భయం వద్దు
జాగ్రత్తలు తీసుకుంటే దూరం
స్వైన్ ప్లూపై విస్తృత ప్రచారం
జిల్లాలో పెరుగుతున్న కేసులు
రాష్ర్టాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూపై రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ప్రధానంగా ఎక్కువ కేసులు హైదరాబాద్ జిల్లాలోనే ఉండటంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. జిల్లాలోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. దీనికి తోడు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోనూ ప్రచారం ప్రారంభించారు. బహిరంగ ప్రదేశాల్లోనూ స్వైన్ ప్లూ వైరస్ వ్యాప్తి గుర్తించి ప్ర జల్లో అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్ జిల్లాలో బుధవారం నాటికి 669 కేసులు నమోదు కాగా వీటిలో 107 పాజిటివ్ కేసులుగా గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో సుమారు 60 కేసులు గుర్తించారు. ఇవన్నీ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే కావడం విశేషం. గురువారం నాటికి వీటి సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటికీ రాష్ట్రంలో 20 మంది చనిపోగా హైదరాబాద్ జిల్లాకు చెందిన వారే అత్యథికంగా ఉన్నారు. దీంతో నగర వాసుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. అయితే వైద్య శాఖ అధికారులు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దీన్నినివారించవచ్చని పేర్కొంటున్నారు.
స్వైన్ ప్లూ వ్యాధి- అవగాహన
స్వైన్ ప్లూ వ్యాధి అంటు వ్యాధి. దీన్ని 2009లో అధికారికంగా గుర్తించారు. ఇన్ ప్లూయంజా ‘ఎ’ వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది మనిషికి మనిషికి మధ్య గాలి ద్వారా వ్యాప్తిస్తుంది. ఇది ఊపిరితిత్తుల అంతర భాగములకు సోకి ప్ర మాద కరంగా మారే అవకాశాలున్నాయి. దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా మనిషి నుంచి మనిషికి ఇది వ్యాప్తి చెందుతుంది.
ఇవే స్వైన్ ఫ్లూ లక్షణాలు..
- జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, విరోచనములు తీవ్రంగా ఉంటాయి.
- వాతావరణం చల్లగా ఉన్నపుడు ఈ వ్యాధి సోకడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
-హెచ్ 1, ఎన్ 1 వైరస్‌లో వచ్చే అంత్యంత వేగంగా విస్తరించే అంటు వ్యాధి
నివారణ మార్గాలు- జాగ్రత్తలు...
-చేతులు శుభ్రంగా సబ్బుతో, శుభ్ర మైన నీటితో కడుక్కొవాలి.
-బయటకు వెళ్లినప్పుడు తప్పని సరిగా మాస్కులు ధరించాలి.
-ఎక్కువ నీటిని మరియు ద్రవ పదార్థాలు తీసుకోవాలి.
-అనుమానిత స్వైన్ ప్లూ వ్యాధి గ్రస్తులకు దూరంగా ఉండాలి.
-దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటికి అడ్డుగా రుమాలు గానీ గుడ్డగానీ అడ్డంగా పెట్టుకోవాలి.
- ప్రయాణ సమయాల్లో, రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లలో ఉన్నపుడు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
-వ్యాధి సోకిన వారిని ముట్టుకున్నా, వారు ముట్టుకున్న వస్తువులు తాకినా, దగ్గినపుడు దగ్గరలో ఉన్నా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు ఉన్నాయి.
- సాధ్యమైనంత మేరకు స్నేహితులకు షేక్ హాండ్ ఇవ్వడం, కౌగిలించుకోవడం వంటి వాటికి దూరంగా ఉండాలి.
ప్రజలు అధైర్యపడొద్దుః కె నిర్మల, జిల్లా కలెక్టర్
స్వైన్ ప్లూ పట్ల నగర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. అందుకు తగ్గ జాగ్రత్తలను ప్రజలు తీసుకుంటే సరిపోతుంది. వ్యాధి సోకితే ఐదు నుంచి వారం రోజుల్లో తగు చికిత్సతో వ్యాధి తగ్గిపోతుంది. దీని నివారణ వ్యాక్సిన్లతో పాటు చికిత్సకవరసమై మందులు అన్ని ప్ర భుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాం. వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, అంగన్ వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరం మేరకు చికిత్స పొందాలి.

No comments:
Post a Comment