కేన్సర్‌తో బాధపడుతూ మృతి
‘చందమామ’తో కెరీర్‌కు ఊపు
హైదరాబాద్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ‘ఆహుతి’లో హోమ్ మినిస్టర్ శంభుప్రసాద్‌గా గోముఖ వ్యాఘ్రంలాంటి పాత్రలో మెప్పించి.. ‘చందమామ’లో దసరా బుల్లోడు రామలింగేశ్వరరావుగా గోదావరి జిల్లా యాసతో మురిపించి.. విశిష్ట వాచకంతో విలక్షణ అభినయంతో.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ‘ఆహుతి’ ప్రసాద్‌గా చెరిగిపోని ముద్రవేసిన అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్ (57) ఇకలేరు. పెద్దపేగు కేన్సర్‌తో కొద్దికాలంగా బాధపడుతున్న ఆయన.. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శుక్రవారమే (జనవరి 2) ఆయన జన్మదినం కావడం గమనార్హం. ఆయనకు
భార్య విజయనిర్మల, ఇద్దరు కుమారులు భరణి, కార్తీక్ ఉన్నారు. ప్రసాద్ అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి.
చిన్నప్పటి నుంచే..
‘ఆహుతి’ ప్రసాద్ 1958 జనవరి 2న కృష్ణాజిల్లా కోడూరు గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు నటనపై ఆసక్తి ఉండేది. నాగార్జునసాగర్‌లో హైస్కూల్‌లో చదివేటప్పుడే ‘అభినయం’ అనే నాటకంలో నటనకుగాను ఉత్త మ నటుడు అవార్డు పొందారు. ఎప్పటికైనా సినిమా యాక్టర్ కావాలనే లక్ష్యంతో ఉండేవారు. డిగ్రీ మధ్యలో ఆపేసి సినిమాల్లో చేరతానని ఆయన అనడంతో.. పెళ్లి చేస్తే కుదురుగా ఉంటారనే ఉద్దేశంతో పెద్దలు ఆయనకు పెళ్లి చేశారు. ఆ తర్వాత ఆయన.. 1983లో హైదరాబాద్‌లో విక్టరీ మధుసూదన్‌రావు నెలకొల్పిన ‘మధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్’లో చేరారు. ఆ ఇన్‌స్టిట్యూట్ మొదటి బ్యాచ్ విద్యార్థి ఆయన. నటుడుగా ఆయన కెమెరా ముందుకు వచ్చిన తొలి చిత్రం.. ప్రతాప్ ఆర్ట్స్ అధినేత కె.రాఘవ నిర్మించిన ‘ఈ ప్రశ్నకు బదులేది’. అయితే, విడుదలైన మొదటి చిత్రం.. వి.మధుసూదనరావు దర్శకత్వం వహించిన ‘విక్రమ్(హీరోగా నాగార్జున తొలి చిత్రం)’. ‘ఈ ప్రశ్నకు బదులేది’ సినిమాలో ప్రసాద్ నటనను చూసిన శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, ఓ మలయాళ హిట్‌కు రీమేక్‌గా తాము తీస్తున్న ‘ఆహుతి’లో ప్రధాన పాత్రకు తీసుకున్నారు. ఆ సిని మా విజయం సాధించింది. దీంతో ఆయన ‘ఆహుతి’ ప్రసా ద్‌గా పాపులర్ అయిపోయారు. తర్వాత నిర్మాతగా మారి, స్నేహితులతో కలిసి 3 కన్నడ సినిమాలు తీశారు. మూడో సినిమాతో చేతులు కాలాయి. మరోవైపు నటుడిగా చెప్పుకోదగ్గ అవకాశాలు లేకుండా పోయాయి. ఆ టైమ్‌లో దర్శకుడు కృష్ణవంశీ ఆపద్బాంధవుడిలా ఆయనను ఆదుకున్నారు. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో హీరోయిన్ టబు తండ్రి ప్రసాద్ పాత్రను ఆయనతో చేయించడంతో పరిశ్రమలో ఆయన రెండో ఇన్నింగ్స్ మొదలైంది. అప్పట్నించీ ఆయన ఖాళీగా లేరు. ఈ ఊపులోనే ‘చందమామ’లో రామలింగేశ్వరరావు పాత్రలో గోదావరి యాసతో చెలరేగిపోయారు ప్రసాద్. మొత్తమ్మీద.. 27 ఏళ్ల కెరీర్‌లో 250కి పైగా చిత్రాల్లో నటించారు. ఆహుతి ప్రసాద్ మృతి పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. విభిన్న పాత్రలతో ప్రేక్షకుల హృదయాల మీద చెరగని ముద్ర వేసిన నటుడు ప్రసాద్ అని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. సినీ కళాకారుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారంటూ నివాళులు అర్పించారు. ప్రసాద్ మృతిపై తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు.

No comments:
Post a Comment