కాంట్రాక్టు పద్ధతిన సాగాల్సిన ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకంలో గోల్‌మాల్ జరిగింది. అనర్హులకు అందంలం వేయడమేకాదు...గుట్టుచప్పుడు కాకుండా నియామక ఉత్త ర్వులు విడుదల చేశారు. ఏకంగా పోస్టింగ్‌లకు సంబంధిం చిన కౌన్సెలింగ్ నిర్వహించాలని జిల్లాలోని ఆర్‌వీఎం అధికారులకు ఆదేశాలు అందజేశారు. మానసిక, శారీరక వికలాంగులకు బోధించేందుకు ప్రత్యేకంగా కోర్సు ఉంది. దానినే స్పెషల్ బీఇడీగా వ్యవహరిస్తారు. రాష్ట్రవిభజనకు ముందు జిల్లాలో ఈ అఽధ్యాపకులకు సంబంధించిన 27 పో స్టులు ఉన్నాయి. ఆనాడే ఈపోస్టులకు దరఖాస్తులు ఆహ్వా నించారు. నోటిఫికేషన్ వెలువడటంతో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవిభజన వివాదం మొదలవడంతో నియా మకాల వ్యవహారం పక్కన పడింది. ఈ ఖాళీలో పోస్టుల ఖాళీల సంఖ్య 40కి చేరింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రత్యేకంగా నోటిఫికేషన్ వెలువరించాల్సి ఉండగా గతంలో దరఖాస్తు చేసుకున్న వారికే పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ పోస్టిం గ్‌ల వ్యవహారంలోనూ ఆర్‌వీఎం ఉన్నతాధికారులు పూర్తిగా తప్పుడు విధానాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ యా విభాగాలకు బోధించేందుకు ప్రత్యేకంగా కోర్సులు ఉన్నా యి. అలాంటిది తాజాగా ఇచ్చిన పోస్టింగ్స్‌లో చూపునకు, వినికి డికి సంబంధించి కోర్సు చేసిన వారికి మానసిక వికలాంగుల ఉపాధ్యాయులుగా పోస్టింగ్స్ ఇవ్వడం వివాదానికి దారి తీసింది. జిల్లాలో పోస్టింగ్స్ ఇవ్వడంతో ఆయా అభ్యర్థులు ఈనెల 5న జిల్లా కేంద్రంలో జరగనున్న కౌన్సెలింగ్‌కు హాజర వుతున్నారు. ఈ విషయమై జిల్లాకు చెందిన నిరుద్యో గులు స్థానిక ఆర్‌వీఎం అధికారులను విచారించగా ‘రాష్ట్రస్థాయి అధికారులు ఉత్తర్వులు పంపారు. కౌన్సెలింగ్ నిర్వహించడం మినహా చేసేది ఏమీ లేదు’ అంటూ చేతులెత్తేయడంతో స్థాని కంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం విషయంలో భారీగా డబ్బులు చేతులు మారినట్టు సమాచారం.


No comments:
Post a Comment