కొత్త జెసి వచ్చాడు
బాధ్యతలు స్వీకరించిన సురేంద్ర మోహన్
హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా కేటాయించబడిన ఐఎఎస్ అధికారి సురేంద్ర మోహన్ గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇన్ ఛార్జీగా జెసిగా వ్యవహరించిన ఏజెసి సంజీవయ్య ఛార్జీని నూతన జెసికి అప్పగించి, అదనపు బాధ్యతల నుంచి రీలీవ్ అయ్యారు. 2007 ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన సురేంద్ర మోహన్ ప్ర స్తుత నియామానికి ముందు ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టగా పని చేశారు. గతేడాది జూన్,18న జాయింట్ కలెక్టర్ ఇ శ్రీధర్ బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఖాళీగా ఉంది. ఏడు నెలల తర్వాత మళ్లీ పూర్తి స్థాయి జాయింట్ కలెక్టర్ జాల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె నిర్మలను సురేంద్ర మోహన్ మర్యాద పూర్వకంగా కలిసారు.
అధికారులతో జెసీ సమీక్షా
తొలి రోజు జెసిగా బాధ్యతలు స్వీకరించిన సురేంద్ర మోహన్ అధికారులతో వివిధ ప్రభుత్వం పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. భూముల వివరాలను అధికారులను అడిగితెలుసుకున్నారు. కోర్టు కేసులు, పింఛన్లు, మెట్రో రైలు, క్ర మబద్దీకరణ తదితర అంశాలపై సంబంధిత సూపరింటెండెంట్లతో సమీక్షించారు. జిల్లాలోని వివిధ మండలాల్లో కోర్టులో ఉన్నకేసులు, వాటి స్టేటస్, జిల్లా యంత్రాంగం తరపున కౌంటర్లు దాఖలు చేసారా లేదా తదితర అంశాలతో కూడిన నివేదిక ఇవ్వాలని సంబంధిత సూపరింటెండెంట్లను ఆదేశించారు. మండలాల వారిగా పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులు, మంజూరి వివరాలు, పంపిణీ వివరాలు, పెండింగ్ దరఖాస్తుల వివరాలు ఇవ్వాలని కోరారు. వివిధ ప్ర భుత్వ శాఖలకు కేటాయించిన భూముల వివరాలు, వాటిలో ఎన్ని వినియోగించారో.. వినియోగించని శాఖల నుంచి నిబంధనలననుసరించి తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన వెన్ని లాంటి వివరాలతో నివేధిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ల్యాండ్ పార్శిళ్లకు సంబంధించి ఆన్ లైన్ లో పొందుపర్చాల్సిన వివరాలు ఫార్మెట్ పై ఎన్ఐసి అధికారులతో చర్చించారు. జివో నెంబర్ 58,59 దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మెట్రో రైలుకు అవసరమైన స్థల సేకరణకు సంబంధించిన అంశాలను విపులంగా చర్చించేందుకు జిహెచ్‌ఎంసి అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఏజెసికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏజెసి సంజీవయ్య, ఎన్ఐసి అధికారి భద్రయ్య, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

No comments:
Post a Comment