స్థల సేకరణ పనులు వేగవంతం
జిల్లా కలెక్టర్ నిర్మల ఆదేశం
మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి స్థల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె నిర్మల సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా పరిధిలోని మెట్రో రైలు ప్రాజెక్టు స్థల సేకరణ పురోగతిపై హెచ్‌ఎంఆర్, ఎల్ అండ్ టి, జిహెచ్ఎంసి తదితర అధికారులతో బుధవారం తన ఛాంబర్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణకు సంబంధించి ఇప్పటికే నోటిఫై చేసిన స్థలాలను ఎల్ అండ్ టి సంస్థకు అప్పగించేందుకుయుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా ఆయా ప్రాపర్టీలకు సంబంధించి అవార్డు జారీ చేసిన తర్వాత ఆ ప్రాపర్టీలను అప్పగించడంలో జాప్యం లేకుండా చూడాలని అన్నారు. అదే సమయంలో సబంధిత వ్యక్తులకు పరిహారం చెల్లించడంలో కూడా జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు.మియాపూర్ నుంచి ఎస్ ఆర్ నగర్ మార్గంలోని ప్రాపర్టీలను, అమీర్ పేట్, ఖైరతాబాద్, లక్డికపూల్,నాంపల్లి, గాంధీభవన్ ప్రాంతాల్లో నోటిఫై చేసిన ప్రాపర్టీలను నిబంధనలనుసరించి వెంటనే అప్పగించాలని సూచించారు. ఈ సమావేశంలో ఇంఛార్జీ జాయింట్ కలెక్టర్ బి సంజీవయ్య, హెచ్‌ఎంఆర్ సంస్థ నుంచి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శంకరాచారీ, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment