Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad
Showing posts with label Medak. Show all posts
Showing posts with label Medak. Show all posts

Wednesday, 3 June 2015

సిఎంకు దన్యవాదములు

సిఎంకు దన్యవాదములు
  తెలంగాణ రాష్ట్ర తొలివార్షిక దినోత్సవంను పురష్కరించుకొని రాష్ట్ర ఆవిర్బావ వేడుకసభలో మన రాష్ట్ర పితామహుడు, టిజీ ఆది నాయకుడు తెలంగాణ ముద్దుబిడ్డ గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌ గారు నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ కేసీఆర్‌గారు నిరుద్యోగులకు తీపి బురు అందజేశారు. తెలంగాణ తొలి వసంతం రోజున వచ్చే నెల జూలై నెలలో వివిధ శాఖలో 25వేలు ఉద్యోగులు భర్తీ చేస్తున్నట్లు సిఎం గారు ప్రకటించడంద్వారా సర్వత్వ తెలంగాణ హర్షం వ్యక్తం చేసింది. నిరుద్యోగులు సిఎం సార్‌కి ప్రత్యేక దన్యవాదలు తెలిపారు. మండల కేంద్రమైన కంగ్టి మరియు మారుమూల గ్రామల్లో నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నరు. నిరుద్యోగులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంను ఎంతో కష్టపడి,ఆత్మబలిదానలు ద్వారానే విద్యార్థుల త్యాగ ఫలితం ద్వారానే తెలంగాణను సాదించుకున్నాము. నిరుద్యోగులందరు కష్టపడి ఉద్యోగం సాదించి,తెలంగాణ పునర్నిర్మాణన్నికి అందరు పాల్గోనాలనీవారు పిలుపునిచ్చారు. ఈ సభలో టీఆర్‌యస్‌ నాయకులు పిలుపునిచ్చారు. ఈసభలో టీఆర్‌యస్‌ నాయకులు దేవప్ప, మారుతి,పరమేశ్వర్‌,శ్రీకాంత్‌, గంగాదార్‌, దిగంబర్‌ టీఆర్‌యస్‌ యూత్‌ ప్రెసిడెంట్‌ హుల్లప్ప యాదవ్‌ గారు మరియు పార్టీ పెద్దలు ఈకార్యక్రమంలో పాల్గోన్నారు. 

సంగారెడ్డి : జిల్లాలో మొత్తం 880 మంది స్థానిక ప్రజాప్రతినిదులు ఓటర్లుగా ఉన్నారు

జిల్లాలో మొత్తం 880 మంది స్థానిక ప్రజాప్రతినిదులు ఓటర్లుగా ఉన్నారు
-జిల్లా రెవెన్యూ అధికారి యస్‌ దయానంద్‌
సంగారెడ్డి   : జిల్లాలో మొత్తం 880 మంది స్థానిక ప్రజాప్రతినిదులు ఓటర్లుగా ఉన్నారని వీరందరి ఫోటోలు ఆధార్‌ నెంబరును సేకరించి ఆప్‌లోడ్‌ చేసి అనుసంధానం చేయడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి యస్‌ దయానంద్‌ పేర్కోన్నారు. బుదవారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధలు ఓటర్ల జాబితాను మే 18న ప్రదర్శించడం జరిగిందని, దీనిపై ఏవైన అభ్యంతరాలుంటే తెలుపాలని విన్నవించినప్పటికి, ఏలాంటి అభ్యంతరాలు రాలేవని ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఇందుకు సంబంధించి తుది జాబితాలను ఈ నెల 6న ప్రదర్శించటం జరుగుతుందన్నారు. సంగారెడ్డి డివిజన్‌లో 346,మెదక్‌ డివిజన్‌లో 324,సిద్దిపేట డివిజన్‌లో 210 మంది ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారన్నారు. ప్రజాప్రతినిదుల నియోజక వర్గానానిక సంబంధించి జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్‌ల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలను ప్రతిపాదిస్తూ రెవెన్యూ డివిజనల్‌ అధికారులు నివేధికలు సమర్పించారని అట్టి ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి సమర్పించామని ఆయన వివరించారు. సంగారెడ్డి డివిజన్‌ పరిధిలో సంగారెడ్డిలోని ఎన్‌.జి.ఓ భవన్‌ మెదక్‌ డివిజన్‌లో మెదక్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల, సిద్దిపేట, డివిజన్‌లో ప్రభుత్వ డీగ్రీ కళాశాల సిద్దిపేట, పోలీంగు కేంద్రాలుగా ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందని తెలిపారు.ఈ పోలీంగ్‌ కేంద్రాలపై కూడా ఏవైన అభ్యంతరాలుంటే తెలుపాలని ఆయన వివిధ పార్టీల ప్రతినిధులకు కోరగా, ఏలాంటి అభ్యంతరాలు లేవని ఆయా పార్టీల ప్రతినిధులు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్తు సి.ఈ.ఓ మధు, మున్సిపల్‌, కమీషనర్లు, వివిధ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

సంగారెడ్డి :హరీష్‌రావు జన్మదిన సందర్బంగా రక్తదానం

హరీష్‌రావు జన్మదిన సందర్బంగా రక్తదానం
సంగారెడ్డి :తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు హరీష్‌రావు జన్మదిన సందర్బంగా టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు రాజేందర్‌ నాయక్‌ ఆధ్వర్యంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి నందు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరగింది. ఈ సందర్బంగా రాజేందర్‌ నాయక్‌ మాట్లాడుతూ ఆపర భగీరథుడు ప్రజానాయకుడు,పేదల పెన్నిది ఆయన హారీష్‌రావు జన్మదినం సందర్బంగా రక్తదానం చేయడం అదృష్టకరమని ఇంకా ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకొని పేద ప్రజలకు సేవచేసే భాగ్యం హరీష్‌న్నకు కల్గించాలని, నిందు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండేల దేవుడు ఆశీర్వధించాలని కోరుకుంటున్నామని తెలిపారు. రక్త దాన కార్యక్రమంలో 20 మంది వరకు పాల్గొన్నారని రక్తదాతలు, సంతోష్‌యాదవ్‌, శ్రావణ్‌రెడ్డి, అన్వేష్‌, చరణ్‌, వినోద్‌, రాము తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డి : రాష్ట్ర పురస్కారాన్ని అందుకున్న సంగమేశ్వర్‌ గౌడ్‌

 రాష్ట్ర పురస్కారాన్ని అందుకున్న సంగమేశ్వర్‌ గౌడ్‌
కర్తవ్యానికి పురస్కారం
సంగారెడ్డి : ఒక మద్య తరగతి కుటుంబానికి చెందిన పుర్ర సంగమేశ్వర్‌ గౌడ్‌ తన స్వంత గ్రామం రేగోడ్‌ నుండి 1982లో కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికై మెదక్‌ జిల్లాలో విధులను నిర్వహించి మంచి పేరును సంపాదించారు. తదుపరి హెడ్‌ కానిస్టేబుల్‌గా ప్రమోషన్‌ పొంది అంచెలు,అంచెలుగా ఏదిగి కార్యనిర్వహణలో తనకంటు శైలని రూపొందించుకొని మంచి పేరును ప్రాఖ్యాతులు సంపాందించుకొని హైదరాబాద్‌లో విజిలెన్స్‌ శాఖలో ఎసై వరకు ఎదిగారు.అతను అందించిన సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్రప్రభుత్వం రాష్ట్రస్థాయిలో సేవా పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం దినోత్సవం సందర్బంగా సేవా పథకాన్ని అందించింది. రేగోడ్‌లో ఈ విషయం తెలుసుకొని బందు మిత్రులు కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా మిత్రులైన రిటైర్డు టీచర్‌ కే.సత్యనారాయణ గౌడ్‌, మాట్లడుతూ రేగోడ్‌ వాసి రాష్ట్రా పురస్కారం అందుకోనడం చాల సంతోకరమైన విషయమని తెలిపారు. మద్య తరగతి కుటుంబంలో పుట్టి విజిలెన్స్‌ డిపార్టుమెంట్‌లో ప్రస్తుతం ఎసైగా పనిచేస్తున్న సంగమేశ్వర్‌గౌడ్‌ నేటి యువతరానికి ఆదర్శమని కొనియాడారు. మరిన్ని విజయాలను సంపాదించాలని వారు ఆక్షాంక్షించారు.ఈ కార్యక్రమంలో గౌడ్‌ సంఘం సభ్యులు, సుబాష్‌గౌడ్‌, శంకర్‌ గౌడ్‌, రాజ్‌గౌడ్‌, ఈశ్వర్‌గౌడ్‌, తుల్జరాం గౌడ్‌ దశరత్‌గౌడ్‌, అంజిగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 20 May 2015

సంగారెడ్డి : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం -డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
-డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి
సంగారెడ్డి : మెదక్‌ మార్కెట్‌ కమిటీని తెలంగాణ రాష్ట్ర ఉపసభాపతి పద్మాదేవేందర్‌ రెడ్డి బుధవారం నాడు పరిశీలించారు. నూతనంగా గోదాముల నిర్మాణానికి, దుకాణాసముదాయాలకు నిధులు మంజూరు కావడంతో వాటి నిర్మాణం కోసం మార్కెట్‌ కమిటీ ఆవరణ మొత్తం కాలినడకన పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రైతులకు అన్ని హంగులతో మార్కెట్‌ కమిటీని అభివృద్ది పరుస్తామని తెలిపారు. ఎరువులు, విత్తన విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు వద్ద వరి ధాన్యం కోనుగోలు చేసిన అనంతరం వెనువెంటనే రైతుకు డబ్బులు అందేవిధంగా ఆర్‌డిఓ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెరాసా రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌ రెడ్డి ఆర్‌డిఓ మంచునాగేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వేంకటేశం గుప్త తదితరులు పాల్గొన్నారు. 

సంగారెడ్డి : భక్తులకు సౌకర్యాలు కల్పించాలి -డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి





 భక్తులకు సౌకర్యాలు కల్పించాలి -డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి
-రూ.12 లక్షలతో నిర్మిచనున్న పలు పనులకు శంకుస్థాపన

సంగారెడ్డి : ఏడుపాయల వనదుర్గభవాని మాత ఆలయ ప్రాశస్త్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా చాటేందకు వీలుగా అభవృద్ది పనులు చపట్టాలని అసెంబ్లి డీప్యూటీ స్పీకర్‌ ఎం పద్మాదేవేందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏడు పాయల ఆలయ అభివృద్ది పై బుదవారం ఆలయ ప్రాంగణంలో ఆమె సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చారిత్రాక పరంగా పర్యాటక పరంగా ఎంతో ముఖ్యమైన వనదేవత ఆలయాన్ని ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకు తగిన వసతులు కల్పించాలని అన్నారు. ఆలయ సమగ్ర అభివృద్దికి శ్రీకారం చుట్టడం జరిగిందని, అందులో భాగంగా ఇటీవల హైదరాబాద్‌లో సంబంధఙత ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించామని చెప్పారు. ఆ సమావేశం కొనసాగింపుగా బుధవారం పనులు చేపట్టే విషయమై ఆలయ సందర్శనలో పాటు సమీక్ష నిర్వహింస్తున్నామన్నారు. వివిధ శాఖల సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ది పనులు చేపట్టాలని, ఏడుపాయలలో నూతన యాగశాల నిర్మాణం పాఠశాల, అన్నదాన సత్రం, మూడు ధర్మశాలలు, స్నానఘటాలు, మరుగుదొడ్లు, నిర్మాణం కేశఖండన కోరకు ఏర్పాట్లు క్యూ కాంప్లెక్స్‌ నిర్మాణం వంటి పనులు అభివృద్ది పనులలో ఉన్నాయని తెలిపారు. సత్వరమే అంచనాలు, ప్రతిపాదనలు సిద్దం చేయాలని ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా భక్తులు తొందరగా దర్శనం చేసుకోనేలా అమ్మవారు భక్తులకు స్పష్టంగా అగుపించేలా చర్యలు తీసుకోవాలని, సాంస్కృతిక కార్యక్రమాలు కళాప్రదర్శనలు నిర్వహించేందుకు కళామండపం నిర్మంచాలని సూచించారు. అంతకుముందు డిప్యూటీ స్పీకర్‌ ఆలయసమీపంలో 12 లక్షలతో నిర్మంచనున్న మురుగుకాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నాగసానిపల్లిలో 1924లో నిర్మాణమైన నీటిపారుదల శాఖ అతిథిగృహం ప్రస్తుతం వినియోగంలో లేదని దానిని వినియోగంలోకి తేవాలని సంబంధిత ఇ.ఇ.కి ఆమె సూచించారు. నాగసాని పల్లె లోని ఈ అతిథిగృహాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం ఐ.కె.పి. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును ఆమె మహిళలను అడిగి తెలుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్‌,డి.ఏ. ప్రాజెక్టు డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి, ఆర్డీఓ ఎం.నగేశ్‌, డి.ఎప్‌ ఓ శివానిడొంగే, ఇబిఇ.ఇ. ఏశయ్య, ఆలయ ఇ.ఉ వెంటేట క్రిష్టరావు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Sunday, 17 May 2015

అందరి సహాకారంతోనే తెలంగాణ రాష్ట్రం : భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు






అందరి సహాకారంతోనే తెలంగాణ రాష్ట్రం : భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు

మెదక్‌ : ఆడపిల్లలను భారంగా భావించే ఈ రోజుల్లో వారి తల్లిదండ్రులను ఆదుకునేందుకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వము కాల్యాణలక్ష్మి, షాధీముబారక్‌ లాంటి క్రొత్త పథకాల శ్రీకారం చుట్టిందని భారీనీటిపారుదల శాఖ మంత్రి తన్నీర్‌ హరీష్‌రావు వివరించారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి జిల్లాలో వివాహాలు జరుపుకుంటున్న పేద ఎస్సీ,ఎస్టీ మైనారిటీ వర్గాల 312 ఆడపిల్లలకు ఒక్కోక్కరికి 51వేల రూపాయల చొప్పున మంజూరి పత్రాలను అందచేశారు. మంజూరైన వారిలో 103 మంది ఫె.కులాల వారు, 90 మంది గిరిజలను, 119 మంది గిరిజలనులు, 119 మంది మైనారిటీ వధువులు ఉన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఏప్రిల్‌, మే మాసాలలో ఇప్పటివరకు 1931 దరఖాస్తులు అందాయిన, అందులో 1281 దరఖాస్తులు మంజూరి చేయడం జరిగిందని, మిగితా దరఖాస్తులను కూడా త్వరలోనే పరిశీలించి ఆర్హులకు మంజూరి చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకాల అమలులో రాష్ట్రంలో మెదక్‌ జిల్లా అగ్రస్థానలంలో ఉందన్నారు. ఈ సందర్బంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పథకాల గురించి తమ తొటివారికి పరిసరాల వారిని కూడా వివరించి వారంతా ఈ పథకాల ద్వారా లభ్దిపొందేందుకు తమ బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఈ పథకాల మంజూరికి ప్రక్రియను చాలా సులభతరం చేశామని ఇక నుంచి మైనర్టీల దరఖాస్తుల శీఘ్ర పరిశీలన మంజూరి బాధ్యతను కూడా తహీసీల్దార్లకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయంచేసిందన్నారు. రైతుకూలీలను రైతులుగా మార్చాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం నిరుపేద దళితులకు మూడెకరాల భూపంపిణీ కార్యక్రమము చేపట్టడం జరిగిందని ఇందులో భాగంగానే జిల్లాలో ఇప్పటి వరకు 30 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 659 ఎకరాల సాగుకు యోగ్యమైన భూమిని పంపిణీ చేయడం జరిగిందన్నారు. మొదటి సంవత్సరం పంట పండించేందుకు వీలుగా ఇన్‌పుట్‌ సబ్సిడీని అందించేందుకు వెంటనే ప్రతిపాధనలను ప్రభుత్వానికి పంపాలని ఈ సందర్బంగా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సాధనలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మరో ముగ్గురు ఇషాన్‌రెడ్డి, ఆకుల సాయికుమార్‌, చల్లబక్కారెడ్డి కుటుంబాలకు పది లక్షల చొప్పున చెక్కులను అందచేశారు. గతంలో 52 మంది ఆమరుల కుటుంబాలకు పదిలక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించామని ఇంకా పెండింగులో ఉన్న 15 దరఖాస్తులను పరిశీలించి వారిలో ఆర్హులకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. అమరుల కుటుంబాలలో ఒక్కోకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తామన్నారు. జిల్లాలోని నంగునూరులో చర్చి నిర్మాణానికి 5.89 లక్షల రూపాయలు, చిన్నకోడూరు మండలం మాచాపూర్‌ చర్చికి 2.00 లక్షల గ్రాంట్‌ ఇన్‌ ఏయిడ్‌ చెక్కులను కూడా సంబంధిత పాస్టర్లకు మంత్రి అందచేశారు.అందరి సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని శాసనసభ ఉప సభపతి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారాలు చూపలేదని నూతన ప్రభుత్వం చిత్తశుద్దితో శాశ్వత పరిష్కారాల కొరకు పెద్ద ఎత్తున పథకాలను రూపొందించి అమలుచేస్తుందన్నారు. ఈ క్రమంలోనే ఆసరా పించన్లు దళితులకు భూపంఫిణి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు. ప్రతి ఇంటికి స్వచ్చమైన త్రాగు నీరు అందించేందుకు వాటర్‌ గ్రిడ్‌ పథకాన్ని బహుళ ప్రయోజనమున్న మిషన్‌ కాకతీయలాంటి బృహత్తరమైన కర్యాక్రమాలను చేపట్టి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన ఆర్‌టీసీ కార్మికలుకు కూడా 44 శాతం ఫిట్‌మెంటును ముఖ్యమంత్రి మంజూరి చేయడం జరిగిందన్నారు. పథకాల మంజూరి లో కుటుంబంలో మహిళలకే ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. స్థానిక శాసనసభ్యులు చింతాప్రభాకర్‌ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ణ్రంలో అమలుచేయని విధంగా మన రాష్ట్రం పేద దళిత, గిరిజన మైనరిటీల కుటుంబాలను ఆదుకునేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా ఆడపిల్లల వివాహాలకు 51 వేల రూపాయాల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్‌ శాసనసభ్యులు మదన్‌రెడ్డి జాయింట్‌ కలెక్టర్‌ వెంకటరామిరెడ్డి, డిఆర్‌ఓ దయానంద్‌, ఎస్సీ అభివృద్ది శాఖ డిడి శ్రీనివాసరెడ్డి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Sunday, 4 January 2015

మెదక్‌: ప్రజాహితమే ప్రభుత్వ అభిమతం

బడుగులకు సంక్షేమ పథకాలు వరం
పేదల కడుపు నింపేందుకే ‘ఆహార భద్రత’ పథకం
మెదక్‌ ఎంపీ కేపీఆర్‌ 

దౌల్తాబాద్‌: పేదల సంక్షేమమే ప్రభుత్వ అభిమతమని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం దౌల్తాబాద్‌ మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నారన్నారు. ప్రతి పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టేందుకే ఆరు కిలోల బియ్యం అందిస్తున్నారని అన్నారు. అర్హులైన పేదలందరికీ ఆహార భద్రతా కార్ఢులు, పింఛన్లు అందిస్తున్నారని అన్నారు. అలాగే హైదరాబాద్‌లో సిగ్నల్స్‌ లేని నగరంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులను తీసుకువచ్చి గ్రామాలాభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. కాగా దౌల్తాబాద్‌ గ్రామాభివృద్ధి కి నిధులు మంజూరు చేయాలని ఎంపీపీ వినతీపత్రం అందించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్‌గౌడ్‌, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు యాదవరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదివేణుగోపాల్‌, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ యాదవరెడ్డి, నాయకులు భూపాల్‌రెడ్డి, రామస్వామిగౌడ్‌, రాజిరెడ్డి, శ్రీనివాస్‌, వేమ శ్రీనివాస్‌, ముత్యాలు గౌడ్‌ పాల్గొన్నారు.

Saturday, 3 January 2015

మెదక్‌ : మెదక్‌, దుబ్బాకల్లో నేడు ముత్యాల ముగ్గుల పోటీ

 ఉదయం 11 గంటలకు ప్రారంభం
 కార్యక్రమానికి ప్రముఖుల హాజరు
 మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బహుమతులను గెలుచుకోవాలి
 నిర్వాహకులు శ్రీ సరస్వతీ హైస్కూల్‌,
యూనివర్సల్‌ జిమ్‌
మెదక్‌/ అర్బన్‌/ దుబ్బాక: ‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’, సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీ పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యా సంస్థలు, బెంగళూరు ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు మెదక్‌ పట్టణంలోని శ్రీసరస్వతీ కాన్వెంట్‌ హైస్కూల్‌, అజంపుర, దుబ్బాకలు వేదికయ్యాయి. ఆదివారం ఉదయం 11 గంట లకు ముగ్గుల పోటీలను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మెదక్‌లో ఈ పోటీలను శ్రీ సరస్వతీ కాన్వెంట్‌ హైస్కూల్‌, దుబ్బాకలో యూనివర్శల్‌ జిమ్‌ సౌజన్యంతో నిర్వహిస్తున్నారు. పాల్గొనదలచిన మహిళలు ముగ్గు, రంగులు, వగైరా సామగ్రిని వారే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. పోటీల్లో పాల్గొనే మహి ళలు రిజిసే్ట్రషన్‌ కౌంటర్‌లో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి. ప్రారంభమైన 2 గంటల వ్యవధిలోనే ముగ్గును పూర్తి చేయాల్సి ఉంటుంది. విజేతల ఎంపికలో జడ్జి లదే తుది నిర్ణయం. విజేతలకు మొదటి బహుమతిగా 5వేల రూపాయాలు, రెండో బహుమతి రూ.3 వేలు, మూడో బహుమతి రూ.2వేలను అందజేస్తారు. ఔత్సాహిక మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొని బహుమతులను అందుకోవాలని నిర్వాహకులు పేర్కొన్నారు. మెదక్‌లో నిర్వహించే కార్యక్రమానికి ఆర్డీవో మెంచు నగేశ్‌గౌడ్‌, తహసీల్దార్‌ విజయలక్ష్మి, ఎంఈవో నరేష్‌లు ముఖ్య అతిథులుగా, దుబ్బాకలో నిర్వహించే కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, ఎంపీపీ ర్యాకం పద్మ, జడ్పీటీసీ గౌతమి, పీఏసీఎస్‌ చైర్మన్‌ అమ్మన రవీందర్‌రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks