రోడ్డున పడ్డ ఉద్యోగుల బతుకులు
నల్గొండ : తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ కార్యాలయాలను ఎత్తివేయడంతో ఆ శాఖలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు . తెలంగాణ రాష్ట్రం వస్తే తమ ఉద్యోగాలకు భరోసా, భద్రత దక్కుతుందని భావించిన దానికి విరుద్ధంగా ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోవడంతో వారి కుటుంబాల పోషణ వారికి భారమైపోయింది.

దాదాపు 9వేలకు పైగా భూసేకరణ పనులు ఆయా కార్యాలయాల్లో సాగుతున్నాయి. అవుట్ సోర్సింగ్ వారిని తొలగించనుండటంతో ఇంతకాలంగా ఆ కార్యాలయాల్లో ఉద్యోగాలతో ఉపాధి పొంది కుటుంబాన్ని పోషించుకున్న సదరు ఉద్యోగులంతా ఆకస్మికంగా ఉద్యోగాలు పోవడంతో కుటుంబ పోషణ భారమై సంక్షోభంలో పడిపోయారు. అదే సమయంలో ఆయా కార్యాలయాల్లో పనిచేసిన రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రం ఇతర ప్రాజెక్టుల్లో పోస్టింగ్ ఇచ్చి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను మాత్రం గాలికి వదిలేసింది. ప్రభుత్వం ఇరిగేషన్, భూసేకరణ కార్యాలయాల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడానికి బదులుగా వారికి ఆ రంగంలో ఉన్న అనుభవం మేరకు జిల్లాలో భారీ ఎత్తున ఇతర సాగునీటి, విద్యుత్ తదితర భూసేకరణ ప్రక్రియ అవసరమైన ప్రాజెక్టుల్లో నియమించాల కోరుకుంటున్నారు .

No comments:
Post a Comment