-దూసుకుపోతున్న టీఆర్‌ఎస్
-ప్రత్యర్థి పార్టీల్లో వణుకు
-రికార్డు స్థాయిలో సభ్యత్వాలు
-ఊరూరా గుబాళిస్తున్న గులాబీ పార్టీ
-ఆన్‌లైన్‌లో నమోదుకు యువత ఉత్సాహం
యువకులు.. ఇలా సబ్బండ వర్ణాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి భారీగా వలస వస్తున్నారు.టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రక్రియలో ఈ విషయం సుస్పష్టమవుతోంది.
స్థానిక నేతలు. చాలా మంది యువకులు ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదుపై ఆసక్తి కనబర్చుతున్నారు. ఇప్పటికే
ఉత్సాహం చూపుతున్నారు. ఇటీవలే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాయి. అయితే
ఆయా పార్టీల నేతలు కనీస సభ్యత్వం చేయడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. అయినప్పటికీ టీడీపీలో చేరేందుకు ప్రజలు విముఖతనే వ్యక్తం చేశారు. పాత క్యాడర్ కూడా సభ్యత్వ నమోదుకు దూరంగా ఉండిపోయింది. పరువును కాపాడుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అనుకున్న స్థాయిలో సభ్యత్వ నమోదును చేయలేకపోయారు. దేశం సభ్యత్వ నమోదు మాత్రం కోపతాపాలతో మొదలై జిల్లా కేంద్రంలో కొట్లాటతో ముగిసింది.
పార్టీల సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి విముఖత వ్యక్తమైతే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం
చేస్తున్నారు. ప్రధానంగా యువత ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా సభ్యత్వ నమోదును చేసుకోవడానికి
సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు ఆన్‌లైన్ ద్వారా తమ సభ్యత్వాన్ని చేపట్టారు. రికార్డు స్థాయిలో సభ్యత్వ
నమోదు జరుగుతోంది. దీంతో ప్రతిపక్ష పార్టీల్లో వణుకు మొదలైంది. ఇప్పటికే వరుస వలసలతో
కోలుకోలేకపోతున్న కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వ నమోదు మరో దెబ్బను మిగిల్చింది. టీడీపీ దాదాపుగా జిల్లాలో ఖాళీ
అయింది. నేతలకు క్యాడర్ కరువైంది.
ఉన్న నేతలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. తమ సభ్యత్వ నమోదుకు స్పందన
కరువుకాగా, టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వానికి వస్తున్న స్పందనతో కాంగ్రెస్, టీడీపీల్లో కలవరం మొదలైంది. శత
విధాల ప్రయత్నం చేసినా టీఆర్‌ఎస్‌లోకి వలసలను ఆపడంలో ఆయా పార్టీల నేతలకు సంకట స్థితి నెలకొంది.
మరోవైపు టీఆర్‌ఎస్‌లో నిత్యం చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు టీఆర్‌ఎస్‌లోకి వలసలు మరోవైపు
అన్ని పార్టీల నుంచి కార్యకర్తలు టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు ఉత్సాహం చూపడం జిల్లాలో కొత్త శకానికి తెర
లేపినటైంది. ఇప్పటికే ఎంపీతో పాటు 9 స్థానాలను కైవసం చేసుకొని ఏకైక పార్టీగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ పార్టీ
సభ్యత్వ నమోదు కూడా రికార్డు స్థాయిలోనే నిలువనుంది.
-గడువులోగానే సభ్యత్వం పూర్తి
గడువుకు ముందే టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు అన్ని
నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రతిష్ఠాత్మకంగా సభ్యత్వ నమోదును చేపడుతున్నారు. ముఖ్యంగా జిల్లా ఎంపీగా
కవిత ఉండడంతో నేతలు, కార్యకర్తలు మరింత ఉత్సాహంగా సభ్యత్వ నమోదును చేపడుతున్నారు.
నియోజకవర్గాల్లో లక్ష్యానికి మించి సభ్యత్వాలు చేయడానికి నేతలు పోటీ పడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే
ప్రజల నుంచి అంతే స్పందన వస్తోంది. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల్లో 25 వేల సాధారణ, 5 వేల క్రియాశీలక
సభ్యత్వాలను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ నియోజకవర్గానికి 30 వేల నుంచి 40 వేల వరకు
సభ్యత్వాలు అయ్యేటట్లుగా ఎమ్మెల్యేలు పని చేస్తున్నారు. మండలాల వారీగా ఇన్‌చార్జీలను ఏర్పాటు చేసుకొని
అడ్‌హక్ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో రోజూ వారీగా సభ్యత్వాలను కంప్యూటర్‌లో పొందుపరుస్తున్నారు. గ్రామాల్లో
నేతలు ప్రత్యక్షంగా తిరుగుతూ వ్యక్తిగతంగా కలిసి సభ్యత్వ నమోదును చేయిస్తున్నారు.
ఏదోవిధంగా సభ్యత్వాన్ని చేయాలని కాకుండా ఖచ్చితంగా ప్రతి వ్యక్తినీ కలిసి ఇంటింటికీ వెళ్లి సభ్యత్వ నమోదును
చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్షన్నర వరకు సభ్యత్వ నమోదు అయినట్లుగా నేతలు
చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 70 వేల సభ్యత్వాల నమోదు చేయాలన్న లక్ష్యం మూడున్నర లక్షలు దాటే
అవకాశం ఉంది. ఏమైనా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతుండగా, సభ్యత్వం
తీసుకోవడానికి పల్లెల్లో యువత ముందుకు రావడంతో కాంగ్రెస్, దేశం పార్టీల్లో కంగారు మొదలైంది. ఇదిలా ఉంటే
ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించకపోవడంతో చేతులెత్తేశారు.
-ప్రత్యర్థి పార్టీల్లో వణుకు
-రికార్డు స్థాయిలో సభ్యత్వాలు
-ఊరూరా గుబాళిస్తున్న గులాబీ పార్టీ
-ఆన్‌లైన్‌లో నమోదుకు యువత ఉత్సాహం
తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్యమాన్ని తలపిస్తోంది. పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు
అన్ని వర్గాల వారూ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, మహిళలు, యువతీ,యువకులు.. ఇలా సబ్బండ వర్ణాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి భారీగా వలస వస్తున్నారు.టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రక్రియలో ఈ విషయం సుస్పష్టమవుతోంది.
సామాన్య జనం సైతం అనూహ్యంగా పోటాపోటీగా సభ్యత్వం తీసుకుంటుండటం గులాబీ సేనను ఆశ్చర్యచకితుల్ని
చేస్తోంది. తెలుగు తమ్ముళ్లు గులాబీ నీడను కోరుకుంటుండటంతో తెలుగుదేశం పార్టీ దుకాణం మూసివేయక
తప్పని పరిస్థితి. అటు కాంగ్రెస్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో కాంగీల్లోనూ కలవరం మొదలైంది.
ఇదిలా ఉండగా ఊళ్లకు ఊళ్లు గులాబీ పార్టీలో చేరేందుకు ఉత్సాహంతో ఉరకలు వేస్తుండడం విశేషం. జిల్లాలోని
పలు సెగ్మెంట్లలో మెంబర్ షిప్ డ్రైవ్ పుస్తకాలు అయిపోవడంతో మరిన్ని కావాలని అధిష్టానానికి విన్నవించారుస్థానిక నేతలు. చాలా మంది యువకులు ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదుపై ఆసక్తి కనబర్చుతున్నారు. ఇప్పటికే
జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం 2.70 లక్షల సభ్యత్వం పూర్తవడం విశేషం. క్రియాశీల సభ్యత్వాలపై చాలా మంది ఆసక్తి కనబర్చుతున్నారు.
గులాబీ జోరుకు ప్రతిపక్ష పార్టీలు పరేషాన్ అవుతున్నాయి. పల్లె నుంచి పట్నాల దాక అందరూ
టీఆర్‌ఎస్‌వైపే చూస్తున్నారు. ఇప్పటికే గులాబీ గూటికి కాంగ్రెస్, టీడీపీ నుంచి భారీగా కార్యకర్తలు, నేతలు చేరారు.
జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి సర్పంచులను మొదలుకొని రాష్ట్రస్థాయి నాయకులు ఇదే సరైన
అవకాశంగా భావిస్తున్నారు. ప్రజా తీర్పులో చిత్తయిన కాంగ్రెస్, దేశం నేతలకు మింగుడు పడకుండాపోయింది.
జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఊహించనివిధంగా పల్లెల్లో పార్టీ
తీర్థం పుచ్చుకోవడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, దేశం నుంచి భారీగా వలసలు మొదలు కావడంతో
కుదేలయ్యారు. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా దేశం దుకాణం మూసేసినట్లుగానే అయ్యింది.
మండలానికి ఐదారుగురికి మించి లీడర్లు లేని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్‌లోనూ అదే పరిస్థితి ఉంది. టీడీపీ కన్నా
కొంచెం మెరుగ్గా ఉన్నప్పటికీ సభ్యత్వ నమోదులో మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలకు టీఆర్‌ఎస్‌లోకి చేరడానికే ఉత్సాహం చూపుతున్నారు. ఇటీవలే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాయి. అయితే
ఆయా పార్టీల నేతలు కనీస సభ్యత్వం చేయడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. అయినప్పటికీ టీడీపీలో చేరేందుకు ప్రజలు విముఖతనే వ్యక్తం చేశారు. పాత క్యాడర్ కూడా సభ్యత్వ నమోదుకు దూరంగా ఉండిపోయింది. పరువును కాపాడుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అనుకున్న స్థాయిలో సభ్యత్వ నమోదును చేయలేకపోయారు. దేశం సభ్యత్వ నమోదు మాత్రం కోపతాపాలతో మొదలై జిల్లా కేంద్రంలో కొట్లాటతో ముగిసింది.
కానీ టీఆర్‌ఎస్ ఈ నెల 6 నుంచి సభ్యత్వ నమోదును జిల్లాలో చేపట్టింది. దాదాపుగా అన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియ
ప్రారంభమైంది. అట్టహాసంగా ప్రారంభమైన సభ్యత్వ నమోదు అదే జోరుగా సాగుతోంది. ఒకవైపు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి విముఖత వ్యక్తమైతే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం
చేస్తున్నారు. ప్రధానంగా యువత ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా సభ్యత్వ నమోదును చేసుకోవడానికి
సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు ఆన్‌లైన్ ద్వారా తమ సభ్యత్వాన్ని చేపట్టారు. రికార్డు స్థాయిలో సభ్యత్వ
నమోదు జరుగుతోంది. దీంతో ప్రతిపక్ష పార్టీల్లో వణుకు మొదలైంది. ఇప్పటికే వరుస వలసలతో
కోలుకోలేకపోతున్న కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వ నమోదు మరో దెబ్బను మిగిల్చింది. టీడీపీ దాదాపుగా జిల్లాలో ఖాళీ
అయింది. నేతలకు క్యాడర్ కరువైంది.
ఉన్న నేతలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. తమ సభ్యత్వ నమోదుకు స్పందన
కరువుకాగా, టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వానికి వస్తున్న స్పందనతో కాంగ్రెస్, టీడీపీల్లో కలవరం మొదలైంది. శత
విధాల ప్రయత్నం చేసినా టీఆర్‌ఎస్‌లోకి వలసలను ఆపడంలో ఆయా పార్టీల నేతలకు సంకట స్థితి నెలకొంది.
మరోవైపు టీఆర్‌ఎస్‌లో నిత్యం చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు టీఆర్‌ఎస్‌లోకి వలసలు మరోవైపు
అన్ని పార్టీల నుంచి కార్యకర్తలు టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు ఉత్సాహం చూపడం జిల్లాలో కొత్త శకానికి తెర
లేపినటైంది. ఇప్పటికే ఎంపీతో పాటు 9 స్థానాలను కైవసం చేసుకొని ఏకైక పార్టీగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ పార్టీ
సభ్యత్వ నమోదు కూడా రికార్డు స్థాయిలోనే నిలువనుంది.
-గడువులోగానే సభ్యత్వం పూర్తి
గడువుకు ముందే టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు అన్ని
నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రతిష్ఠాత్మకంగా సభ్యత్వ నమోదును చేపడుతున్నారు. ముఖ్యంగా జిల్లా ఎంపీగా
కవిత ఉండడంతో నేతలు, కార్యకర్తలు మరింత ఉత్సాహంగా సభ్యత్వ నమోదును చేపడుతున్నారు.
నియోజకవర్గాల్లో లక్ష్యానికి మించి సభ్యత్వాలు చేయడానికి నేతలు పోటీ పడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే
ప్రజల నుంచి అంతే స్పందన వస్తోంది. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల్లో 25 వేల సాధారణ, 5 వేల క్రియాశీలక
సభ్యత్వాలను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ నియోజకవర్గానికి 30 వేల నుంచి 40 వేల వరకు
సభ్యత్వాలు అయ్యేటట్లుగా ఎమ్మెల్యేలు పని చేస్తున్నారు. మండలాల వారీగా ఇన్‌చార్జీలను ఏర్పాటు చేసుకొని
అడ్‌హక్ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో రోజూ వారీగా సభ్యత్వాలను కంప్యూటర్‌లో పొందుపరుస్తున్నారు. గ్రామాల్లో
నేతలు ప్రత్యక్షంగా తిరుగుతూ వ్యక్తిగతంగా కలిసి సభ్యత్వ నమోదును చేయిస్తున్నారు.
ఏదోవిధంగా సభ్యత్వాన్ని చేయాలని కాకుండా ఖచ్చితంగా ప్రతి వ్యక్తినీ కలిసి ఇంటింటికీ వెళ్లి సభ్యత్వ నమోదును
చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్షన్నర వరకు సభ్యత్వ నమోదు అయినట్లుగా నేతలు
చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 70 వేల సభ్యత్వాల నమోదు చేయాలన్న లక్ష్యం మూడున్నర లక్షలు దాటే
అవకాశం ఉంది. ఏమైనా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతుండగా, సభ్యత్వం
తీసుకోవడానికి పల్లెల్లో యువత ముందుకు రావడంతో కాంగ్రెస్, దేశం పార్టీల్లో కంగారు మొదలైంది. ఇదిలా ఉంటే
ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించకపోవడంతో చేతులెత్తేశారు.

No comments:
Post a Comment