--అక్రమాలు నిజమే
--విచారణలో నిగ్గుతేలిన నిజాలు
హన్మకొండ, హన్మకొండ మండలం భట్టుపల్లి గ్రామంలోని మాజీ సైనికుల సహకార గృహ నిర్మాణ సంఘం ఇళ్ల స్థల ప్లాట్ల కేటాయింపులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగింది వాస్తమేనని విచారణలో స్పష్టంగా తేలిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా పుట్టుకొచ్చిన ముగ్గురు సభ్యుల కమిటీ ఏ అధికారాలు లేకున్నా ఒక అధికారిణి అండదండలతో ఇళ్ల స్థలాలను ఇష్టారాజ్యంగా సభ్యులు కానివారికీ కేటాయించినట్టు రుజువైంది. ‘ముడుపులు ఇచ్చుకో.. ప్లాట్ పుచ్చుకో..’ చందంగా ఈ త్రిసభ్య కమిటీ సొసైటీలో సభ్యులు కాని వారికి సైతం కేటాయింపుల పేరుతో ప్లాట్లను అంగట్లో సరుకులా అమ్ముకున్నట్టు సాక్ష్యాధారాలతో సహా బట్టబయలైంది. ‘భూం ఫట్’ పేరుతో గత సంవత్సరం జనవరి 24న మాజీ సైనికుల సహకార గృహనిర్మాణ సొసైటీలో జరిగిన అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన పరిశోధనాత్మక కథనం అక్షర సత్యమని నిర్ధారణ అయింది. అయినా ఇప్పటి వరకు అక్రమార్కులపై ఎలాంటి చర్యలు లేవు. సంబంధిత అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. వివరాల్లోకి వెళితే...
1972లో సొసైటీ ఏర్పాటు: మాజీ సైనికుల సహకార గృహనిర్మాణ సంఘం 152మంది సభ్యులతో 1972లో ఏర్పాటైంది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఏడుగురు డైరెక్టర్లతో కూడిన కమిటీ సారథ్యంలో నడుస్తున్న ఈ కమిటీకి 1977-78 సంవత్సరంలో హన్మకొండ మండలం భట్టుపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 208లో 6.20 ఎకరాల స్థలాన్ని ఇళ్ల నిర్మాణం కోసం అప్పటి కలెక్టర్ కేటాయించారు. సొసైటీ ఒక్కొక్కరికి 220 గజాలు వచ్చేలా ఈ స్థలాన్ని 110ప్లాట్లు చేసింది. సభ్యులకు 1980లో కేటాయించింది. ఆదీన పత్రాలను కూడా అందచేసింది. అయితే ఈ ప్లాట్లలో సభ్యులెవరు ఇళ్లు నిర్మించుకోలేదు. ఇదే అక్రమార్కులకు అవకాశంగా మారింది. సొసైటీ అధ్యక్షుడు వయోవృద్ధుడు కావడం, పాలకవర్గం పెద్దగా పట్టించుకోకపోవడం అక్రమార్కులు ఆసరాగా తీసుకున్నారు.
త్రిసభ్య కమిటీ: సొసైటీ స్థలం అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు, స్థలంలో వాటర్ ట్యాంక్, అంతర్గత రోడ్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పన పేరుతో 2003లో అప్పటి జిల్లా సైనిక సంక్షేమ అధికారిణి రమాదేవి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. సమావేశానికి కొద్ది మంది సభ్యులే హాజరైనప్పటికీ కూడా జి.పుల్లయ్య అధ్యక్షుడుగా, రాజమల్లయ్య ఉపాధ్యక్షుడుగా నర్సింహారెడి కార్యదర్శిగా ఈ కమిటీ సొసైటీ వ్యవహారాలను చూసే అధికారాన్ని తనకు తానే దఖలు పరుచుకున్నది.
అక్రమాలు: సొసైటీలోని చాలా మంది సభ్యులకు ఈ కమిటీ గురించిగానీ, సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసినట్టు గానీ తెలియదు. అంతర్గత రోడ్లను నిర్మించే పేరిట ఈ కమిటీ మొత్తం 110 ప్లాట్లను 92కు కుదించింది. ప్లాట్లను రిజిసే్ట్రషన్ చేసేందుకు సభ్యుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ విషయం సొసైటీలోని సభ్యులందరికి తెలియదు. 49 మంది సభ్యులు మాత్రమే దరఖాస్తులు పెట్టుకున్నారు. కమిటీ వారికే ప్లాట్లను కేటాయించింది. మిగతా 41 ప్లాట్లను పెద్దమొత్తంలో డబ్బులు దండుకొని సొసైటీలో సభ్యులు కానీ ఇతర 41 మంది మాజీ సైనికులకు కేటాయించింది. త్రిసభ్య కమిటీ అధ్యక్షుడు పుల్లయ్య ఒక్కరే 4 ప్లాట్లను దక్కించకున్నాడు. సాక్షాత్తు అప్పటి సైనిక సంక్షేమాధికారిణి కూడా నిబంధనలకువిరుద్ధంగా తాను కూడా ఒక ప్లాట్‌ను కైవశం చేసుకున్నది.
విచారణ:
ఈ త్రిసభ్య కమిటీ పాల్పడిన అక్రమాలపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంతో అధికార యంత్రాంగం కదలింది. దీనికితోడు సొసైటీ సభ్యుల్లోని ఒకరి కుమారుడు కూడా జిల్లా సహకారాధికారికి ఫిర్యాదు చేశారు. దీనితో కలెక్టర్ ఆదేశాల మేరకు డీసీవో విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా నియమితులైన జనగామ సబ్‌డివిజనల్ సహాకారాధికారి జి.మురళీ రమణ సొసైటీ అక్రమాలపై విచారణ జరిపారు. నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. సొసైటీ ప్లాట్ల కేటాయింపులో అనేక అక్రమాలు జరిగినట్టు విచారణలో బట్టబయలు అయింది.
నిబంధనలు తుంగలో..:
పాలక వర్గం లేనప్పుడు సహకార సొసైటీకి తాత్కాలిక కమిటీని వేసే అధికారం సహకార రిజిసా్ట్రర్‌కే ఉంటుంది. కానీ ఇక్కడ తనకే అధికారంలేక పోయినప్పటికీ అప్పటి జిల్లా సైనిక సంక్షేమాధికారి కె.రమాదేవి మాత్రం పుల్లయ్య, రాజమల్లయ్య, నర్సింహారెడ్డిలతో కమిటీ వేశారని, నిబంధనల ప్రకారం ఇది చెల్లదు. దీనికి ఎలాంటి అధికారం లేదు. ఈ కమిటీ సభ్యులు కాని 41 మందికి ప్లాట్లను రిజిస్టర్ చేయడంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. ఇందుకు సంబంధించి రికార్డులను కూడా నిర్వహించలేదు. వారి నుంచి బెటర్‌మెంట్, డెవలప్‌మెంట్ చార్జీలను వసూలు చేసిన ఈ కమిటీ సొసైటీలో సభ్యులుగా కూడా చేర్చుకోకుండానే ప్లాట్లను కట్టబెట్టింది.
తిరిగి వసూలు:
సొసైటీ స్థలంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సభ్యుల నుంచి వసూలు చేసిన రూ.18 లక్షలకుపైగా డబ్బు వినియోగంలో కూడా అవకతవకలు జరిగినట్టు విచారణలో బయటపడింది. దీనితో ఈ మొత్తం నుంచి రూ. 18 శాతం వడ్డీతో రూ 1,94,243లను మాజీ సైనికుల సహకార గృహనిర్మాణ సంఘం అధ్యక్షుడు జి.పుల్లయ్య నుంచి తిరిగి వసూలు చేయాలని నివేదికలో సిపార్సు చేశారు. త్రిసభ్య కమిటీ సభ్యులు కాని 41 మందికి రిజిస్టర్ చేసిన ప్లాట్లను రద్దు చేయాలని, సహకార చట్టం ప్రకారం వీరిపై చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఒకటికన్నా ఎక్కువ..:
సహకార చట్టం ప్రకారం సొసైటీలో సభ్యుడు ఒకటి కన్నా ఎక్కువ ప్లాట్లు తీసుకోరాదన్న నిబంధన ఉన్నప్పటికీ త్రిసభ్య కమిటీ దానిని తుంగలో తొక్కింది. కమిటీ అధ్యక్షుడు 4, కార్యదర్శి ఎం.నర్సింహారెడ్డి 3 ప్లాట్లు, కేవీఎస్ ప్రసాద్ 2, బత్తిని శ్రీహరి 2 ప్లాట్లను తీసుకున్నారు. వీటిని రద్దు చేసి ఇతర అర్హులైన సభ్యులకు కేటాయించాలని విచారణ నివేదిక సిఫార్సు చేసింది. నిబంధన ప్రకారం గెజిటెడ్ కేడర్ అధికారులకు ప్లాట్లను కేటాయించకూడదు. ఇందుకు భిన్నంగా అప్పటి సైనిక సంక్షేమాధికారిణి కె.రమాదేవికి ఒక ప్లాట్ (నెం 76), జయరామారెడ్డికి ఒకటి (నెం 51)ను కేటాయించారు. వీటిని కూడా రద్దు చేయాలని సిఫార్సు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఈ జిల్లా సైనిక సంక్షేమాధికారిణిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని, సభ్యులు కాని వారికి రిజిస్టర్ చేసిన ప్లాట్లను రద్దు చేసి వాటిని సొసైటీలో అర్హులైన పాత సభ్యులకు కేటాయించాలని కూడా సిఫార్సు చేసింది.
నాలుగు నెలలైనా..:
సొసైటీలో జరిగిన అక్రమాలపై విచారణ పూర్తయి నాలుగు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు. అనర్హులైన వారికి దొడ్డిదారిన కేటాయించిన ఇళ్ల స్థలాలను రద్దు చేయాలని, వాటిని అర్హులైన సొసైటీని పాత సభ్యులకు తిరిగి కేటాయించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఒకటి కన్నా ఎక్కువ ప్లాట్లను కాజేసిన వారిపై చట్ట రీత్యా చర్య తీసుకోవాలని, అలా పొందిన ప్లాట్లను తిరిగి స్వాధీనం చేసుకోవాలని విచారణ నివేదికలో స్పష్టంగా సిఫార్సు చేసినా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకున్నట్టు లేదు. కలెక్టర్ చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని మాజీ సైనికులు అభ్యర్థిస్తున్నారు.

No comments:
Post a Comment