నాగిరెడ్డిపేట : మైనార్టీ తీరకుండా వివాహాలు చేయడం సరైంది కాదని, చట్టరీత్యా నేరమని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ స్వరూపరాణి అన్నారు. మండలంలోని జలాల్‌పూర్ గ్రామం లో ఇద్దరు బాలికలకు పెళ్లి చే యడానికి ఇరువురు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అం దుకు సంబంధించి పనులు సై తం పూర్తి చేసుకున్నారు. కొన్ని నెలల అనంతరం పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ విషయం జిల్లా ఐసీడీఎస్ అధికారులకు ఓ వ్యక్తి ఫోన్ ద్వారా సమాచారం అందజేశాడు.
దీంతో సూపర్‌వైజర్ స్వరూప శుక్రవారం గ్రామానికి చేరుకున్నారు. ఇరువురు కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. మైనార్టీ తీరనిదే వివాహం చేస్తే చట్టరీత్యా నేరమని, తగిన శిక్ష కూడా తప్పదని హెచ్చరించారు. వారికి వివాహ వయస్సు వచ్చేదాకా ఆగాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు అంగీకరించారు. 18 ఏళ్లు నిండే వరకు పెళ్లి చేయమని తల్లిదండ్రుల నుంచి లిఖిత పూర్వకంగా రాయించుకున్నారు.

No comments:
Post a Comment