యువతులు, మహిళలు తరలొచ్చారు. తమ సృజనకు పదునుపెట్టారు. రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దారు. వాటిల్లో సంప్రదాయన్నేకాదు, సామాజిక స్ఫృహనూ ప్రతిబింబించారు. బహమతులు అందుకొన్నారు. వాటితో మురిసిపోయారు. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు పవర్డ్ బై ఎయిమ్స్ విద్యా సంస్థలు, బెంగళూరు.. ఆదివారం ఖమ్మం, పాల్వంచల్లో ఉత్సాహంగా జరిగాయి. పాల్వంచ పోటీకి అద్భుత స్పందన లభించింది. 140 మంది పోటీపడ్డారు. ఖమ్మంలోని
రిక్కాబజార్ హైస్కూల్ మైదానంలో, పాల్వంచ కేఎస్పీ రోడ్‌లోని అనుబోస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రౌడ్‌లో పోటీలు జరిగాయి. ఉదయం ఎనిమిది గంటలకే కేంద్రాలకు చేరుకున్న మహిళలు అందమైన రంగ వల్లికలను చిత్రించారు. సంక్రాంతి పండుగ ప్రత్యేకతను చాటి చెప్పేలా, చక్కని సందేశాలతో కూడిన ముగ్గులను వేశారు. సప్తవర్ణాలను అద్ది, బోగి మంటలు, గంగిరెద్దులు, గాలి పటాలు, కొత్త కుండలు, తదితర పండుగ అలంకరణలు చేశారు.
ఖమ్మంలో జరిగిన పోటీలకు ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహ్ సతీమణి కవిత, ఖమ్మంలో పోటీకి సహకరించిన ప్రియదర్శిని విద్యాసంస్థల అఽధినేత కాటేపల్లి నవీన్‌బాబు పాల్గొన్నారు.
పాల్వంచలో జరిగిన పోటీలకు కేటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ సిద్దయ్య, సునీత, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సావిత్రి, పాల్వంచలో ముగ్గుల పోటీకి సహకరించిన అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పి. వేణుగోపాల్, కళాశాల యాజమాన్యం తరపున తలచుల వివేక్ పాల్గొన్నారు..
ఖమ్మం విజేతలు వీరే: మొదటి బహుమతి (రూ. 5వేల నగదు)ను ఎ. అనిత రిక్కాబజార్ ఖమ్మం, ద్వితీయ బహుమతి (రూ. 3వేల నగదు) ఎస్.పూర్ణిమ, ప్రకాష్‌నగర్, తృతీయ బహుమతి (రూ. 2వేల నగదు) జి. నవ్య మధిర గెలుపొందారు..
కన్సొలేషన్ బహుమతులు: జి. శిరీష (కారేపల్లి), జి రాజేశ్వరి (మధిర), వి, చంద్రకళ (డాబాలబజార్ ఖమ్మం) పి. నీరజ (ముదిగొండ), ఎం. వీణాబాయి (డోర్నకల్) ఒక్కోరు రూ. 500 గెలుపొందారు. అనితకు మొదటి బహుమతిని జడ్పీ చైర్‌పర్సన్ గడిపెల్లి కవిత అందజేశారు. పూర్ణిమకు ద్వితీయ బహమతిని ప్రియదర్శిని విద్యా సంస్థల అధినేత కాటేపల్లి నవీన్ బాబు ప్రదానం చేశారు. జి. నవ్యకు తృతీయ బహుమతిని జేసీ సతీమణి కవిత అందజేశారు.
పాల్వంచ విజేతలు: మొదటి బహుమతిని సీహెచ్ కృష్ణవేణి (వీఎం బంజర), ద్వితీయ బహమతిని ఎస్. సాయి శ్వేత (కొత్తగూడెం), తృతీయ బహుమతిని వి. దివ్య (కొత్తగూడెం) చేజిక్కించుకొన్నారు.
న్యాయ నిర్ణేతలు: ఖమ్మంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు డాక్టర్ బి. మాధురి (ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్) పి. రమణమ్మ (మహిళా డిగ్రీకళాశాల వైస్ ప్రిన్సిపాల్) టి. రజని (ప్రభుత్వ ఉపాధ్యాయురాలు) న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. పా ల్వంచలో పోటీలకు పి. పద్మజ, టి. శేషశ్రీ, వై. రమణ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఖమ్మంలో జరిగిన కార్యక్రమంలో ‘ఆంధ్రజ్యోతి‘ ఖమ్మం యూనిట్ మేనేజర్ తాళ్లూరి పుల్లారావు, ఎడిషన్ ఇన్‌చార్జ్ వనం కళ్యాణ్, బ్యూరో ఇన్‌చార్జ్ డి. వెంకటరెడ్డి, సర్క్యులేషన్ ఆఫీసర్ కె. సూర్యనారాయణ, యాడ్స్ మేనేజర్ రమేష్ సబ్ ఎడిటర్లు, రిపోర్టర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:
Post a Comment