Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad
Showing posts with label Naglonda. Show all posts
Showing posts with label Naglonda. Show all posts

Wednesday, 11 May 2016

నల్గోండ : నిండా మునుగుతున్న నిమ్మ రైతు

ఆరుగాలం శ్రమించి పండించిన నిమ్మ పంటకు మార్కెట్‌ లో మద్దతు ధర లభిస్తున్నా రైతన్నకు మాత్రం ఆ ధర అందడం లేద. పెట్టిన పెట్టుబడికి సమానంగా కోత, కూలీ, రవాణా ఒక పక్క భారంగా మారగా, మరోవైపు, అడ్డాల వద్ద కమీషన్‌ ఏజెంట్లు నిమ్మ రైతును పీల్చి పిప్పి చేస్తున్నారు. దీంతో నల్లగొండ జిల్లాలో నిమ్మరైతు నిలువు దోపిడికి గురవతున్నాడు.
జిల్లాలో నిమ్మ రైతాంగాన్ని దళారులు నిలువునా ముంచుతున్నారు. కమీషన్ల పేరుతో కోతలు పెడుతై రైతుల కష్టానికి ఫలితం లేకండా చేస్తున్నారు. ఒక
పక్క కోత, కూలి, రవాణా, పెట్టుబడులతో బేజారవుతుండగా మార్కెట్‌ కు పంటను తీసుకేళ్లే దళారుల చేతుల్లో పిప్పి అవుతున్న పరిస్థితి నెలకొంది. ఎకరాకు కనీసం 15 వేల రూపాయలు కుడా మిగలడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో నిమ్మకు అతిపెద్ద మార్కెట్‌ గా వున్న నకిరేకల్‌, జిల్లా కేంద్రమయిన నల్లగొండ ప్రాంతాల్లో 30 నుంచి 40 మంది దళారుల చేతుల్లోనే నిమ్మ ధర నిర?యించే పరిస్థితి వుంది. వారు చెప్పిందే
ధర..వారు కొన్నదే రేటు అన్న విధంగా మారడంతో గత్యంతరం లేని స్థితిలో నిమ్మ రైతు వారికే నిమ్మకాయలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా
దళారులు ప్రతియేటా నిమ్మ రైతునుంచి దాదాపు 30 కోట్ల రూపాయల మేరకు వ్యాపారం చేస్తూ నిమ్మ రైతులతో మాత్రం దివాళా తీయిస్తున్నారు.
జిల్లాలో ఉద్యావన సాగులో బత్తాయి తర్వాత అధికంగా సాగు చేస్తున్న పంగ నిమ్మ కావడంతో విశేషం. నిమ్మ తోటలకు జిల్లాలోని పలు ప్రాంతాలు
అనుకూలంగా వుండడంతో దిగుబడి సైతం ప్రతియేటా పెరుగుతున్న నేపధ్యం లో రైతులు నిమ్మ పంటను నమ్ముకున్నారు. అయితే, జిల్లాలో నిమ్మ
రైతులు పండించిన పంటలు విక్రయించుకునేందుకు మార్కెట్‌ సౌకర్యం లేకపోవడంతో రైతులు విధిలేని పరిస్థితిల్లో దళారులకు అమ్ముకుంటున్నారు.
జిల్లావ్యాప్తంగా దాదాపు 20 వేల హెక్టార్లలో నిమ్మ సాగవుతుండగా హెక్టారుకు 20 టన్నులవరకు దిగుబడి వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.
జిల్లాలో నిమ్మ మార్కెట్‌ లేకపోవడంతో హైదరాబాద్‌ లో విక్రయించాల్సి రావడంతో నిమ్మ వ్యాపారాన్ని అడ్డాగా చేసుకుని కొంతమంది దళారులు కమీషన్ల పేరుతో నిమ్మ రైతును పీల్చి పిప్పి చేస్తున్నారు. జిల్లా కేంద్రం నల్లగొండ పట్టణంలో పదినుంచి పదిహేనుమంది వరకు నిమ్మకాయలను కొనుగోలు చేసే
కమీషన్‌ ఏజెంట్లు వున్నారు. జిల్లాలో నిమ్మకు అతిపెద్ద మార్కెట్‌ గా వున్న నకిరేకల్‌ లో ఇరవై నుంచి ముప్పై మంది వరకు ఏజెంట్లు వున్నారు.
హైదరాబాద్‌ మార్కెట్‌ లో బస్తా నిమ్మకాయలకు సుమారు 1600 రూపాయల ధర లభిస్తుండగా స్థానిక ఏజెంట్లు మాత్రం రైతులనుంచి 1100 రూపాయలకే
బస్తా కొనుగోలు చేస్తూ గ్రేడింగ్‌, కాయ సైజు లాంటి సాకులతో దివాళా తీయిస్తున్నారు. వేసవి సీజన్‌ లో సుమారు లక్షా 25 వేలనుంచి లక్షా యాభై వేలవరకు పంట వస్తుండగా ఆగస్తు, సెప్టెంబర్‌ మాసాల్లో మాత్రం కేవలం 50 వేలనుంచి 75 వేల రూపాయలు మాత్రమే లభిస్తుందని రైతులు అవేదన వ్యక్తం
చేస్తున్నారు. కోత, కూలీ, రవాణా, పెట్టుబడుల లెక్కలు తీసినతరువాత రైతుకు ఎకరాకు 15 వేల రూపాయలు కుడా మిగలకుండా పోతోంది.
ఈ పరిస్థితి నుంచి నిమ్మ రైతులను ఆదుకోవాలన్నా, దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా నిమ్మకాయలు అమ్ముకోవాలన్నా, జిల్లాలో నిమ్మ
మార్కెట్‌ ఏర్పాటు చేయడం ఒక్కటే ప్రత్యామ్నాయ మార్గం అని రైతులు అంటున్నారు. 

Tuesday, 17 February 2015

నల్గొండ : రోడ్డున పడ్డ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బతుకులు

  రోడ్డున పడ్డ ఉద్యోగుల బతుకులు

నల్గొండ :  తెలంగాణ ప్రభుత్వం   సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ కార్యాలయాలను ఎత్తివేయడంతో ఆ శాఖలో పనిచేస్తున్న  అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డున  పడ్డారు . తెలంగాణ రాష్ట్రం వస్తే తమ ఉద్యోగాలకు భరోసా, భద్రత దక్కుతుందని భావించిన దానికి విరుద్ధంగా ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోవడంతో వారి కుటుంబాల పోషణ వారికి భారమైపోయింది. 
  దాదాపు 9వేలకు పైగా భూసేకరణ పనులు ఆయా కార్యాలయాల్లో సాగుతున్నాయి.   అవుట్ సోర్సింగ్ వారిని తొలగించనుండటంతో ఇంతకాలంగా ఆ కార్యాలయాల్లో ఉద్యోగాలతో ఉపాధి పొంది కుటుంబాన్ని పోషించుకున్న సదరు ఉద్యోగులంతా ఆకస్మికంగా ఉద్యోగాలు పోవడంతో కుటుంబ పోషణ భారమై సంక్షోభంలో పడిపోయారు. అదే సమయంలో ఆయా కార్యాలయాల్లో పనిచేసిన రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రం ఇతర ప్రాజెక్టుల్లో పోస్టింగ్ ఇచ్చి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను మాత్రం గాలికి వదిలేసింది. ప్రభుత్వం ఇరిగేషన్, భూసేకరణ కార్యాలయాల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడానికి బదులుగా వారికి ఆ రంగంలో ఉన్న అనుభవం మేరకు జిల్లాలో భారీ ఎత్తున ఇతర సాగునీటి, విద్యుత్ తదితర భూసేకరణ ప్రక్రియ అవసరమైన ప్రాజెక్టుల్లో నియమించాల కోరుకుంటున్నారు .

Saturday, 14 February 2015

నల్గొండ : ఏం పి గుత్త సుక్విందర్ రెడ్డి ఫైర్

నల్గొండ : ఏం పి గుత్త సుక్విందర్ రెడ్డి ఫైర్



పంతాలు పట్టింపులకు వెల్లి రైతాంగాన్ని పణంగా పెట్టడంతో పాటు...రెండు రాష్ట్రాల మద్య ఘర్షణ వాతావరణానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలదే కాకుండా రెండు రాష్ట్రాల నాయకత్వానిది కూడా అని విమర్సించారు నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి. రెండులల ముందు చర్చించుకొని ఉంటే..ఈ సమస్య వచ్చేది కాదని, కేవలం రాజకీయ లబ్ది కోసమే ఇరు రాష్ట్రాలు పాకులాడుతున్నాయని విమర్సించారు గుత్తా...

నల్గొండ : సమసిన రెండు తెలుగు రాష్ట్రాల జలవివాదం.

సమసిన  రెండు తెలుగు రాష్ట్రాల  జలవివాదం

నల్గొండ :  గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మద్య నెలకొన్న జలవివాదం ప్రస్తుతానికి సమసిపోయింది. ఆంధ్రప్రదేశ్ లోని పంటలకు సాగునీటి అవసరాలకు పది టిఎంసిల నీటిని విడుదల చేయాలని, అలాగే కుడికాలువ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను తెలంగాణా అవసరాలకు ఇవ్వాలనే ఒప్పందం ఇరు రాష్ట్రాల మద్య జరిగింది. దీంతో జలవివాదానికి సంబంధించి తాత్కాలికంగా ఓ స్పష్టత వచ్చిందని చెప్పవచ్చు. నీటి వినియోగంపై ఉన్న అపోహలు,అనుమానాలు కూడా తీరే అవకాశం ఉంది.
రాష్ట్ర విభజన తర్వాత నాగార్జునసాగర్ కేంద్రంగా రెండు రాష్ట్రాల మధ్య జలవీవాదం రగులుతూనే ఉంది. గత ఏడాది అగస్టులో సాగర్ కు పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పటికీ ఖరీఫ్ పంటకు కుడి,ఎడమ కాలువలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరివ్వడం జరిగింది. అయితే అదే ఖరీఫ్ పంటకు మూడో జోన్ కు ఈ నెలాఖరు వరకు కుడి,ఎడమ కాల్వలకు ఇంకా నీరు అందించాల్సి ఉంది. అయితే కుడి కాలువకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి కేటాయింపు కన్నా అధికంగా నీరు వాడుకుందని తెలంగాణా ప్రభుత్వం ఆరోపించింది. తెలంగాణా ప్రభుత్వమే వాటాకు మించి నీటిని వాడుకుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే విభజన తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ తెలంగాణా ప్రభుత్వానికి అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని నీళ్లు కావాలనే విషయం స్పష్టం చేయకపోవడంతో తెలంగాణా ప్రభుత్వం కుడి కాలువ ద్వారా నీటిని నిలిపివేసింది. దీంతో ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న ఆరు లక్షల ఎకరాలకు మరో ఆరు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని నిన్న(శుక్రవారంనాడు) ఆ రాష్ట్రానికి చెందిన అధికారులు తెలంగాణా అధికారులను కోరారు. అయితే తెలంగాణా ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎస్ఈ తెలిపారు. దీంతో వెనుదిరిగి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ అధికారులు కొద్దిసేపటి తర్వాత పోలీసులతో కలిసి వచ్చారు. తమకు ఆరువేల క్యూసెక్కుల నీటిని వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో తామే గేట్లు ఎత్తుకుంటామని వాదించారు. దీంతో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారుల మధ్య వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రక్తంగా మారడంతో ఇరు రాష్ట్రాల పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు. పోలీసుల మధ్య కూడా వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. డ్యాం సాక్షిగా ఇరు రాష్ట్రాల పోలీసులు ఒకరి పై ఒకరు లాఠీలు ఝులిపించుకున్నారు. దీంతో ఒక్క సారిగా రెండు తెలుగు రాష్ట్ర్రాలు ఉలిక్కిపడ్డాయి.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోన్లో సంప్రదించుకొని...ఈ రోజు(శనివారం నాడు) గవర్నర్ సమక్షంలో మధ్యే మార్గంగా ప్రస్తుతానికి రాజీ మార్గానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అవసరాల కోసం పది టిఎంసిల నీటిని విడుదల చేయాలని, అలాగే ఉత్పత్తయ్యే విద్యుత్ ను తెలంగాణా రాష్ట్రానికి ఇవ్వాలని ఇరు రాష్ట్రాలు ఓ అవగాహనకు వచ్చారు. శనివారం సాయంత్రం ఇరు రాష్ట్రాల అధికారుల సమక్షంలో కుడి కాలువ ద్వారా ఏడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అలాగే గత రెండు రోజులుగా ప్రాజెక్టు వద్ద ఉన్న పోలీసులను ఇరు రాష్ట్రాలు వెనక్కి పిలిపించుకున్నాయి. ఇక రబి పంటకు సంబంధించిన నీటి విషయంలోనూ ఇరు రాష్ట్రాల సంబంధించిన ఇరిగేషన్ అధికారులే పూర్తి బాధ్యత వహించి నిర్ణయాలు తీసుకునేటట్లు, సాగర్ డ్యాం భద్రత ప్రస్తుతం ఉన్న ఎస్ పి ఎఫ్ బలగాలు నిర్వహించే విధంగా చూడడంతో పాటు భవిష్యత్తులోనూ సిఐఎస్ఎఫ్ బలగాల సహాయం తీసుకునేలా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయానికి వచ్చాయి.
మొత్తానికి అధికారుల ఘర్షణతో తారాస్థాయికి చేరుకున్న సాగర్ పంచాయతీ...రెండు రాష్ట్రాల సిఎంలు ముందుకు రావడంతో సమస్య సునాయసంగా పరిష్కారమైంది. అయితే ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం తాత్కాలికంగా మాత్రమే సమసిందని చెప్పవచ్చు. ప్రాజెక్టులు నీళ్లు తగ్గుతున్నా కొద్ది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు పెరుగుతున్నాయి. అలాంటి సమయంలో రెండు రాష్ట్రాలు కూడా సంయమనం పాటించి...రెండు రాష్ట్రాలకు మేలు జరిగేలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Friday, 13 February 2015

నల్గొండ : టిఆర్ఎస్ లో తన్నులాట... సూర్యాపేటలో పాతకొత్త నేతల మధ్య అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉంది.

టిఆర్ఎస్ లో తన్నులాట

నల్గొండ జిల్లా : టిఆర్ఎస్ లో తన్నులాట మొదలైంది... సాత,కొత్త నేతల మధ్య పొసగని పరిస్థితి ఏర్పడింది. కొన్ని నియోజకవర్గాల్లో బడా నేతలే ఎవరికి వారన్నట్టు ఉండగా...చాలా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు సాగుతున్నాయి. సభ్యత్వ నమోదు, అధికారిక కార్యక్రమాల్లో అవి బట్టబటలవుతున్నాయి...
జిల్లాలో ప్రస్తుతం టిఆర్ఎస్ లో తన్నులాటలు మొదలయ్యాయి....కొన్ని నియోజకవర్గాల్లో బడా నేతలే ఎవరికి వారన్నట్టు ఉండగా, అనేక నియోజకవర్గాల్లో మండలాల్లో రెండు గ్రూపులుగా కొనసాగుతున్నారు. సభ్యత్వ నమోదు, క్రమంలో ఓపికతో ఉన్న నేతలు అవకాశం దొరక్కపోతే ఏం చేయాలనే విషయంలో స్పష్టంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పనులు , పదవుల విషయంలో నువ్వా-నేనా అన్నట్టు నివురు గప్పిన నిప్పులా ఉన్నారు. జిల్లా పెద్దలు అధిష్టానంలో పెద్దల వద్ధ ఎవరికి వారు రాయబారం కొనసాగిస్తూ ఉనికి చాటుకునే పనిలో ఉన్నారు.
మునుగోడు నియోగవర్గంలో ఎంఎల్సీ కర్నే ప్రభాకర్, ఎంఎల్ఎ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిల మధ్య ఏ మాత్రం పొసగడం లేదు. నియోజకవర్గంలో ఒకరు హాజరైన కార్యక్రమానికి మరొకరు హాజరయ్యే పరిస్థిత లేదు. ఎంపి, ఎంఎల్ఎ,ఎంఎల్సీ ఊ ముగ్గురు కలిసి వెళ్లే పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే మరో వేత వేనేపల్లి వెంకటేశ్వరరావుది మరో దారి... భువనగిరి నియోజకవర్గంలో ఎంఎల్ఎ పైల్ల శేఖర్ రెడ్డి, ఎంపి బూర నర్స్యగౌడ్ ల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వీరు ఇరువురి మధ్య క్రమంగా వర్గ పోరు రాజుకుంటోంది. ఆ మధ్య ఇరు గ్రూపుల మధ్య తోపులాట కూడా చోటుచేసుకుంది. మమరోమారు ఎంఎల్సీ స్ధానాన్ని ఆశిస్తున్న నేతి విద్యాసాగర్ ప్రస్తుతం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. అనుకున్న పదవి కావాలంటే అందరి మద్ధతు ఉండాలి కదా...అన్న ఆలోచనే దీనికి కారణమని తెలుస్తోంది. ఫలితంగా నకిరేకల్ నియోజకవర్గంలో ఎంఎల్ఎ వీరేశం ఆలోచనల మేరకు అక్కడ ముందుకు వెళుతున్నారు. నార్కెట్ పల్లి మండలంలో స్థానిక నేతల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇది ఆ నియోజకవర్గంలో టిఆర్ఎస్ కు ఇబ్బందికర పరిణామంగా మారింది.
ఇక తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ రెండు గ్రూపులుగా నేతలున్నారు. నియోజకవర్గ స్తాయిలో అంతా కిశోర్ వైపే ఉన్నారు. నేనంటే నేను...అన్న సమస్య తో కొంత ఎడమోహం పెడమోహంగా ఉన్నారు. మంత్రి జన్మస్థానం కావడంతో పోలీసు, రెవెన్యూ అధికారుల విషయంలో ఆయన ముద్రలు కనిపించడాన్ని స్థానిక నేతలు జీర్ణించుకునే పరిస్థితి లేదు. స్థానిక నేతల మాటను వారు పూర్తిగా ఖాతరు చేసే పరిస్తితి లేదు. నల్గొండ నియోజకవర్గంలో అత్యధిక భాగం ఇన్న ఛార్జీ దుబ్బాక నర్సింహ్మారెడ్డి కనుసన్నుల్లోనే కొనసాగుతోంది. తిప్పర్తి,నల్గొండ పట్టణంలో కొన్ని చోట్ల చకిలం అనిల్ కుమార్, కనగల్ లో కొన్ని గ్రామాల్లో ఛాడా కిషన్ రెడ్డి ల ప్రభావం ఉంది.
జిల్లాలో తమకు సరైన ప్రాతనిధ్యం...గౌరవం లభించడం లేదని ఇద్దరు కీలక నేతలు అధిష్టానం వద్ద మోరపెట్టుకున్నట్లు సమాచారం. నియోజకవర్గాలు పెరుగుతాయి, ఇద్దరు నేతలు ఉన్న చోట ఇబ్బంది ఉండదని కేసిఆర్ హామీ ఇవ్వడంతో కొంత భరోసాతో ఉన్నారు. అయితే అధినేత ప్రకటనకు భిన్నంగా ఇప్పట్లో నియోజకవర్గాల పునర్విభజన ఉండదని ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి కుండబద్దలు కొట్టడంతో అసమ్మతి నేతల్లో గుబులు మొదలైంది. నామినేటెడ్ పదవులు పందేరం నేపధ్యంలో ఎనిమిది నెలల సహనానికి ఎప్పుడు ఊరడింపు లభిస్తుందోనన్న ఆశతో ఉన్నారు. మొత్తానికి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ తరహాలోనే ఆయా నియోజకవర్గాల్లో వర్గపోరు కొనసాగుతోంది.
మంత్రి జగదీశ్ రెడ్డి నియోజకవర్గమైన సూర్యాపేటలో పాతకొత్త నేతల మధ్య అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉంది. కొత్త వారి చేరికతో తమకు రావాల్సిన పదవులు, ప్రాధాన్యంలో లోటు ఏర్పడతుతుందనేది పాత కాపుల వాదన. గండూరి ప్రకాశ్ వంటి నేతలు చివరి క్షణంలో వచ్చి ఆధిపత్యం చేస్తున్నారనే మనోవేదనలో పాత నేతలున్నారు. మంత్రి ఇలాఖాలోనే గులాబి తమ్ముల్లు తన్నుకున్నారు. టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి పాల్గొని వెళ్లిన వెంటనే రెండు గ్రూపులు బాహాబాహికి దిగాయి. ఒకరినొకరు తోసుకుంటూ...నువ్వెంతా..అంటే నువ్వెంతా అంటూ ఘర్ఘణకు దిగారు. దేవరకొండ నియోజకవర్గంలో బాలునాయక్ చేరికతో సమీకరణాలు మారాయి. బాలు చేరికతో పాత కాపు రాములునాయక్ పూర్తిగా మౌనంగా ఉన్నారు. జడ్పీ ఛైర్మన్, నియోజకవర్గ ఇన్ ఛార్జీ అధికార పార్టీ కావడంతో బాలునాయక్ వైపు నియోజకవర్గ నేతలు మొగ్గుచూపుతున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ముచ్చటగా మూడు వర్గాలు కొనసాగుతున్నాయి. జిల్లాలోనే ఇక్కడ ఆధిపత్యపోరు అగ్రభాగాన ఉంది. పాత కాపు దొంతిరెడ్డి శ్రీనివార్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ ఛార్జీ శంకరమ్మ, సీనియర్ నేత సాముల శివారెడ్డి ఎవరికి వారే అన్నట్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలోని అత్యధిక మండలాల అధ్యక్షులు పాత కాపులు దొంతిరెడ్డి నాయకత్వంలోనే ఉన్నారు. కొత్తగా చేరిన వారు శంకరమ్మ వైపు అడుగులు వేస్తున్నారు. శివారెడ్డి వైపు బలమైన సామాజిక వర్గం ఉంది. ముగ్గురు ఇలా ఉంటే గ్రందాలయ ఛైర్మన్ అల్లం ప్రబాకర రెడ్డి మరో గ్రూపుగా ఉన్నారు. ఇటీవల హుజూర్ నగర్ లో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అసమ్మతిని దారిన పెట్టే బాధ్యతను పార్లమెంటరీ కార్యదర్శి గాదారి కిషోర్ కు బాధ్యతలు అప్పగించారు. ఆతర్వాత నేరెడుచర్ల లో ఇరు గ్రాపులు పిడి గుద్దులు గుద్దుకున్నారు...గాల్లోకీ కుర్చీలు విసురుకున్నారు.

నల్గొండ : ప్రసాదం ధరను పెంచి భక్తుల ఫై భారం



ప్రసాదం ధరను పెంచి భక్తుల ఫై భారం

నల్గొండ : ప్రసాదం ధరను పెంచి భక్తులపై బారాన్ని పెంచింది శ్రీలక్ష్మినరసింహ్మ స్వామి దేవస్థానం... లడ్డూ ప్రసాదం,పులిహారతో పాటు వడ రేటునుకు కూడా పెంచేసింది. మొన్నటి వరకు పది రూపాయలు విక్రయించే లడ్డూ ప్రసాదాన్ని పదిహేను రూపాయలకు...ఐదు రూపాయలు ఉన్న పులిహారను పది రూపాయలకు అలాగే పది రూపాయలున్న వడను పదిహేను రూపాయలుగా ధరలు పెంచారు దేవస్థానం అధికారులు. భక్తులకు ఎంతో ఇష్టమైన ప్రసాదం ధరలు పెంచి భారం మోపడం సరైంది కాదనే ఆరోపణలు వస్తున్నాయి. మరో వైపు ఇప్పటికే దేవస్థానం ప్రసాదం ధర విషయంలో కొంత నష్టాన్ని భరిస్తోందని...భక్తుల రద్దీ పెరగడంతో ఆ నష్టం మరింత పెరిగిందని తప్పని సరి పరిస్థితుల్లో ధరలు పెంచాల్సి వచ్చిందని ఈ ఓ గీతారెడ్డి చెబుతున్నారు.

నల్గొండ : నాగార్జున సాగర్ నీటి పంపకం పై రోజుకో వివాదం తలెత్తుతోంది...



నాగార్జున సాగర్ నీటి పంపకం పై రోజుకో వివాదం తలెత్తుతోంది.
file photo nagarjuna sagar


గత వారం రోజుల క్రితం డ్యాం లో సగభాగం మాకే చెందుతుందని ఏపి నీటిపారుదల శాఖ, నాగార్జునసాగర్ డ్యాం అదికారులకు లేఖ రాయడం వివాదంగా మారింది. అది పూర్తిగా సమసిపోక ముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. నీటి పంపకాల ప్రకారం ఇప్పటికే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువగా వాడుకోవడంతో కుడికాలువకు నీటి విడుదలను నిలిపివేశారు......మరో పక్క రోజురోజుకు డ్యాంలో నీటినిలువలు పడిపోతుండడంతో కుడికాలువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి కూడా నీరు అందని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కుడికాలువ ద్వారా నీటిని విడుదల చేస్తోంది. ఇలా చేస్తే టర్బైన్లు దెబ్బతినే ప్రమాదం ఉంది.
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం తారాస్థాయికి చేరింది. సాగర్ నుంచి నీటి విడుదలపై ఇరు రాష్ట్రాల మధ్య మొదలైన గొడవ నిన్న ఎపికి నీటిని ఆపేసే వరకు వెళ్లింది. డెల్టాలో సుమారు ఆరు లక్షల ఎకరాల్లో ున్న పంటను కాపాడేందుకు ఇప్పుడు ఏపి ప్రభుత్వం పెద్ద సాహసమే చేస్తోంది. కుడికాల్వల నుంచి నీటి విడుదలను ఆపేయడంతో విద్యుత్ ఉత్పత్తిని ఆరంభించింది. కుడి విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలంటే..సాగర్ లో నీటి మట్టం కనీసం 533.30 అడుగుల వరకు ఉండాలి. అయితే ప్రస్తుతం కేవలం 530.30 అడుగుల వరకే నీరు ఉన్నాయి. ఈ దశలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిం చేస్సే పవర్ స్టేషన్ లో ని టర్బయిన్లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సాగర్ చరిత్రలో ఈ స్థాయిలో నీటిమట్టం ఉండగా విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. కాల్వల నుంచి నీరు రాకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి కోసం సాగర్ నుంచి తీసుకున్న నీటిని టర్బయిన్లు కాల్వలోకి వదులుతాయి. ఆ నీరే డెల్టాకు వెళుతుంది. దీంతో తెలంగాణా అధికారులు కంగుతిన్నారు. ఎందుకంటే మొన్నటి వరకు కుడి కాల్వల ద్వారా రెండు వేల క్యూసెక్కుల నీటినే విడుదల చేసేవారు. ఇప్పుడు విద్యుత్తు టర్బయిన్ల ద్వారా పవర్ హౌస్ లోకి నాలుగు వేల క్యూసెక్కుల నీరు వెళుతోంది. దీంతో వారికి ఏం చేయాలో తెలియడం లేదు. ఒకవైపు టర్బయిన్లను బలిపెట్టి విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది ఆంధ్రప్రదేశ్...మరోవైపు రెండు వెల క్యూసెక్కులకు బదులు నాలుగు వేల క్యూసెక్కులను కోల్పోతోంది తెలంగాణా. చివరకు జల వివాదం రణరంగంగా మారింది. మంత్రులు అధికారుల సాయంతో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.

రెండు రాష్టాలు విడిపోయిన తరువాత ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న నాగార్జునసాగర్ నీటి పంపకాల విషయంతో ప్రతి రోజు ఏదో ఒక గలాట జరుగుతూనే ఉంది......పునర్విభజన చట్టం ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేషన్ ఏపీకి బదలాయించగా...నాగార్జునసాగర్ మెయింటనెన్స్ తెలంగాణా ప్రభుత్వం చూసుకుంటుంది.... దీంట్లో భాగంగానే నాగార్జున సాగర్ రిజర్వాయర్ మొత్తం నీరు 552 టీఎంసీలలో ....ఆంద్రప్రదేశ్ 322 టీఎంసీలు, తెలంగాణా 239.5 టీఎంసీల మేరు నీరు వాడుకోవాలని వాటాలు కేటాయించారు.....అయితే ఏపీ ఇప్పటికే అదనంగా 42 టీఎంసీలను వాడుకుందని ఎన్నెస్పీ అదికారులు తెలంగాణా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకొచ్చారు........ఏపీకి చెందిన కుడికాలువకు 132 టీఎంసీలు మేర నీటి కేటాయింపులుండగా....138టీఎంసీలు వాడుకున్నారని, క్రుష్ణా డెల్టా లో సైతం 152టీఎంసీల మేర నీటిని వాడుకునే అవకాశం ఉండగా, 170టీఎంసీలను వాడుకున్నరని అదికారులు ప్రభుత్వానికి చెప్పారని సమాచారం...తెలంగాణ తనకు దక్కే 239.5 టీఎంసీల నీటితో కేవలం 137 టీఎంసీల మేర వాడుకుందని , ఇదిపోను మరో 102 టీఎంసీల నీటిని తెలంగాణా వాడుకునే హక్కుఉందని ఈలెక్కన ప్రస్తుతం లభ్యతగా ఉన్న 51 టీఎంసీలు పూర్తిగా తెలంగాణాకే దక్కుతాయని ఎన్నెస్పీ అదికారులు చెపుతున్నారు...వాటాకు మించి వాడుకున్నందున ఏపీకి కుడికాలువ కింద నీరివ్వరాదని నిర్ణయించారు....కాగా ఏపీ తన అవసరాల కోసం లిఖిత పూర్వకంగా అర్జీ పెట్టుకుంటే కొంత నీటిని విడుదల చేసే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయిచింది...

ప్రస్తుతం నాగార్జునసాగర్ లో నీటి మట్టం 532.20 అడుగులు ఉండగా.....నిన్న రాత్రి నుండి రైట్ కెనాల్ పై ఉన్న విద్యుత్ కేంద్రానికి 2000 క్యూసెక్కుల నీరు, లెఫ్ట్ కెనాల్ కి 8015 క్యూసెక్కుల నీరు, ఎస్ ఎల్బీసీ 1500 నీటిని విడుదల చేస్తున్నారు...అయితే 530 అడుగుల నీరు ఉన్న క్రమంలో రైట్ కెనాల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన సాద్యం కాదు....ఒకవేళ ఈ నీటి మట్టంపైనే విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తే టర్బైన్లు చెడిపోయి వైబ్రేషన్ వచ్చే ప్రమాదముంది....దీంట్లో బాగంగానే రెండు రోజుల క్రితం ఏపీ అదికారులు రైట్ కెనాల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి నీటిని నిలుపుదల చేశారు.....కాని మళ్లీ గురువారం ఉదయం నుండి యదావిదిగా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంబించారు.....దీంతో నీటి కోసం ఇరురాష్టాల మద్య వివాదాలు , ఘర్షణలు ,మొండిపట్టింపులు ..ప్రపంచంలోనే అతిపెద్దదైన నాగార్జునసాగర్ ప్రాజెక్టుకే ముప్పును తెచ్చిపెట్టే ప్రమాదం లేకపోలేదు....

Friday, 6 February 2015

నల్గొండ : మాజీ మంత్రి కొమటి రెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కేసిఆర్ పై ఫైర్


మాజీ మంత్రి కొమటి రెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కేసిఆర్ పై ఫైర్

నల్గొండ : మొన్నటి వరకు నిశబ్దాన్ని పాటించిన మాజీ మంత్రి కొమటి రెడ్డి వెంకటరెడ్డి మళ్లీ గళమిప్పారు. ఏకంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పై ఫైర్ అయ్యారు. కెసిఆర్ పాలన చూస్తుంటే అసలు తెలంగాణా ఎందుకు వచ్చిందనే బాధ కలుగుతోందని చెప్పారు. అలాగే రోజుకో ప్రకటన చూసి ప్రజలు ఆశలు వదులుకొని తిరగబడే రోజులు వచ్చాయని అన్నారు. అంతేగాక సెక్రటరియేట్, రవీంద్రభారతీలు మార్చడం సరైంది కాదని...కుల సంఘాల భవన నిర్మాణాలకు కూడా ఇది సరైన సమయం కాదని అన్నారు కోమటిరెడ్డి. అసెంబ్లీ సమావేశాల్లోనూ సిఎం ను నిలదీస్తామన్నారు.

నల్గొండ : ఎలక్ట్రిసిటీ స్టోర్ లో అగ్నిప్రమాదం

 ఎలక్ట్రిసిటీ స్టోర్ లో అగ్నిప్రమాదం
 నల్గొండ : నల్గొండ పట్టణంలోని ఎలక్ట్రిసిటీ స్టోర్ లో అగ్నిప్రమాదం జరిగింది. షాట్ సర్య్కూట్ వల్ల ఈ ప్రమాదంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. స్టోర్ లో ఉన్న ఎలక్ట్రికల్ మీటర్లు పూర్తిగా కాలిపోయాయి. ఎలక్టికల్ మీటర్ల తో పాటు స్టోర్ లో ఉన్న ఇతర సామాన్లు కూడా దగ్దమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Wednesday, 4 February 2015

నల్గొండ: ప్రముఖ కార్టునిస్టు ఆర్.కె.లక్ష్మణ్ స్పూర్తి సభ

 ప్రముఖ కార్టునిస్టు ఆర్.కె.లక్ష్మణ్ స్పూర్తి సభ


ప్రముఖ కార్టునిస్టు ఆర్.కె.లక్ష్మణ్ స్పూర్తి సభను నల్గొండలో ఘనంగా నిర్వహించారు . ఎంవిఎన్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్పూర్తి సభలో ప్రముఖ కార్టునిస్టులు, ఫోటోగ్రాఫర్లతో పాటు సామాజికవేత్తలు పాల్గొన్నారు. ఆర్.కె.లక్ష్మణ్ తన కార్టూన్ల ద్వారా దేశానికి చేసిన సేవలను మననం చేసుకున్నారు. సామాన్యుల సమస్యలను తన కార్టూన్ల ద్వారా సమాజానికి తెలియజేసిన అభ్యవదయ వాది ఆర్.కె.లక్ష్మణ్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి కొనియాడారు.

నల్గొండ :ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా

ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని
టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా

ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ లో టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు విద్యార్ధులు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్ధులు నల్గొండ కలెక్టరేట్ ముందు బైఠాయించారు. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, స్కాలర్ షిప్పులు, ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని, జీవితాలు మారిపోతాయని భావించి నిరుద్యోగులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, అలాంటి నిరుద్యోగులు ప్రస్తుతం నిరాశతో ఉన్నారని నాయకులు ఆరోపిస్తున్నారు.

Saturday, 31 January 2015

నల్గొండ : కాంగ్రెస్ పార్టీలో లొల్లి.

 కాంగ్రెస్ పార్టీలో  లొల్లి.
నల్గొండ :  నల్గొండ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కొత్త లొల్లి మొదలైంది. ఈ గొడవ ఏదో పదవి కోసమో...లేక ఎంఎల్ఎ,ఎంపి సీటు కోసమో లేక ఎంఎల్సీ అభ్యర్ధిత్వం కోసం కానే కాదు... పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణ పేటెంట్ కోసం. ఈ భవన నిర్మాణ బాధ్యతలు తామంటే తాము మోసామని పోటీ పడుతున్నారు నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు. భవన నిర్మాణానికి పునాది నుంచి తానే చూసుకున్నానని జానా చెబుతుండగా...సొంత డబ్బులతో భవనాన్ని నిర్మించానని మాజీ డిసిసి అధ్యక్షులు తూడి దేవేందర్ రెడ్డి చెబుతున్నారు...
నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కొత్త లొల్లి...జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్ లో నిర్మించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం కోసం శ్రమించింది తానేనని...పునాదుల నుంచి అన్నీ తానై సమకూర్చుకున్నానని ప్రస్తుత సిఎల్సీ నేత కె.జానారెడ్డి చెబుతుండగా... తాను అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే ఈ భవన నిర్మాణం ప్రారంభమైందని, తాను మాత్రం ఎవరి నంచీ వస్తూ లేదా నగదు రూపంలో ఎలాంటి విరాళాలు సేకరించలేదని అంటున్నారు డిసిసి మాజీ అధ్యక్షులు తుడి దేవేందర్ రెడ్డి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన గాంధీజీ వర్దంతి కార్యక్రమంలో మాజీ మంత్రి జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు, దీనికి తూడి స్పందించిన తీరు ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం గాంధీజీ వర్దంతి కార్యక్రమం జరిగింది. దీనికి సిఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, డిసిసి అధ్యక్షులు బూడిద బిక్షమయ్య గౌడ్తో పాటు జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. సమావేశంలో భాగంగా బిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ భవన నిర్మాణానికి జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులు తూడి దేవేందర్ రెడ్డి ఎంతగానే శ్రమించారని, తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి దీన్ని నిర్మించారని...అందుకు ప్రత్యేక సన్మానం ఏర్పాటు చేయాలని వ్యాఖ్యానించారు. అక్కడే అసలు లొల్లి మొదలైంది. బూడిద వ్యాఖ్యల పట్ల జానారెడ్డి స్పందించారు. తను ప్రసంగిస్తున్న సమయంలో ఈ విషయమై జానా మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ భవన నిర్మాణానికి పునాదుల నుంచి అన్నీ తానే చూసుకున్నానని, ఇందుకు అవసరమైన సిమెంటుతో పాటు ఇతర నిర్మాణ సామాగ్రిని తానే సమకూర్చి పెట్టానని వ్యాఖ్యానించారు. మిగిలిపోయిన భవన నిర్మాణ బాధ్యతలను కూడా తానే తీసుకుంటానని భరోసా ఇచ్చారు.
జానారెడ్డి వ్యాఖ్యలపై మాజీ డిసిసి అధ్యక్షులు తూడి దేవేందర్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. జానా వ్యాఖ్యలను ఎక్కడా ప్రస్తావించకుండానే తాను పార్టీ కార్యాలయం భవన నిర్మాణం కోసం ఏం చేశాననే విషయాన్ని వివరించారు. తాను అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో కార్యాలయ నిర్మాణం కోసం తన సొంత డబ్బులు వెచ్చించానని, పార్టీ వ్యవహారాలకు గానీ, భవన నిర్మాణానికి గానీ ఎవరి నుంచి వస్తూ లేదా నగదు రూపంలో ఎలాంటి నిరాళాలు తీసుకోలేదని వివరించారు. కాంగ్రెస్ నాయకుల నుంచి తాను డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు. తాను డిసిసి అధ్యక్ష పదవి చేపట్టే సమయానికి ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణం లేదని, తానే పునాదు తీయించి భవనాన్ని చేపట్టానని మీడియాతో చెప్పారు.
ఒక్క పార్టీ కార్యాలయ నిర్మాణానికే కాకుండా పార్టీ సభలకు కూడా తాను డబ్బులు వెచ్చించానని మీడియా ముందు చెప్పారు తూడి దేవేందర్ రెడ్డి. ఏ ఒక్కరి వద్ద డబ్బులు తీసుకోకుండా పార్టీకి సొంత డబ్బులు వెచ్చించానని...ఇప్పుడు నాయకులు మాట్లాడే తీరు తనను బాధిస్తోందని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు తూడి.
నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాయ నిర్మాణంపై పేటెంట్ కోసం జరుగుతున్న లొల్లి ఏ మలుపు తిరుగుతుందో...కాంగ్రెస్ నేతలు ఎవరేం మాట్లాడుతారో తూడి,జానాల్లో ఎవరికి పేటెంట్ ఇస్తారో వేచి చూడాల్సిందే...

నల్గొండ : సూర్యాపేట ఎస్టీఓ ఎం.ఇష్టారానితో పాటు ఎకౌంటెన్ట్ వెంకటేశ్వర్లును సస్పెండ్.

ఎస్టీఓ ఎం.ఇష్టారానితో పాటు ఎకౌంటెన్ట్ వెంకటేశ్వర్లును సస్పెండ్
 నల్గొండ : నల్గొండ జిల్లా సూర్యాపేట ఎస్టీఓ ఎం.ఇష్టారానితో పాటు ఎకౌంటెన్ట్ వెంకటేశ్వర్లును సస్పెండ్చ్ చేశారు ఉన్నాతాధికారులు. తీవ్రమైన అవినీతి ఆరోపణల నేపధ్యంలో విచారణ జరిపిన ఉన్నతాధికారులు అవి నిజమని తేలడంతో వారిద్దరిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చారు. ఉపాధ్యాయుల ఆర్జిత సెలవులకు సంబంధించిన కుంభకోణంమే ఈ సస్పెన్షన్లకు కారణం.
నీతులు చెప్పడానికి మాత్రమే..ఆచరనించడానికి మాత్రం కాదని రుజువు చేస్తున్నారు కొంతమంది అవినీతి చీడపురుగులు. ప్రపంచమంతా లంచకొండి తనానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే కొంత మంది లంచకొండులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడి తన నిసిగ్గు తనాన్ని ప్రదర్శించుకున్నారు.
నల్గొండ జిల్లా చివ్వెంల మండలంలోని ఉపాధ్యాయుల ఆర్జిత సెలవులకు సంబంధించిన కుంభకోణం జరిగింది. మొత్తం మూడు కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విచారణ జరిపిన అధికారులకు కోటిన్నర రూపాయల అవినీతి జరినట్లు రుజువైంది. మిగతా కోటిన్నర గురించి ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ అవినీతికి బాద్యులైన ఎస్టీఓ ఎం. ఇష్టారాణితో పాటు ఎకౌంటెంట్ వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నాతాధికారులు ప్రకటించారు.
ఈ కుంభకోణం వెనకాల ఉన్న మరికొంత మంది కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది.

Thursday, 29 January 2015

నల్గొండ : పోలీసు కొత్త వాహనాలను ప్రారంభించిన మంత్రి జగదీశ్ రెడ్డి

పోలీసు వాహనాలను...: మంత్రి జగదీశ్ రెడ్డి
నల్గొండ లో కొత్త పోలీసు వాహనాలను ప్రారంభించారు మంత్రి జగదీశ్ రెడ్డి. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు అందజేశారు. మొత్తం 71 వాహనాలకు మంత్రి జగదీశ్ రెడ్డి జెండా ఊపి ప్రారంబించారు. అలాగే నెలవారి ఖర్చులుగా పట్టణ ప్రాంత పోలీస్ స్టేషన్లకు యాభై వేలు, గ్రామీణ ప్రాంత పోలీస్ స్టేషన్లకు ఇరవై ఐదు వేల చొప్పున అందిస్తున్నామని, తమది ఫ్లెండ్లీ ప్రభుత్వమని, ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న నేపధ్యంలో పోలీసులు కూడా మంచి సేవలు ప్రజలకు అందించాలని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.

పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున శైవ క్షేత్రం.

పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది ఆ శైవ క్షేత్రం.
నల్గొండ జిల్లాలోని శివాలయం
శివుని జఠాజూటం నుంచి నిత్యం నీళ్లు రావడం...ప్రతి 120 సంవత్సరాలకు బెత్తెడు లింగం పెరడం వంటి మహిమలతో పాటు భక్తుల కోరికలు తీర్చే పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది ఆ శైవ క్షేత్రం. ఘన చరిత్ర కలిగి ఎన్ని మహిమలు కలిగిన నల్గొండ జిల్లాలోని శివాలయం
జిల్లాలోని మేళ్లచెర్వు మండల కేంద్రంలోని ఇష్టకామేశ్వరి సమేత స్వయంబు శంభులింగేశ్వర స్వామి దేవస్థానం దక్షిణ కాశీ క్షేత్రంగా విరాజిల్లుతోంది. మేళ్లచెర్వు మండల కేంద్రంలోని ఈ శైవక్షేత్రం తెలంగాణా వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది. కాకతీయుల కాలంలో వెలసిన దేవాలయానికి అనేక మహిమలున్నాయి.
1126వ సంవత్సరంలో ఈ దేవాలయం వెలసినట్లు చరిత్ర చెబుతోంది. ఓరుగల్లు నుంచి ఈ ప్రాంతానికి వలస వచ్చిన స్వామి వారు ఆవుల మందలో జన్మించినట్లు చరిత్రలో ఉంది. ఈ దేవాలయంలో శివుడు ఆర్థనారీశ్వరుని ఆకారంలో ఉంటాడు. అంతేగాకుండా శివుని జఠాజూటం నుంచి నిత్యం నీళ్లు వస్తూనే ఉంటాయి. ఎన్ని నీళ్లు తీస్తే అన్ని నీళ్లు మళ్లీ పుట్టుకొస్తూనే ఉంటాయి. అన్నింటి కంటే అధ్బుతమైన విషయం ఏమిటంటే ప్రతి 120 సంవత్సరాలకు ఓ సారి బెత్తెడు లింగం పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.
ఘన చరిత్ర కలిగిన ఈ శివాలయాన్ని మనస్పూర్తిగా దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా సంతానం లేని వారికి స్వామి వారు పిల్లలను ప్రసాదిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా ఈ శైవక్షేత్రం భక్త జన సంద్రంగా మారుతుంది.
భక్తుల కోరికలు తీరుస్తూ దక్షిణ కాశీ క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ ఇష్టకామేశ్వరి సమేత స్వయంబు శంభులింగేశ్వర స్వామి దేవాలయం భక్తుల ఇష్ట దైవంగా మారింది. అందుకే ఈ పుణ్యక్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిపోతున్నారు భక్తులు.

Friday, 23 January 2015

nalgonda


నల్గొండ జిల్లాలో ప్రారంభమైన శర్మీల పరామర్శ యాత్ర


నల్గొండ జిల్లాలో ప్రారంభమైన శర్మీల పరామర్శ యాత్ర

వైఎస్ జగన్, శర్మీల ఓదార్పు యాత్రలంటే జనం తండోపతండాలుగా వచ్చేవారు...వారు ఏం మాట్లాడుతారో వినేందుకు ఉత్సహాన్ని కనబర్చే వారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయులను చూసేందుకు వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయడం ఎవరితరం అయ్యేది కాదు...ఇదంతా ఒకప్పుటి మాట. ఇప్పుడు ప్రజల్లో స్పందన కరువైంది. నలుగురైదుగురు వైఎస్ఆర్సీపి కార్యకర్తలు తప్ప ఎవరూ కనిపించడం లేదు. తాజాగా నల్గొండ జిల్లాలో ప్రారంభమైన శర్మీల పరామర్శ యాత్ర చప్పగా సాగుతోంది. ప్రజల్లో పెద్ద గా స్పందన కనిపించడం లేదు.
తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో వైఎస్ జగన్ సమైకాంధ్రకు మద్ధతుగా నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉందని ప్రకటించారు. దీంతో తెలంగాణా వాదులందరికి కోపం వచ్చింది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణా ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్సీపి నేతలు కూడా మూకుమ్మడి రాజీనామాలు చేశారు. దీంతో తెలంగాణా ప్రాంతంలో వైఎస్ఆర్సీపి దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఈ నేపధ్యంలో తెలంగాణా ప్రాంతంలో ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపి.
2013 ఫిబ్రవరి లో మరో ప్రస్థానం పేరుతో నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేపట్టారు. ఆ సమయంలో ప్రజల నుంచి విషేశ స్పందన లభించింది. శర్మీలను చూసేందుకు...ప్రసంగాన్ని వినేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.
అనేక కారణాల వల్ల ఓదార్పు యాత్రను నిలిపివేసిన వైఎస్ఆర్సీపి పరామర్శ యాత్ర పేరుతో మళ్లీ మొదలు పెట్టింది. ఈ సారి జగన్ కు బదులుగా షర్మీలా బయలుదేరింది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలో వారం రోజుల పాటు పరామర్శ యాత్ర కు పూనుకుంది. మొదటి రోజు దేవరకొండ నియోజవకవర్గంలోని మూడు కుటుంబాలను పరామర్శించింది. రెండో రోజు నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని మూడు కుటుంబాలను పరామర్శించింది శర్మీలా. మూడో రోజు మిర్యాలగూడ నియోజకవర్గంలోని నాలుగు కుటుంబాలను శర్మీలా పరామర్శించనుంది. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. జనం కంటే...తోడు వచ్చిన వాహనాల సంఖ్య ఎక్కువగా కనిపించింది. శర్మీలా వెంట వచ్చిన కొంతమంది వైఎస్ఆర్సీపి నాయకులతో పాటు ప్రయివేటు సెక్యూరిటీ చేసే హడావుడి తప్ప జనం సందడి కనిపించడంలేదు. ఇదిలా ఉండగా నాగార్జునసాగర్ లో షర్మీలాను అడ్డుకునే ప్రయత్నం చేశారు తెలంగాణా వాదులు. తెలంగాణా రాష్ట్రం కోసం ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కూడా పరామర్శించాలని డిమాండ్ చేశారు.
మొత్తానికి ఐసియులో ఉన్న వైఎస్ఆర్సీపికి మళ్లీ ప్రాణంపోసే ప్రయత్నాలు చేస్తున్నారు ఆ పార్టీ నాయకత్వం.

రెండు రాష్ట్రాల మధ్య మరో వివాదం

రెండు రాష్ట్రాల మధ్య మరో వివాదం.
నాగార్జునసాగర్ డ్యాం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య మరో వివాదం మొదలైంది. డ్యాం లోని సగం గేట్ల నిర్వహణ తమకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేఖ రాయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నాగార్జునసాగర్ డ్యాం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ డ్యాం ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్ గా మారింది. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల పై వివాదం కొనసాగుతున్న నేపద్యంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. నాగార్జున సాగర్ డ్యాం లోని సగ భాగం తమకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు సరిగ్గా నల్గొండ,గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో నిర్మించారు. డ్యాం లోని సగభాగం నల్గొండ జిల్లాకు భూభాగంలో, సగభాగం గుంటూరు జిల్లా భూభాగంలో ఉంది. అంటే ప్రాజెక్టు గేట్లు మొత్తం 26 ఉంటే...అందులో 13గేట్లు నల్గొండ జిల్లాలో మరో 13 గేట్లు గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నాయి. ఈ నేపధ్యంలో తమ భూభాగంలో ఉన్న 13 గేట్ల నిర్వహణ తమకే అప్పగించాలని మాచర్ల తాసిల్దార్,ఎస్ఐ తో పాటు నీరుపారుదల శాఖ అధికారులు నాగార్జునసాగర్ డ్యాం ఎస్ఈ విజయభాస్కర్ కు లేఖ రాశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసే అవకాశాలుండడం వల్ల మిర్యాలగూడ డిఎస్పీ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ డ్యాం వద్ద బారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
అయితే ఈ విషయాన్ని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ అంశంపై హైదరాబాద్ లో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అధికారులు లేవనెత్తిన ఈ వివాదం పూర్తిగా విభజన చట్టానికి వ్యతిరేకమని తెలంగాణా నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.

Sunday, 4 January 2015

నల్గొండ: ప్రత్యేక ఉపాధ్యాయుల నిమామకంలో గోల్‌మాల్‌

కాంట్రాక్టు పద్ధతిన సాగాల్సిన ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకంలో గోల్‌మాల్‌ జరిగింది. అనర్హులకు అందంలం వేయడమేకాదు...గుట్టుచప్పుడు కాకుండా నియామక ఉత్త ర్వులు విడుదల చేశారు. ఏకంగా పోస్టింగ్‌లకు సంబంధిం చిన కౌన్సెలింగ్‌ నిర్వహించాలని జిల్లాలోని ఆర్‌వీఎం అధికారులకు ఆదేశాలు అందజేశారు. మానసిక, శారీరక వికలాంగులకు బోధించేందుకు ప్రత్యేకంగా కోర్సు ఉంది. దానినే స్పెషల్‌ బీఇడీగా వ్యవహరిస్తారు. రాష్ట్రవిభజనకు ముందు జిల్లాలో ఈ అఽధ్యాపకులకు సంబంధించిన 27 పో స్టులు ఉన్నాయి. ఆనాడే ఈపోస్టులకు దరఖాస్తులు ఆహ్వా నించారు. నోటిఫికేషన్‌ వెలువడటంతో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవిభజన వివాదం మొదలవడంతో నియా మకాల వ్యవహారం పక్కన పడింది. ఈ ఖాళీలో పోస్టుల ఖాళీల సంఖ్య 40కి చేరింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ వెలువరించాల్సి ఉండగా గతంలో దరఖాస్తు చేసుకున్న వారికే పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ పోస్టిం గ్‌ల వ్యవహారంలోనూ ఆర్‌వీఎం ఉన్నతాధికారులు పూర్తిగా తప్పుడు విధానాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ యా విభాగాలకు బోధించేందుకు ప్రత్యేకంగా కోర్సులు ఉన్నా యి. అలాంటిది తాజాగా ఇచ్చిన పోస్టింగ్స్‌లో చూపునకు, వినికి డికి సంబంధించి కోర్సు చేసిన వారికి మానసిక వికలాంగుల ఉపాధ్యాయులుగా పోస్టింగ్స్‌ ఇవ్వడం వివాదానికి దారి తీసింది. జిల్లాలో పోస్టింగ్స్‌ ఇవ్వడంతో ఆయా అభ్యర్థులు ఈనెల 5న జిల్లా కేంద్రంలో జరగనున్న కౌన్సెలింగ్‌కు హాజర వుతున్నారు. ఈ విషయమై జిల్లాకు చెందిన నిరుద్యో గులు స్థానిక ఆర్‌వీఎం అధికారులను విచారించగా ‘రాష్ట్రస్థాయి అధికారులు ఉత్తర్వులు పంపారు. కౌన్సెలింగ్‌ నిర్వహించడం మినహా చేసేది ఏమీ లేదు’ అంటూ చేతులెత్తేయడంతో స్థాని కంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం విషయంలో భారీగా డబ్బులు చేతులు మారినట్టు సమాచారం.
Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks