహన్‌ రెడ్డి చేసిన పనితో తమ తండ్రి ఆత్మ క్షోభిస్తోందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు తెలంగాణ రాష్ట్ర సమితి తిలోదకాలు ఇచ్చిందని ఆరోపించిన ఆమె, కేసీఆర్‌ కు చిత్తశుద్ధి ఉంటే రామ్మోహన్‌ రెడ్డితో రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ అవినీతి పాలనకు చరమగీతం పాడే రోజు త్వరలోనే రానుందని అరుణ అంచనా వేశారు.కుటుంబంలో చిచ్చుపెట్టి కేసీఆర్‌ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్‌ కు చిత్తశుద్ది వుంటే వెంటనే రామ్మోహన్‌ రెడ్డితో రాజీనామా చేయించాలని అన్నారు. తనకు, తన తండ్రికి రామ్మోహన్‌ మచ్చ తెచ్చాడని అన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలెవరూ కుడా రామ్మోహన్‌ వెంట వెళ్లలేదని ఆరుణ అన్నారు. 

Sunday, 22 March 2015

ఉత్సాహంగా ఉగాది కవి సమ్మేళనం


రవీంద్రభారతి, మార్చి 21: ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం రవీంద్రభారతి ఘంటసాల ప్రాంగణంలో ప్రపంచ కవితా దినోత్సవం జరిగింది. కవి సమ్మేళనంలో 70మంది కవులు పాల్గొన్నారు. ‘‘కోకిల కనబడటం లేదు...’’ అనే శీర్షికన హిమజ చదివిన కవిత ప్రేక్షకులను ఆకట్టుకుంది. అమ్మా... నాన్నా... అంటూ షాజహాన్ గానం చేసిన కవితకూడా ఆకట్టుకుంది. వడ్డేపల్లి కృష్ణ తన కవిత్వంలో హైదరాబాద్ అభివృద్ధిపై పచ్చదనం పరిశుభ్రత అంటూ మొదలుపెట్టి మురుగు కంపును ఎవరూ పట్టించుకోవడంలేదు అని కవితా గానంలో అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కవులు లేరని కొంతమంది వ్యాఖ్యానించారని, అది నిజం కాదని చెప్పడానికి ఈ రోజు 70మంది కవులు కవిసమ్మేళనంలో పాల్గొన్నారని తెలిపారు. సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కవి సమ్మేళనం నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కాగా, శ్రీ మన్మదనామ సంవత్సరపు ఉగాది వేడుకల్లో భాగంగా శనివారం ఉదయం రవీంద్రభారతిలో అట్టహాసంగా అందమైన సెట్టింగులతో, పూలమొక్కల గుభాళింపులతో ఉగాది వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి భద్రతాదళం ఆర్భాటాలతో ప్రేక్షకులనుగానీ, పత్రికా విలేకరులనుకానీ పట్టించుకున్న నాథుడే లేరు. ఎండాకాలం మొదలై గొంతెండిపోతున్నా తాగడానికి మంచినీరు కరువైనాయి. ఉగాది ఉత్సవాలను సంబందించి గతంలో మూడు రోజుల ముందుగా విలేకరుల సమావేశంలో చర్చించేవారు. కానీ ఈ సంవత్సరం ఆహ్వాన పత్రాలు స్వయంగా ఇవ్వటానికికూడా ఎవ్వరికీ తీరిక లేదేమోనన్నట్టు విలేకరుల గదిలో పడేసి వెళ్ళారు. ఆహ్వానపత్రంలో సాంస్కృతిక కార్యక్రమాల గురించి వివరాలు లేవు. అడిగినా చెప్పేవారు లేరు. ఈ విషయమై సాంస్కృతిక సంచాలకులు అడిగి తెలుసుకోవడానికి ఆయన కనబడకపోగా ఫోనుకూడా లిఫ్ట్ చేయలేదు. కార్యక్రమాల వివరాల గురించి సాంస్కృతిక శాఖలో అడిగినా ఫలితం దక్కలేదు.
తెలంగాణ ప్రభుత్వ ఉగాది పురస్కారాలు ప్రదానం
మన్మథనామ సంవత్సర ఉగాది పండుగ పర్వదినాన శనివారం ఉదయం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పలువురు కళాకారులు, కవులను సత్కరించారు. ముదిగంటి సుజాతరెడ్డి, మలయశ్రీ, గోరటి వెంకన్న (సాహిత్యం), రామలక్ష్మి రంగాచారి, రాజగోపాలాచారి (సంగీతం), సుధీర్‌రావు, రత్నశ్రీ (నృత్యం), బి.అమరేందర్ (నాటకం), సూర్య ప్రకాశ్, అంజనీరెడ్డి (చిత్రకళ), శ్రీనివాస్‌రెడ్డి, పాండు (శిల్పకళ), పేరిణి రమేష్ (పేరిణి నృత్యం), వడ్డేపల్లి శ్రీనివాస్ (జానపద సంగీతం), దర్శనం మొగులయ్య (పనె్నండు మెట్ల కినె్నర - జానపదకళా రూప ప్రదర్శన) పద్మాలయాచార్య (హరికథ), బి.సరోజిని (బుర్రకథ), ఒగ్గు ధర్మయ్య (ఒగ్గు కథ), ఆర్.సదాశివ్ (మిమిక్రీ), చిందు పెదబాబయ్య (చిందు యక్షగానం), నాగబాల సురేష్ (టివి రంగం), యన్.శంకర్, భూపాలరెడ్డి (సినిమా రంగం), నకాష్ వైకుంఠం, చేర్యాల (జానపద చిత్రకళ), నల్ల విజయ్, హుజురమ్మ (హస్తకళ), రవీంద్ర శర్మ (కళా శ్రమం), యం.వి. నర్సింహా రెడ్డి (వేద పరిశోధన) (ఇతరములు). పురస్కార గ్రహీతలకు రూ.10,116/- నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖమంత్రి బండారు దత్తాత్రేయ, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎంఎల్‌ఏ రసమయి బాలకిషన్ తదితరుల పాల్గొన్నారు.
గానసభలో..
కాచిగూడ: మన్మథనామ సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకుని ఉగాది వేడుకలు శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో శనివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మన్మథనామ సంవత్సర ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమానికి పుష్పగిరి పీఠం అభినవోద్దండ శ్రీవిద్యా నృసింహభారతీ స్వామిజీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి స్వామి అనుగ్రహభాషణ చేస్తు ఉగాది ప్రతి ఒక్కరికి సుఖశాంతులను కలుగచేస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు అన్ని రంగాల్లో రాణిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడు డా.కెవి.రమణచారి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు డా.కళావెంకటదీక్షితులు పాల్గొన్నారు.
కవులు డా.పోతుకూచి సాంబశివరావు, కెవి.కృష్ణమూర్తి, ముదిగొండ శివప్రసాద్, ముక్తేవి భారతి, జె.బాపురెడ్డి, గంటికోట సోమయాజులు, మంగళగిరి ప్రమీలాదేవి, చిమ్మపూడి శ్రీరామమూర్తి, మనస చెన్నప్ప, ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మీ కవి సమ్మేళనం నిర్వహించారు. సభకు ముందు యం.ఎస్.ఎస్ శ్రీనివాస్ శ్రీమన్మథనామ సంవత్సర పంచాగం శ్రవణం నిర్వహించారు

Sunday, 1 March 2015

హైదరాబాద్ :సమాజంతోనే చ‌దువు : చుక్కా రామ‌య్య‌




సమాజంతోనే చ‌దువు : చుక్కా రామ‌య్య‌

స‌మాజం ద్వా‌రానే చ‌దువు, విజ్ఞానం వ‌స్తుంద‌ని ప్ర‌ముఖ విద్యా‌వెత్త చుక్కా రామ‌య్య అన్నా‌రు. వ‌ట్టి‌కోట అల్వా‌ర్ స్వా‌మి పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌ను 

ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్య‌మాలే ఉపాధ్యా‌య‌లుగా మారి, పోరాట‌మే వ‌ద్యా‌ర్థు‌ల‌కు ప్రేర‌ణ‌గా 

నిలుస్తుంద‌ని తెలిపారు.ప్ర‌తిఒక్క‌రూ చ‌రిత్ర‌ను తెలుసుకోవాల‌ని కోరారు. దానికి ప్ర‌తి ఒక్క‌రు పుస్త‌కాలు చ‌ద‌వాల‌ని సూచించారు.ఆ సంద‌ర్భంగా 

ఆయ‌న వెంట ప్ర‌జాశ‌క్తి బుక్ హౌజ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ కె.చంద్ర‌మోహ‌న్ ఉన్నా‌రు.అంత‌కుముందు తెలంగాణ సాయుధ పోరాటం ‌ఎగ్జి‌బిష‌న్‌ను 

మ‌ల్లు‌స్వ‌రాజ్యం, కార్టు‌నిస్టు‌ల ‌ఎగ్జి‌బిష‌న్‌ను ప్ర‌ముఖ కార్టు‌నిస్టు శంక‌ర్ ప్రారంభించారు.

హైదరాబాద్ : శ్ర‌మ‌శ‌క్తితోనే సైన్స్ అభివృద్ధి : కంచె ఐల‌య్య‌




శ్ర‌మ‌శ‌క్తితోనే సైన్స్ అభివృద్ధి : కంచె ఐల‌య్య‌

దేశాన్ని క్లీ‌న్ గా ఉంచాలంటు ముందు శ్ర‌మ‌శ‌క్తిని గౌర‌వించాల‌ని ప్ర‌ముఖ విద్యా‌వెత్త ప్రొఫెస‌ర్ కం‌చె ఐల‌య్య అన్నా‌రు. శ్ర‌మ‌శ‌క్తితోనే సైన్స్ 

అభివృద్ధి చెందుతుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డా‌రు. శ్ర‌మ‌ను గౌర‌వ పాఠాలు పుస్త‌కాల్లో చేర్చా‌ల‌ని సూచించారు. జ‌నజాత‌ర కార్య‌క్ర‌మంలో 

భాగంగా ఏర్పా‌టు చేసిన చేతి వృత్తు‌ల ‌ఎగ్జి‌బిష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప్రొఫెస‌ర్ భంగ్యా భూక్యాతో క‌లిసి ఆయ‌న ప్రారంభించారు. చేతివృత్తు‌ల‌కు, శ్ర‌మ‌కు 

గౌర‌వం లేద‌ని ఐల‌య్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆదివాసులు సైంటిస్టు‌ల‌ని తాను 30 ఏళ్ల నుంచే చెబుతున్నా‌న‌ని అన్నా‌రు. మాదిగ‌లు 

తోలుసంచిలో నీళ్లు తీసుకురావ‌డం, మాల‌లు కాలువ‌లు త‌వ్వ‌డం, సాక‌లి వాళ్లు సౌడుమ‌ట్టి‌తో స‌బ్బు‌ను క‌నిపెట్టా‌ర‌ని అన్నా‌రు. వేదం చ‌రిత్ర‌కు 

మూలం కాద‌ని కుండ మాత్ర‌మే మూల‌మ‌ని పేర్కొ‌న్నా‌రు. బాప‌నోళ్లు కూడా అంద‌రి ఇళ్ళ‌లో తినేలా క‌మ్యూ‌నిస్టు‌లు కృషిచేయాల‌ని 

కోరారు. తెలంగాణ వ‌చ్చా‌కా ప్ర‌భుత్వం నిధుల‌న్నీ దేవుడి గుళ్ల‌కు పెడుతున్నా‌ర‌ని,సచివాల‌యాన్ని వాస్తు పేరుతో మార్చా‌ల‌ని చూస్తు‌న్నా‌ర‌ని 

అన్నా‌రు. న‌గ‌రంలో భూములు అమ్ము‌కునేందుకు ప్ర‌భుత్వం అనేక విధాగాలుగా ప్ర‌య‌త్నిస్తుంద‌ని దానిలో భాగంగానే హుస్సే‌న్ సాగ‌ర్ ఖాళీ 

చేయించేందుకు ఏర్పా‌ట్లు చేస్తు‌న్నా‌ర‌ని అన్నా‌రు. ప్రాణాలు పోయినా న‌గ‌రంలో గుంట భూమికూడా అమ్మ‌నీయ‌మ‌ని అన్నా‌రు. శ్ర‌మ‌కు 

గౌర‌వంగా, వృత్తు‌ల ర‌క్ష‌ణ‌కు సిపి‌ఎం చేస్తు‌న్న కృషి అభినంద‌నీయమ‌ని అన్నా‌రు. అనంత‌రం భంగ్యా‌భూక్యా మాట్లా‌డుతూ మ‌ట్టి‌లో ప‌నిచేసే 

కులాల‌ను నీచమైన ప‌నులు చేసేవారిగా హిందుత్వ‌శ‌క్తులు విస్తృ‌తంగా ప్ర‌చారం చేస్తు‌న్నా‌ర‌ని అన్నా‌రు. నేడు వృత్తు‌లు క‌నుమ‌రుగ‌వుతున్న 

త‌రుణంలో సిపి‌ఎం జాన‌జాత‌ర పేరుతో వృత్తు‌ల ర‌క్ష‌ణ చేస్తు‌న్న కృషి మంచిప‌రిణామ‌మ‌ని పేర్కొ‌న్నా‌రు. పెట్టు‌బ‌డిదారులు, హైంద‌వ శ‌క్తులు 

క‌లిసి శ్ర‌మ‌కు, వృత్తు‌ల‌కు కొత్త‌రూపం తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తు‌న్నా‌ర‌ని, దీనికి వ్య‌తిరేకంగా పోరాడాల‌ని కోరారు.

హైదరాబాద్ : వృత్తుల పరిక్షణకు కృషి - సిపి‌ఎం పొలిట్ బ్యూ‌రో స‌భ్యు‌లు ‌ఎం‌ఎ.బేబి.... అధిప‌త్య భావ‌జాలాన్ని చీల్చుతాం - త‌మ్మి‌నేని... జ‌న‌జాత‌ర ‌ఎగ్జి‌బిష‌న్ ప్రారంభం..


  • వృత్తుల పరిక్షణకు కృషి

  • సిపి‌ఎం పొలిట్ బ్యూ‌రో స‌భ్యు‌లు ‌ఎం‌ఎ.బేబి

  • అధిప‌త్య భావ‌జాలాన్ని చీల్చుతాం - త‌మ్మి‌నేని

  • జ‌న‌జాత‌ర ‌ఎగ్జి‌బిష‌న్ ప్రారంభం

  • చేతివృత్తు‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు సిపి‌ఎం కృషి చేస్తుంద‌ని ఆ పార్టీ పొలిట్ బ్యూ‌రో స‌భ్యు‌లు ‌ఎం‌ఎ బేబి అన్నా‌రు. వారి జీవ‌న విధానాలు మెరుగుప‌డేందుకు నిరంత‌రం ప‌నిచేస్తా‌మ‌ని ఆయ‌న పేర్కొన్నా‌రు. నిజాం క‌ళాశాల మైదానంలో ఏర్పా‌టు చేసిన తెలంగాణ జ‌నజాత‌ర కార్య‌క్ర‌మాన్ని ఆదివారం ఆయ‌న సిపి‌ఎం రాష్ట్ర కార్యద‌ర్శి త‌మ్మి‌నేని వీర‌భ‌ద్రం, ప్ర‌ముఖ విద్యా‌వెత్త కం‌చె ఐల‌య్య‌, ప్రొఫెస‌ర్ భంగ్యా భూక్యా‌, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మ‌ల్లు స్వ‌రాజ్యంతో క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పా‌టు చేసిన వివిధ స్టా‌ళ్ల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం విలేక‌రులతో మాట్లా‌డుతూ ప్ర‌స్తు‌తం జ‌న‌జాత‌ర కార్య‌క్ర‌మం ప్ర‌స్తు‌త ప‌ల్లె సంస్కృతిని ప్ర‌తిభింబిస్తుంద‌ని అన్నా‌రు. వృత్తు‌ల జీవ‌న విధానాలు క‌నిపించేలా చేనేత‌, చ‌ర్మ‌కారులు,గిరిజ‌న ఇలా అనేక అంశాలున్నా‌యి. శ్రామిక ప్ర‌జ‌లజీవ‌న విధానాలు ఉట్టి‌ప‌డేలా క‌ళలు క‌నిపిస్తు‌న్నా‌య‌ని తెలిపారు. తెలంగాణ సంస్కృతి ప్ర‌తిభింబించేలా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. త‌మ్మి‌నేని వీర‌భద్రం మాట్లా‌డుతూ ప్ర‌స్తు‌తం దేశంలో కొన‌సాగుతున్న ఆధిప‌త్య‌భావ‌జాలాన్ని చీల్చేందుకు సిపి‌ఎం సంస్కృతిక నినాదాన్ని తీసుకుంద‌ని అన్నా‌రు.క‌మ్యూ‌నిస్టు‌లంటే కేవ‌లం భూమి, కూలి పోరాటాలే కాదని, తెలంగాణాలోని అన్ని రంగాల్లో‌ని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పైనా పోరాడుతుంద‌ని తెలిపారు. తెలంగాణ సాయుధ‌పోరాటంలో ఒకే రోజు 108 మంది అమ‌రులైన వీర‌భైరాన్ ప‌ల్లి నుంచి తెలంగాణ సంస్కృతిక యాత్ర ప్రారంభించామ‌ని పేర్కొ‌న్నా‌రు. ప్రజల సంస్కృతి వేరు, దోపిడీ సంస్కృతి వేరని, స‌క‌ల వృత్తు‌ల స‌మ్మే‌ళ‌నంగా, దోపిడీ సంస్కృతిని అడ్డు‌కునేందుకు ఈ కార్య‌క్ర‌మం ఆరంభం మాత్ర‌మేన‌ని తమ్మినేని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి కృషి జరగాలని సూచించారు. ఉద్య‌మమంటే సిపి‌ఎం మాత్ర‌మే కాద‌ని,వామ‌ప‌క్ష‌, సామాజిక, ప్ర‌గ‌తి శీల శ‌క్తులు ఐక్యంగా పోరాటాలు చేయ‌డ‌మేన‌ని అన్నా‌రు. ఈ ఐక్య‌త కోసం నాలుగు రోజుల పాటు జరిగే రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో చ‌ర్చి‌స్తా‌మ‌ని అన్నా‌రు. సంస్కృతికి ప్ర‌తిబింబ‌మైన జ‌న‌జాత‌ర కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లంతా పాల్గొ‌ని జ‌య‌ప్ర‌దం చేయాల‌ని కోరారు. మాజీ ‌ఎమ్మె‌ల్సీ సీతారాములు మాట్లా‌డుతూ చేతివృత్తు‌లు పూర్తి‌గా నాశ‌నం అవుతున్నా‌యని, దీంతో వీరి ఆదాయ‌వ‌నరులు లేకుండా పోయాయ‌ని అన్నా‌రు. వృత్తు‌ల‌పై ఆధార‌ప‌డి జీవిస్తు‌న్న‌వారి బ‌తుకులు బాగుప‌డాలంటే బ‌డ్జె‌ట్‌లో ప్ర‌భుత్వం వారి జ‌నాభాకు అనుగుణంగా నిధులు కేటాయించాల‌ని డిమాండ్ చేశారు. ‌ఎమ్మె‌ల్యే సున్నం రాజ‌య్య మాట్లా‌డుతూ.. ప్ర‌జ‌ల సంస్కృ‌తి సంప్ర‌దాయాలను ఇక్క‌డ ఏర్పా‌టు చేసిన‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో సిపి‌ఎం మాజీ ‌ఎమ్మె‌ల్యే జూల‌కంటి రంగారెడ్డి‌, తెలంగాణ‌ ప్ర‌జాసంస్కృతిక కేంద్రం ప్ర‌తినిధులు భూప‌తి వెంక‌టేశ్వ‌ర్లు‌, జ‌న‌విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్య‌ద‌ర్శి ర‌మేష్,సిపి‌ఎం రాష్ట్ర నాయ‌కులు టి.సాగ‌ర్, ర‌మ‌, చేతివృత్తి‌దారుల స‌మ‌న్వ‌య క‌మిటీ ప్ర‌తినిధులు ర‌మ‌ణ‌,లెల్లెల‌ బాల‌కృష్ణ‌, ర‌మేష్, గిరిజ‌న సంఘం నాయ‌కులు శ్రీరాం నాయ‌క్, కెవిపి‌ఎస్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్ వెస్లీ, త‌దిత‌రులు పాల్గొ‌న్నా‌రు.


Friday, 13 February 2015

హైద‌రాబాద్‌ : మార్చి 16న ‌ప‌ట్ట‌భ‌ద్రుల ‌ఎన్ని‌క‌లు... 19న విడుద‌ల కానున్న‌ నోటిఫికేషన్

మార్చి 16న ‌ప‌ట్ట‌భ‌ద్రుల  ‌ఎన్ని‌క‌లు

19న విడుద‌ల కానున్న‌ నోటిఫికేషన్



  గ్రేటర్ హైద‌రాబాద్‌లో ఎన్నికల కోడ్ కూసింది. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ ప‌ట్ట‌భ‌ద్రుల ‌ఎమ్మె‌ల్సీ‌ స్థా‌నానికి ‌ఎన్ని‌కలు జ‌ర‌గ‌నున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూ‌ల్ ఈ నెల 19న విడుద‌ల కానుంది. దీంతో గ్రేట‌ర్‌లో ‌ఎన్ని‌క‌ల సంద‌డి మొద‌లైంది. ఈ ‌ఎన్ని‌క‌లు పార్టీ‌ల‌కు అతీత‌మే అయినా పార్టీ మ‌ద్ధ‌తుదారుల‌ను బ‌రిలో నిలిపి గెలుపించుకునేందుకు అన్ని పార్టీ‌లు ప్ర‌ణాళికలు రూపొందిస్తు‌న్నా‌యి.


 ప్ర‌ముఖ విద్యా‌వెత్త డాక్టర్ నాగేశ్వర్ ప్రాతినిధ్యం వ‌హిస్తు‌న్న ‌ఎమ్మె‌ల్సీ స్థా‌నానికి గ‌డువు ముగుస్తుండ‌టంలో ‌ఎన్ని‌క‌లు నిర్వహిస్తున్నారు. ఈ ‌నెల 19న‌ దీనికి సంబంధించిన ‌ఎన్ని‌క‌ల షెడ్యూ‌ల్ విడుదల చేయ‌నున్నట్లు ‌ఎన్ని‌క‌ల అధికారులు రెండు రోజుల క్రితం ప్ర‌క‌టించారు. మార్చి 16న పోలింగ్ ప్ర‌క్రియ నిర్వ‌హించ‌నున్నా‌రు. ప్ర‌స్తు‌తం హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లా‌ల్లో భారీగానే ప‌ట్ట‌భ‌ద్రులున్నా‌రు. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్లు మొత్తం 2,86,311 మంది ఉండ‌గా, వీరిలో ఈ రెండు జిల్లాల నుంచే 2,20,211 మంది ఓట‌ర్లుండ‌టం విశేషం. గ్రాడ్యు‌యేట్ ‌నియోజ‌క‌వ‌ర్గ ‌ఎన్ని‌క‌ల నేప‌థ్యంలో అధికారులు అన్ని ఏర్పా‌టు చేస్తు‌న్నా‌రు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 1,33,003మంది ఓటర్లుండగా 165పోలింగ్ కేంద్రాలను, హైదరాబాద్ జిల్లా‌లో 87,208మంది ఓటర్లుండగా, 151పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయ‌నున్నట్లు అధికారులు ప్ర‌క‌టించారు. ఎన్నికల కోడ్ అమలులోకి ఉండ‌టంతో రెండు జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రజాప్రతినిధుల ప్రచార కార్యక్రమాలకు తెరపడింది. 

   రాష్ట్ర రాజధానికి సంబంధించిన ఎన్నిక కావడంతో దీనిపై అన్నిపార్టీలు దృష్టిసారించాయి. ప‌ట్టభ‌ద్రుల ‌ఎమ్మె‌ల్సీ ‌ఎన్ని‌క‌ల ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో వివిధ పార్టీ‌లు తమ పార్టీ మ‌ద్ద‌తుదారుల‌ను బ‌ల‌మైన వారిని పెట్టేందుకు కసరత్తులు చేస్తున్నాయి. పట్టభద్రుల స్థానం కావడంతో విద్యావేత్తను పెట్టేందుకు అన్ని పార్టీలు వెతుకుతున్నాయి. ఇప్పటికీ కేవలం బిజెపి మద్ధతుదారులుగా రాంచంద్రారెడ్డి పోటీలో ఉంటున్నారని ప్రకటించారు. ఆయన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అధికారపార్టీ టిఆర్ఎస్ ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. ఆ పార్టీ కూడా సరైన అభ్యర్థి కోసం వేట సాగిస్తోంది. ప్రధానంగా ప్రస్తుతం ఉద్యోగ సంఘం దేవీప్రసాద్ లేదా విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్‌ను బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం కూడా అభ్యర్థివేటలో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ డాక్టర్ నాగేశ్వర్ పోటీలో ఉంటే ఆయనకు మద్ద‌తు ప్రకటిస్తామని పది వామపక్ష పార్టీలు ఇదువరకే ప్రకటించాయి. అయితే నాగేశ్వర్ మాత్రం ఇంతవరకు పోటీ విషయమై ఏ నిర్ణయం ప్రకటించలేదు. ఒక వేళ ఆయన పోటీలో లేకపోతే ఎవరికి మద్ద‌తు ఇవ్వాలనే దానిపైనా ఇంకా వామపక్షాలు నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ పోటీలో నిలపాలా వద్దా అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఢిల్లీలో ఆపూర్వ విజయం సాధించిన ఆమాద్మీ పార్టీ ఈఎన్నికల్లో తమ మద్ద‌తుదారును పోటీలో నిలిపేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరో వారం రోజుల్లో అభ్యర్థుల పేర్లు పూర్తిగా బయటకొచ్చే అవకాశాలున్నాయి

హైద‌రాబాద్ : న‌త్త‌న‌డ‌క‌న‌క క్ర‌మ‌బ‌ద్ధీ‌క‌ర‌ణ‌ ద‌ర‌ఖాస్తు‌ల‌ ప‌రిశీల‌న‌

న‌త్త‌న‌డ‌క‌న‌క క్ర‌మ‌బ‌ద్ధీ‌క‌ర‌ణ‌ ద‌ర‌ఖాస్తు‌ల‌ ప‌రిశీల‌న‌



 న‌గ‌రంలో భూ క్ర‌మ‌బ‌ద్దీ‌క‌ర‌ణ ద‌ర‌ఖాస్తు‌ల ప‌రిశీల‌న న‌త్త‌న‌డ‌క‌న సాగుతోంది. ఈ నెల 20లోగా ద‌ర‌ఖాస్తు‌ల ప‌రిశీల‌న పూర్తి కావాల‌ని ముఖ్య‌మంత్రి కెసిఆర్ ఆదేశాలు జారీ చేసినా, గ‌డువులోగా పూర్తి అయ్యే‌లా క‌నిపించ‌డం లేదు. గ‌డిచిన రెండు వారాల్లో కేవ‌లం 20,102 ద‌ర‌ఖాస్తు‌లు మాత్ర‌మే అధికారులు ప‌రిశీలించారు. అయితే మ‌రో వారం గ‌డువు ఉండ‌టంతో, గ‌డువు లోపు పూర్తి అవుతాయా? అనే భావ‌న అధికారుల్లో‌నూ చ‌ర్చ జ‌రుగుతోంది. దీనికితోడు ‌న‌గ‌రంలో ‌ఎన్ని‌క‌ల కోడ్ అమలులో ఉండ‌టంతో ఈ ద‌ర‌ఖాస్తు‌ల ప‌రిశీల‌న మ‌రోనెల వ‌ర‌కు పొగ‌డించ‌వ‌చ్చ‌నే ఆలోచ‌న‌లో సిబ్బంది ఉన్నా‌రు. 

   గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ఉచిత క్ర‌మ‌బ‌ద్ధీ‌క‌ర‌ణ‌కు 2.13,702 లక్ష‌ల ద‌ర‌ఖాస్తు‌లు వ‌చ్చాయి. వీటిలో హైద‌రాబాద్ జిల్లా‌కు చెందిన‌వి 63,772 ఉండ‌గా, మిగితా 1,49,930 ద‌ర‌ఖాస్తు‌లు రంగారెడ్డి జిల్లా‌కు చెందిన‌వి. వీటిలో ప్రాథ‌మిక స్థా‌యిలోనే వివిధ కార‌ణాల‌తో 78,110 ద‌ర‌ఖాస్తు‌ల‌ను ప‌క్క‌న పెట్టా‌రు. మిగిలిన 1,35,597 ద‌ర‌ఖాస్తు‌ల‌ను ప‌రిశీల‌న‌కు స్వీ‌క‌రించారు. వీటి ప‌రిశీల‌న‌కు గ్రేట‌ర్ ప‌రిధిలో 111 ప‌రిశీల‌న బృందాల‌ను అధికారులు ఏర్పా‌టు చేశారు. ద‌ర‌ఖాస్తు‌ల ప్ర‌క్రి‌య వేగంగా జ‌ర‌గ‌డం లేద‌ని భావించిన ప్ర‌భుత్వం, హైద‌రాబాద్ న‌గ‌రంలో బృందాల‌ను పెంచాల‌ని ఆదేశించింది. దీంతో ఈ ద‌ర‌ఖాస్తు‌ల ప‌రిశీల‌న‌లో రెవెన్యూ సిబ్బందితో పాటు జిహెచ్‌ఎంసికి చెందిన టౌన్ ప్లా‌నింగ్ అధికారులను ప‌రిశీల‌నకు జిహెచ్‌ఎంసి కమిష‌న‌ర్ కేటాయించారు. ప్ర‌స్తు‌తం జీవో 59 ప్ర‌కారం ద‌ర‌ఖాస్తు‌లు స్వీ‌క‌రిస్తుండ‌టంతో, గడువు పూర్త‌యినా జీవో 58 ప్ర‌కారం ద‌ర‌ఖాస్తు‌ల‌ను అధికారులు స్వీ‌క‌రిస్తు‌న్నా‌రు. ఒక్క హైద‌రాబాద్ జిల్లా‌లోనే రెండు వారాల్లో కొత్త‌గా మ‌రో వెయ్యి‌వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు‌లు స్వీ‌క‌రించారు.

 ప్ర‌భుత్వ ఖాళీ స్థ‌లాల్లో 125 గ‌జాలలోపు భూమిని ఆక్ర‌మించుకుని నివాసం ఏర్పా‌టు చేసుకున్న పేద‌ల‌కు ఉచితంగా పట్టా‌లిచ్చేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈనెల 20 నుంచి ఈ కార్య‌క్ర‌మం కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌టించింది. కానీ క్ర‌మ‌బ‌ద్ధీ‌క‌రించేందుకు ద‌ర‌ఖాస్తు‌ల ప‌రిశీల‌న మాత్రం ప్ర‌భుత్వం అనుకున్నంత వేగంగా జ‌ర‌గ‌డం లేదు. గ‌డిచిన రెండు వారాల్లో ‌గ్రేట‌ర్ ప‌రిధిలో 20,102 ద‌ర‌ఖాస్తు‌ల‌ను మాత్ర‌మే అధికారులు ప‌రిశీలించారు. మ‌రో 1,15,495 ద‌ర‌ఖాస్తు‌ల‌ను ప‌రిశీలించాల్సి ఉంది. ద‌ర‌ఖాస్తు‌ల ప‌రిశీల‌న కోసం ప్ర‌త్యే‌కంగా రెవెన్యూ అధికారుల‌కు  తోడు జిహెచ్‌ఎంసి టౌన్ ప్లా‌నింగ్ అధికారుల‌ను జ‌త చేశారు. అయినా ప‌రిశీల‌న మాత్రం వేగం పుంజుకోవ‌డం లేదు. రోజుకు ఒక్కో బృందం 15నుంచి 20 ద‌ర‌ఖాస్తు‌ల‌ను ప‌రిశీలిస్తుంది. దీంతో మ‌రిన్ని ప‌రిశీల‌న బృందాల‌ను వేయాల‌ని ప‌లువురు సిబ్బంది, ప్ర‌జ‌లు కోరుతున్నా‌రు.

 ఈ నెల 20 నుంచి ఉచిత క్ర‌మ‌బ‌ద్దీ‌క‌ర‌ణ ద‌ర‌ఖాస్తు దారుల‌కు ప‌ట్టా‌లు ఇవ్వా‌ల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అయితే మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ‌ఎమ్మెల్సీ స్థా‌నానికి ఈనెల 19న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 16న ‌ఎన్ని‌క‌లు,  మార్చి 19న కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో మార్చి 20 వ‌ర‌కు ‌ఎన్ని‌క‌ల కోడ్ గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో అమలులోకి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ అభివృద్ది ప‌నులు చేయ‌కుడ‌దు. కాబ‌ట్టి ప‌ట్టా‌ల పంపిణీ మార్చి చివ‌రికి వాయిదా ప‌డే అవ‌కాశం ఉంది.

Wednesday, 4 February 2015

హైద‌రాబాద్ : వాళ్లెన్నింటిలో.. మ‌న‌మెన్నింటిలో... ఆంధ్ర‌, తెలంగాణ శాఖ‌ల భ‌వ‌నాల వినియోగంపై స‌ర్వే‌!

వాళ్లెన్నింటిలో.. మ‌న‌మెన్నింటిలో
ఆంధ్ర‌, తెలంగాణ శాఖ‌ల భ‌వ‌నాల వినియోగంపై స‌ర్వే‌!
అనువ‌నువూ లెక్క‌తీస్తు‌న్న అధికారులు
అధికారుల, సిబ్బంది వివ‌రాల‌ సేక‌ర‌ణ‌
పున‌ర్వి‌భ‌జ‌న చ‌ట్టంలో భాగ‌మే అంటున్న అధికారులు

 గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ప్ర‌భుత్వ ఆస్తు‌ల వివ‌రాల సేక‌ర‌ణలో అధికారులు మునిగిపోయారు. దీనిలో భాగంగా జిల్లా‌లోని అన్ని మండ‌లాల్లో‌నూ ఏ విభాగానికి ఆ విభాగం అధికారులు స‌మాచారం సేక‌రిస్తు‌న్నా‌రు. ప్ర‌భుత్వ భ‌వ‌నాల వివ‌రాలు, వాటిలో ప‌నిచేసే అధికారుల వివ‌రాలూ సేక‌రిస్తు‌న్నా‌రు. దీనిలో భాగంగా దానిలోనే ఉద్యో‌గులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన‌వారా లేక తెలంగాణ‌కు చెందిన‌వారా అనే వివ‌రాలూ తీసుకుంటున్నా‌రు. కాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్వి‌భ‌జ‌న చ‌ట్టం-2014 ప్ర‌కారమే ఈ వివ‌రాలు సేక‌రిస్తు‌న్నా‌మ‌ని అధికారులు చెబ‌తున్నారు.
  రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె చంద్ర‌శేఖ‌ర్ రావు ఆదేశాల మేర‌కు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని మండలాల్లోని వివిధ ప్ర‌భుత్వ కార్యా‌ల‌యాల వివ‌రాలు సేక‌రిస్తు‌న్నా‌రు. ఇప్ప‌టికే ఈ ఏరియా ప‌రిధిలో 174 ఇరు రాష్ర్టాల‌కు చెందిన రాష్ట్ర ప్ర‌ధాన కార్యా‌ల‌యాలు ఉన్నా‌య‌ని అధికారులు గుర్తించారు. ఇవ‌న్నీ కూడా నాంప‌ల్లి‌, హిమాయ‌త్ న‌గ‌ర్, ఖైర‌తాబాద్ మండ‌లాల ప‌రిస‌ర ప్రాంతాల్లో‌నే ‌ఎక్కు‌వ‌గా ఉన్నా‌యని ఇప్ప‌టికే హైద‌రాబాద్ జిల్లా‌ యంత్రాంగం నివేదిక‌లు ప్ర‌భుత్వా‌నికి అందించింది. జిల్లా‌ల ప‌రిధిలోనూ వివ‌రాలు సేక‌రించారు. దీనిలో భాగంగా హైద‌రాబాద్ జిల్లా‌లోని 16 మండ‌లాల ప‌రిధిలో 436 ప్ర‌భుత్వ భ‌వ‌నాలు ఉన్నా‌యని లెక్క‌తేల్చా‌రు. ఈ వివరాలూ రెండు రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు అందజేశారు. అయితే మళ్లీ కొత్తగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా రాష్ట్ర రాజధానిలో ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం రెవెన్యూ విభాగం అధికారులు తహశీల్ కార్యాలయాల వివరాలను సేకరిస్తున్నారు. ఈ నెల 3వరకే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వెబ్‌సైట్‌కు పంపాలని సూచించినా జిల్లాలోని అన్ని మండలాల వివరాలు పంపలేదు. మండల తహశీల్దార్లు సేకరించిన వివరాలను ఆర్డీఓలు మాత్రమే వీటిని ఆ వెబ్‌సైట్‌కు పంపేవిధంగా అధికారులు ఏర్పాటు చేశారు. 
      ప్రస్తుతం జిల్లాలోని 9 మండలాల వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేశారు. మరో 7 మండలాలు ఇంకా అప్‌లోడ్ చేయలేదు. వీటిలో సైదాబాద్, మారెడ్ పల్లి మండల కార్యాలయాలు సొంతభవనాలు కాకపోవడంతో వాటి వివరాలు పంపాల్సిన అవసరంలేదని అధికారులు చెబుతున్నారు. ఇంకా అంబర్ పేట్, హిమాయత్ నగర్, బండ్లగూడ, చార్మినార్, తిర్మలగిరి మండలాల వివరాలు అప్ డేట్ చేయాల్సిఉంది. అయితే ఒకటిరెండు మండలాల వివరాలు ఆర్డీఓల వద్దకు వచ్చినా అవి ఇంకా అప్ డేట్ కాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం అధికారులు సేకరిస్తున్న వాటిలో 27 అంశాలతో కూడిన వివరాలు అందించాల్సి ఉంది. దీనిలో భవనం విస్తీర్ణం ఎంత?, సర్వే నెంబర్, ఎన్ని అంతస్తులు, ఎన్ని రూములు, ఎన్ని బాత్ రూములు అనేవి ఉన్నాయి. భ‌వ‌నాలకు సంబంధించి ఏమైనా కోర్టు కేసులున్నా‌యా అని కూడా ఆ వివ‌రాల్లో పొందుప‌ర్చా‌ల్సి ఉంది. వీటితో పాటు భ‌వ‌నానికి సంబంధించిన నాలుగు దిక్కు‌ల ఫొటోలూ పంపిస్తు‌న్నా‌రు. దీనికితోడు అంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల వారిగా కూడా వివ‌రాలు సేక‌రిస్తు‌న్నా‌రు. ఇవన్నీ కూడా తెలంగాణ, ‌ఎపి రాష్ర్టాల‌ ప‌రిధిలో ‌ఎన్ని భ‌వ‌నాలున్నా‌యి, వాటిలో ‌ఎన్ని‌వినియోగంలో ఉన్నా‌యి.. అని తెలుసుకునేందుకే ఈ వివ‌రాలు సేక‌రిస్తు‌న్న‌ట్లు అధికారులు చెబుతున్నా‌రు.
Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks