లింగాలఘణపురం, జనవరి 3: ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తానని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. వరంగల్ జిల్లా లింగాలఘణపురం మండలం వనపర్తిలో రూ.38.78 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించేందుకు కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. అర్హులందరికీ న్యాయం చేయడమే తమ ధ్యేయమని అన్నారు. జిల్లాలో 27,39,609 మందికి ఆరు కిలోల బియ్యం చొప్పున 17,382 మె ట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తోందన్నారు. గతంలో కంటే ఇప్పుడు 89,551 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అదనంగా పంపిణీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.


No comments:
Post a Comment