కొత్త సారథి కోహ్లీకి సవాల్
ఆసే్ట్రలియా గడ్డపై ఆఖరి పోరాటానికి టీమిండియా సిద్ధమైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-0తో కైవసం చేసుకోవాలని అటు కంగారూలు భావిస్తుండగా.. గెలుపుతో సిరీస్‌ను ముగించాలని భారత్ కృత నిశ్చయంతో ఉంది. పూర్తి స్థాయి సారథిగా బాధ్యతలు చేపట్టనున్న విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ సవాల్‌గా నిలవనుంది. అడిలైడ్‌లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా విరాట్ రాణించడం సానుకూలాంశం. ఇక మెల్‌బోర్న్ టెస్ట్‌ను డ్రా చేసుకున్న ఆత్మవిశ్వాసంతో యువ భారత్ బరిలోకి దిగనుంది.
ఉదయం 4.50 నుంచి స్టార్ స్పోర్ట్స్ 1, 3లలో
సిడ్నీ: ఈసారి పర్యటనలో టీమిండియా అంచనాలకు మించి రాణిస్తోంది. దీంతో తొలి రెండు టెస్ట్‌ల్లో గెలుపు కోసం ఆతిథ్య ఆసీస్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అడిలైడ్, బ్రిస్బేన్‌లో కంగారూలకు భారత్ గట్టిపోటీ ఇచ్చింది. మెల్‌బోర్న్‌లోనూ కంగారూలకు పర్యాటక జట్టు దీటుగా జవాబిచ్చింది. ఈ నేపథ్యంలో సిడ్నీ టెస్ట్‌లోనూ గెలుపు కోసం ఇరు జట్లూ తీవ్రంగా పోరాడే అవకాశం ఉంది.
రాహుల్‌కు మరో చాన్స్: సిడ్నీ టెస్ట్‌కు టీమిండియా ఎంపిక మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ఈ సిరీస్‌లో ప్రభావం చూపని ఓపెనర్ శిఖర్ ధవన్‌పై వేటుపడడం ఖాయంగా కన్పిస్తోంది. చివరి 13 ఇన్నింగ్స్‌ల్లో ధవన్ ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే నమోదు చేశాడు. ఇక మెల్‌బోర్న్ టెస్ట్‌లో నిరాశపర్చిన యువ బ్యాట్స్‌మన్ లోకేశ్ రాహుల్‌కు మరో చాన్స్ ఇవ్వనున్నారు. ఒక్క టెస్ట్‌లోనే అతనిపై అంచనాకు రాలేమని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. కాగా మిడిలార్డర్‌లో సురేశ్ రైనా, రోహిత్ శర్మ మధ్య తీవ్ర పోటీనెలకొంది.
రికార్డు పేలవం: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో 36 ఏళ్లుగా టీమిండియా గెలుపు రుచి చూడలేదు. 1978లో భారత్ ఇక్కడ చివరిసారి నెగ్గింది. ఈ వేదికపై భారత్ మొత్తం పది టెస్ట్‌ల్లో ఒకటి నెగ్గి.. ఐదింటిలో ఓడింది. 4 మ్యాచ్‌లు డ్రాగా ముగించింది.
ధవన్ ఫామ్‌పై చర్చ...
ఆసే్ట్రలియా పర్యటనలో తీవ్రంగా విఫలమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ ఫామ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. శిఖర్ విదేశాల్లో ఆడిన పది టెస్ట్‌ల్లో కేవలం 504 రన్సే చేశాడు. సగటు 29 మాత్రమే. ఇక శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేడన్న బలహీనతను మూటగట్టుకున్నాడు. ఈ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అతను 28 సగటుతో 167 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 81. దీంతో చివరి టెస్ట్‌లో ధవన్ స్థానంపై అనుమానాలు నెలకొన్నాయి.
కోహ్లీ దూకుడెంతో చూస్తాం: వార్నర్
ఈ సిరీస్‌లో మెరుగ్గా రాణిస్తున్న కోహ్లీపై కంగారూలు మైండ్ గేమ్ కొనసాగిస్తున్నారు. సిడ్నీ టెస్ట్‌లో రెగ్యులర్ కెప్టెన్‌గా కోహ్లీ బ్యాటింగ్ ఆసక్తి రేపుతోందని డేవిడ్ వార్నర్ తెలిపాడు. ‘కోహ్లీ పోటీ తత్వంగల ఆటగాడు. కెప్టెన్‌గా కోహ్లీ అదే దూకుడు కొనసాగిస్తాడో లేదో చూడాలి. ఇక ఆట గురించి ధోనీ చాలా ఆలోచిస్తాడు. మ హీకి క్రికెట్ పరిజ్ఞానం ఎక్కువ. అతని రిటైర్మెంట్ మాకు దిగ్ర్భాంతి కలిగించింది. ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఎలా రాబట్టుకోవాలో ధోనీకి బాగా తెలుసు. వ్యూహాలను అమలు పర్చడంతో అతను దిట్ట. అందుకే మహీ వెరీ వెరీ స్మార్ట్ కెప్టెన్‌గా పేరుతెచ్చుకున్నాడ’ని వార్నర్ తెలిపాడు
కంగారూలకు గాయాల బెడద..
జాన్సన్ అవుట్
నాలుగో టెస్ట్ రేపటి నుంచిఆసే్ట్రలియా గడ్డపై ఆఖరి పోరాటానికి టీమిండియా సిద్ధమైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-0తో కైవసం చేసుకోవాలని అటు కంగారూలు భావిస్తుండగా.. గెలుపుతో సిరీస్‌ను ముగించాలని భారత్ కృత నిశ్చయంతో ఉంది. పూర్తి స్థాయి సారథిగా బాధ్యతలు చేపట్టనున్న విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ సవాల్‌గా నిలవనుంది. అడిలైడ్‌లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా విరాట్ రాణించడం సానుకూలాంశం. ఇక మెల్‌బోర్న్ టెస్ట్‌ను డ్రా చేసుకున్న ఆత్మవిశ్వాసంతో యువ భారత్ బరిలోకి దిగనుంది.
ఉదయం 4.50 నుంచి స్టార్ స్పోర్ట్స్ 1, 3లలో
సిడ్నీ: ఈసారి పర్యటనలో టీమిండియా అంచనాలకు మించి రాణిస్తోంది. దీంతో తొలి రెండు టెస్ట్‌ల్లో గెలుపు కోసం ఆతిథ్య ఆసీస్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అడిలైడ్, బ్రిస్బేన్‌లో కంగారూలకు భారత్ గట్టిపోటీ ఇచ్చింది. మెల్‌బోర్న్‌లోనూ కంగారూలకు పర్యాటక జట్టు దీటుగా జవాబిచ్చింది. ఈ నేపథ్యంలో సిడ్నీ టెస్ట్‌లోనూ గెలుపు కోసం ఇరు జట్లూ తీవ్రంగా పోరాడే అవకాశం ఉంది.
రాహుల్‌కు మరో చాన్స్: సిడ్నీ టెస్ట్‌కు టీమిండియా ఎంపిక మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ఈ సిరీస్‌లో ప్రభావం చూపని ఓపెనర్ శిఖర్ ధవన్‌పై వేటుపడడం ఖాయంగా కన్పిస్తోంది. చివరి 13 ఇన్నింగ్స్‌ల్లో ధవన్ ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే నమోదు చేశాడు. ఇక మెల్‌బోర్న్ టెస్ట్‌లో నిరాశపర్చిన యువ బ్యాట్స్‌మన్ లోకేశ్ రాహుల్‌కు మరో చాన్స్ ఇవ్వనున్నారు. ఒక్క టెస్ట్‌లోనే అతనిపై అంచనాకు రాలేమని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. కాగా మిడిలార్డర్‌లో సురేశ్ రైనా, రోహిత్ శర్మ మధ్య తీవ్ర పోటీనెలకొంది.
రికార్డు పేలవం: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో 36 ఏళ్లుగా టీమిండియా గెలుపు రుచి చూడలేదు. 1978లో భారత్ ఇక్కడ చివరిసారి నెగ్గింది. ఈ వేదికపై భారత్ మొత్తం పది టెస్ట్‌ల్లో ఒకటి నెగ్గి.. ఐదింటిలో ఓడింది. 4 మ్యాచ్‌లు డ్రాగా ముగించింది.
ధవన్ ఫామ్‌పై చర్చ...
ఆసే్ట్రలియా పర్యటనలో తీవ్రంగా విఫలమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ ఫామ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. శిఖర్ విదేశాల్లో ఆడిన పది టెస్ట్‌ల్లో కేవలం 504 రన్సే చేశాడు. సగటు 29 మాత్రమే. ఇక శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేడన్న బలహీనతను మూటగట్టుకున్నాడు. ఈ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అతను 28 సగటుతో 167 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 81. దీంతో చివరి టెస్ట్‌లో ధవన్ స్థానంపై అనుమానాలు నెలకొన్నాయి.
కోహ్లీ దూకుడెంతో చూస్తాం: వార్నర్
ఈ సిరీస్‌లో మెరుగ్గా రాణిస్తున్న కోహ్లీపై కంగారూలు మైండ్ గేమ్ కొనసాగిస్తున్నారు. సిడ్నీ టెస్ట్‌లో రెగ్యులర్ కెప్టెన్‌గా కోహ్లీ బ్యాటింగ్ ఆసక్తి రేపుతోందని డేవిడ్ వార్నర్ తెలిపాడు. ‘కోహ్లీ పోటీ తత్వంగల ఆటగాడు. కెప్టెన్‌గా కోహ్లీ అదే దూకుడు కొనసాగిస్తాడో లేదో చూడాలి. ఇక ఆట గురించి ధోనీ చాలా ఆలోచిస్తాడు. మ హీకి క్రికెట్ పరిజ్ఞానం ఎక్కువ. అతని రిటైర్మెంట్ మాకు దిగ్ర్భాంతి కలిగించింది. ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఎలా రాబట్టుకోవాలో ధోనీకి బాగా తెలుసు. వ్యూహాలను అమలు పర్చడంతో అతను దిట్ట. అందుకే మహీ వెరీ వెరీ స్మార్ట్ కెప్టెన్‌గా పేరుతెచ్చుకున్నాడ’ని వార్నర్ తెలిపాడు

No comments:
Post a Comment