న్యాయమూర్తులు సూక్ష్మదృష్టితో వ్యవహరించాలి
మెట్రోపాలిటిన్ సెషన్ జడ్జి కమ్ ఛైర్ పర్సన్ రజనీ
న్యాయమూర్తులు సూక్ష్మదృష్టితో కేసులను పరిశీలించి సరైన న్యాయం చేసినప్పుడే ప్రజల్లో వ్యవస్థ పట్ల నమ్మకం సడలిపోదని మెట్రోపాలిటిన్ సెషన్ జడ్జి కమ్ ఛైర్ పర్సన్ రజనీ అభిప్రాయపడ్డారు.మెజిస్ర్టేట్స్, స్పెషల్ మెజిస్ర్టేట్, అడిషనల్ చీఫ్ మెట్రో మెజిస్ట్రేట్ లతో నాంపల్లిలోని మెట్రోపాలిటిన్ క్రిమినల్ కోర్టులో బుధవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే నెల 14న నెగోషబుల్ ఇన్ స్ర్టూమెంట్ ఆక్ట్, రికవరి సూట్స్‌కు సంబంధించిన కేసుల గురించి సమీక్షించనున్నట్లు తెలిపారు. ఈ విషయమై మెజిస్ర్టేట్లు తమ పరిధిలోని కేసులను గుర్తించి క్షుణ్ణంగా పరిశీలించి రాజీ కుదిర్చే దిశగా ప్రయత్నించాలని కోరారు. నెగోషిబుల్ ఇన్ స్ర్టూమెట్ ఆక్ట్ కేసులను దీర్ఘకాలంగా పెండింగ్లో పెట్టకుండా త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఫస్ట్ మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి లక్ష్మిపతి, సెకండ్ మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి ధర్మారావు, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment