రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి : మంత్రి పోచారం తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు . సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పంటకు గిట్టుబాటు రాని సమయంలో నిల్వ చే సుకునేందుకు గోదాములు మంజూరు చేశామన్నారు. స్త్రీ ద్వారా డ్వా క్రా సంఘాలకు పాడి పశువులు ఇస్తున్నామని తెలిపారు.
చెరువుల పునరుద్ధరణకు నిధులు..మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా మండలంలో ని 20 చెరువుల పునరుద్ధరణ పనులకు నిధులు మం జూరయ్యాయని మంత్రి తెలిపారు. కాలువ ఆధునీకరణ పథకం ద్వారా మొత్తం సీసీ పనులు చేస్తామన్నారు. మంత్రికి కోటగిరి సర్పంచి హెచ్.స్వరూప కూరగాయ లు, ధాన్యాలతో వినూత్నంగా స్వాగతం పలికారు. బొకే బదులుగా కూరగాయలు ఇచ్చి ప్రత్యేకత చాటుకున్నా రు. కార్యక్రమంలో ఎంపీపీ మోరె సులోచన కిషన్, జ డ్పీటీసీ పుప్పాల శంకర్, గంగాధర్ దేశాయ్, వైస్ ఎంపీ పీ వల్లెపల్లి శ్రీనివాస్‌రావు, టీఆర్‌ఎస్ నియోజకవర్గ సభ్యత్వ ఇన్‌చార్జి అంజిరెడ్డి, స్థానిక సర్పంచులు లక్ష్మీబాయి శివరాజ్‌దేశాయ్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment