అనుమతుల్లో ఆయన మాటే ప్రధానం
జయంతీ నటరాజన్ తీవ్ర ఆరోపణలు
కాంగ్రె్‌సకు రాజీనామా
పార్టీ వైఖరికి కట్టుబడే వ్యవహరించాను
తల్లీ కొడుకుల చేతిలో తీవ్ర అవమానం
సహించలేకే ఈ నిర్ణయం: జయంతి
కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన తాను మరే పార్టీలోనూ చేరడంలేదని జయంతీ నటరాజన్ తెలిపారు. అదే సమయంలో... ప్రధాని నరేంద్ర మోదీని వెనకేసుకొచ్చారు. గుజరాత్‌లో జరిగిన స్నూప్‌గేట్ ఉదంతంలో మోదీపై గతంలో జయంతీ నటరాజన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ అంశాన్ని ప్రస్తావించగా... ‘‘స్నూప్‌గేట్‌పై మోదీని విమర్శించడం నాకు ఇష్టంలేదు. కానీ, కాంగ్రెస్‌లో అత్యున్నత స్థాయి నాయకత్వం ఆదేశాల మేరకు అలా చేయాల్సి వచ్చింది’’ అని తెలిపారు. ఇక... పర్యావరణ అనుమతుల జారీకి ‘జయంతీ ట్యాక్స్’ వసూలూ చేస్తున్నారంటూ మోదీ గతంలో చేసిన ఆరోపణలనూ ఆమె లైట్‌గా తీసుకున్నారు. ‘‘మా పార్టీ వాళ్లే నన్ను పట్టించుకోలేదు. మావాళ్లే నన్ను అవమానించినప్పుడు ప్రత్యర్థి పార్టీ వాళ్లు ఊరుకుంటారా!’’ అని జయంతి ప్రతిస్పందించారు. ‘‘పర్యావరణానికి సంబంధించిన అన్ని అంశాలపై పార్టీ వైఖరి ప్రకారం, నిబంధనల మేరకు నడుచుకున్నాను. ఎక్కడైనా నేను తప్పు చేసినట్లు రుజువైతే... జైలుకు పంపొచ్చు. ఉరిశిక్ష విధించినా స్వాగతిస్తాను’’ అని జయంతి తెలిపారు.
కారణం చెప్పండి మేడమ్!.. నవంబర్‌లోనే సోనియాకు లేఖ
జయంతీ నటరాజన్ తీవ్ర ఆరోపణలు
కాంగ్రె్‌సకు రాజీనామా
పార్టీ వైఖరికి కట్టుబడే వ్యవహరించాను
తల్లీ కొడుకుల చేతిలో తీవ్ర అవమానం
సహించలేకే ఈ నిర్ణయం: జయంతి
చెన్నై, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో వరుస పరాజయాలతో, తీవ్ర కష్టాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్‌కు కొత్త కష్టం వచ్చిపడింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె పుత్రుడు రాహుల్ గాంధీపై తీవ్ర ఆరోపణలకు తెర లేచింది. ఈ ఆరోపణలు చేసింది ఎవరో కాదు... నాలుగు తరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ, సుమారు 35 ఏళ్లుగా ‘గాంధీ’ కుటుంబానికి వీర విధేయురాలిగా ఉన్న తమిళనాడు నాయకురాలు జయంతీ నటరాజన్! తన ఆవేశం, ఆక్రోశాన్ని వివరిస్తూ గత ఏడాది నవంబర్‌లోనే సోనియాకు లేఖ రాసిన ఆమె... గురువారం చెన్నైలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ సంచలనాత్మక సంగతులు తెలిపారు. మరీ ముఖ్యంగా... రాహుల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. యూపీఏ-2లో పర్యావరణ మంత్రిగా ఉన్న తాను రాహుల్ ఆదేశాల మేరకే నడుచుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తన మంత్రిత్వ శాఖ నిర్ణయాల్లో రాహుల్ వేలు పెట్టేవారని చెప్పకనే చెప్పారు.
‘‘భారీ పెట్టుబడులతో కూడిన బడా ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వడంలో రాహుల్ నిర్ణయమే ప్రధానం. ఆయన అభిమతం మేరకు చాలా ప్రాజెక్టులు పెండింగ్‌లో పడ్డాయి. ఈ విషయం తెలియక.. కేబినెట్ సమావేశాల్లో మంత్రివర్గ సహచరులు నాపై మండిపడేవారు. నిజానికి... నేను పార్టీ వైఖరి మాత్రమే కట్టుబడి ఉన్నాను’’ అని జయంతీ నటరాజన్ తెలిపారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు మూడు నెలల ముందు ఆమె చేత కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రి పదవికి రాజీనామా చేయించింది. అప్పుడు జరిగిన పరిణామాలను కూడా జయంతీ నటరాజన్ వివరించారు. ‘‘ఆ రోజు ప్రధాని పదవిలో ఉన్న మన్మోహన్ నన్ను పిలిచారు. నేను వెళ్లగానే ఆయన లేచి నిలుచున్నారు. నా సేవలు పార్టీకి అవసరమని సోనియా చెప్పారన్నారు. మంత్రి పదవికి ఇప్పటికిప్పుడే రాజీనామా చేయాలని చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. కాంగ్రెస్ అధ్యక్షురాలే ఇలా చెప్పారా అని అడిగాను. అవును అని మన్మోహన్ తెలిపారు’’ అని జయంతి వివరించారు.
ఆ తర్వాత... తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా రాహుల్ కార్యాలయమే కుట్రపూరిత కథనాలను సృష్టించిందని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా వచ్చిన కథనాలపై తన వివరణ ఇచ్చుకునేందుకు 11 నెలలుగా అప్పాయింట్‌మెంట్ కోరుతున్నా హైకమాండ్ అవకాశమివ్వలేదన్నారు. కాంగ్రెస్‌లో అవమానాలు, ఉక్కపోత భరించలేకే రాజీనామా చేశానని జయంతీ నటరాజన్ తెలిపారు. ‘‘నాలుగు తరాలుగా మా కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉంది. మా నాళాల్లో కాంగ్రెస్ రక్తమే ప్రవహిస్తోంది. ఇప్పుడు అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నాను.’’ అని చెప్పారు.
పార్టీ ఆదేశం మేరకే మోదీపై విమర్శలుకాంగ్రెస్కు గుడ్‌బై చెప్పిన తాను మరే పార్టీలోనూ చేరడంలేదని జయంతీ నటరాజన్ తెలిపారు. అదే సమయంలో... ప్రధాని నరేంద్ర మోదీని వెనకేసుకొచ్చారు. గుజరాత్‌లో జరిగిన స్నూప్‌గేట్ ఉదంతంలో మోదీపై గతంలో జయంతీ నటరాజన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ అంశాన్ని ప్రస్తావించగా... ‘‘స్నూప్‌గేట్‌పై మోదీని విమర్శించడం నాకు ఇష్టంలేదు. కానీ, కాంగ్రెస్‌లో అత్యున్నత స్థాయి నాయకత్వం ఆదేశాల మేరకు అలా చేయాల్సి వచ్చింది’’ అని తెలిపారు. ఇక... పర్యావరణ అనుమతుల జారీకి ‘జయంతీ ట్యాక్స్’ వసూలూ చేస్తున్నారంటూ మోదీ గతంలో చేసిన ఆరోపణలనూ ఆమె లైట్‌గా తీసుకున్నారు. ‘‘మా పార్టీ వాళ్లే నన్ను పట్టించుకోలేదు. మావాళ్లే నన్ను అవమానించినప్పుడు ప్రత్యర్థి పార్టీ వాళ్లు ఊరుకుంటారా!’’ అని జయంతి ప్రతిస్పందించారు. ‘‘పర్యావరణానికి సంబంధించిన అన్ని అంశాలపై పార్టీ వైఖరి ప్రకారం, నిబంధనల మేరకు నడుచుకున్నాను. ఎక్కడైనా నేను తప్పు చేసినట్లు రుజువైతే... జైలుకు పంపొచ్చు. ఉరిశిక్ష విధించినా స్వాగతిస్తాను’’ అని జయంతి తెలిపారు.
కారణం చెప్పండి మేడమ్!.. నవంబర్‌లోనే సోనియాకు లేఖ
‘కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను’ అని జయంతీ నటరాజన్ ప్రకటించిన కొద్దిసేపటికే... గత ఏడాది నవంబర్‌లో ఆమె సోనియాగాంధీకి రాసిన లేఖ ప్రతి బయటికొచ్చింది. ‘‘గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రురాలినని చెప్పుకొనేందుకు ఏమాత్రం వెనుకాడను. రాజీవ్ గాంధీ హత్యకు గురైనప్పుడు రాత్రంతా ఆయన మృతదేహం వద్ద ఉన్నాను’’ అని జయంతి తెలిపారు. ‘‘పర్యావరణ శాఖ మంత్రిగా రెండేళ్ల నా హయాంలో నిబంధనలకు నిక్కచ్చిగా కట్టుబడి ఉన్నాను. అదే సమయంలో... రాహుల్ కార్యాలయం నుంచి వచ్చిన కొన్ని ‘అభ్యర్థన’లను (నా దృష్టిలో అవి ఆదేశాలే) కూడా గౌరవించాను. వేదాంతకు పర్యావరణ అనుమతులు ఇవ్వాల్సిందిగా నాపై, నా శాఖ అధికారులపై ఎంత ఒత్తిడి ఉన్నా, చివరికి... మంత్రివర్గ సహచరులూ ఒత్తిడి చేసినా కేవలం రాహుల్ కార్యాలయం ఆదేశాలవల్లే ఫైలు పెండింగ్‌లో పెట్టాను. ’’ అని జయంతి ఆ లేఖలో తెలిపారు. ‘‘నేను రాజీనామా చేసిన మరుసటి రోజే రాహుల్ ఫిక్కీ సమావేశంలో ప్రసంగించారు. ఇకపై పర్యావరణ అనుమతుల ప్రక్రియ వేగంగా జరుగుతుందని హామీ ఇచ్చారు.
నిజంగా అదే సమస్య అయినప్పుడు... త్వరత్వరగా అనుమతులు జారీ చేయాలని నన్ను అడగొచ్చు కదా! నిజానికి... ఆయా ప్రాజెక్టులపై స్వచ్ఛంద సంస్థలు పంపిన లేఖలు, ఉల్లంఘనలపై ఫిర్యాదులను రాహుల్ కార్యాలయమే మాకు పంపేది’’ అని సోనియా దృష్టికి తీసుకొచ్చారు. ‘‘మేడమ్... నేనేం తప్పు చేశానో ఇప్పటికైనా చెప్పండి. ఏ ఆరోపణలు వచ్చినందుకు నన్ను పదేపదే అవమానిస్తున్నారో చెప్పండి. ఇప్పటికైనా నా ఆవేదన అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను’’ అని జయంతీ నటరాజన్ గత ఏడాది నవంబర్‌లో సోనియాకు రాసిన లేఖలో ఆక్రోశం వ్యక్తం చేశారు.


No comments:
Post a Comment