కాంగ్రెస్ పార్టీలో లొల్లి.
నల్గొండ : నల్గొండ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కొత్త లొల్లి మొదలైంది. ఈ గొడవ ఏదో పదవి కోసమో...లేక ఎంఎల్ఎ,ఎంపి సీటు కోసమో లేక ఎంఎల్సీ అభ్యర్ధిత్వం కోసం కానే కాదు... పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణ పేటెంట్ కోసం. ఈ భవన నిర్మాణ బాధ్యతలు తామంటే తాము మోసామని పోటీ పడుతున్నారు నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు. భవన నిర్మాణానికి పునాది నుంచి తానే చూసుకున్నానని జానా చెబుతుండగా...సొంత డబ్బులతో భవనాన్ని నిర్మించానని మాజీ డిసిసి అధ్యక్షులు తూడి దేవేందర్ రెడ్డి చెబుతున్నారు...
నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కొత్త లొల్లి...జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్ లో నిర్మించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం కోసం శ్రమించింది తానేనని...పునాదుల నుంచి అన్నీ తానై సమకూర్చుకున్నానని ప్రస్తుత సిఎల్సీ నేత కె.జానారెడ్డి చెబుతుండగా... తాను అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే ఈ భవన నిర్మాణం ప్రారంభమైందని, తాను మాత్రం ఎవరి నంచీ వస్తూ లేదా నగదు రూపంలో ఎలాంటి విరాళాలు సేకరించలేదని అంటున్నారు డిసిసి మాజీ అధ్యక్షులు తుడి దేవేందర్ రెడ్డి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన గాంధీజీ వర్దంతి కార్యక్రమంలో మాజీ మంత్రి జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు, దీనికి తూడి స్పందించిన తీరు ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం గాంధీజీ వర్దంతి కార్యక్రమం జరిగింది. దీనికి సిఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, డిసిసి అధ్యక్షులు బూడిద బిక్షమయ్య గౌడ్తో పాటు జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. సమావేశంలో భాగంగా బిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ భవన నిర్మాణానికి జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులు తూడి దేవేందర్ రెడ్డి ఎంతగానే శ్రమించారని, తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి దీన్ని నిర్మించారని...అందుకు ప్రత్యేక సన్మానం ఏర్పాటు చేయాలని వ్యాఖ్యానించారు. అక్కడే అసలు లొల్లి మొదలైంది. బూడిద వ్యాఖ్యల పట్ల జానారెడ్డి స్పందించారు. తను ప్రసంగిస్తున్న సమయంలో ఈ విషయమై జానా మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ భవన నిర్మాణానికి పునాదుల నుంచి అన్నీ తానే చూసుకున్నానని, ఇందుకు అవసరమైన సిమెంటుతో పాటు ఇతర నిర్మాణ సామాగ్రిని తానే సమకూర్చి పెట్టానని వ్యాఖ్యానించారు. మిగిలిపోయిన భవన నిర్మాణ బాధ్యతలను కూడా తానే తీసుకుంటానని భరోసా ఇచ్చారు.
జానారెడ్డి వ్యాఖ్యలపై మాజీ డిసిసి అధ్యక్షులు తూడి దేవేందర్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. జానా వ్యాఖ్యలను ఎక్కడా ప్రస్తావించకుండానే తాను పార్టీ కార్యాలయం భవన నిర్మాణం కోసం ఏం చేశాననే విషయాన్ని వివరించారు. తాను అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో కార్యాలయ నిర్మాణం కోసం తన సొంత డబ్బులు వెచ్చించానని, పార్టీ వ్యవహారాలకు గానీ, భవన నిర్మాణానికి గానీ ఎవరి నుంచి వస్తూ లేదా నగదు రూపంలో ఎలాంటి నిరాళాలు తీసుకోలేదని వివరించారు. కాంగ్రెస్ నాయకుల నుంచి తాను డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు. తాను డిసిసి అధ్యక్ష పదవి చేపట్టే సమయానికి ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణం లేదని, తానే పునాదు తీయించి భవనాన్ని చేపట్టానని మీడియాతో చెప్పారు.
ఒక్క పార్టీ కార్యాలయ నిర్మాణానికే కాకుండా పార్టీ సభలకు కూడా తాను డబ్బులు వెచ్చించానని మీడియా ముందు చెప్పారు తూడి దేవేందర్ రెడ్డి. ఏ ఒక్కరి వద్ద డబ్బులు తీసుకోకుండా పార్టీకి సొంత డబ్బులు వెచ్చించానని...ఇప్పుడు నాయకులు మాట్లాడే తీరు తనను బాధిస్తోందని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు తూడి.
నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాయ నిర్మాణంపై పేటెంట్ కోసం జరుగుతున్న లొల్లి ఏ మలుపు తిరుగుతుందో...కాంగ్రెస్ నేతలు ఎవరేం మాట్లాడుతారో తూడి,జానాల్లో ఎవరికి పేటెంట్ ఇస్తారో వేచి చూడాల్సిందే...

No comments:
Post a Comment