-కలెక్టర్ జగన్మోహన్
కలెక్టరేట్: స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను జిల్లాలో వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ జగన్మోహ న్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మండలాల్లోని ఎంపీడీఓలు, తహసీల్దార్‌లు, పంచాయతీ అధికారులు, సర్పంచ్‌లతో వ్యక్తిగత మ రుగుదొడ్ల నిర్మాణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వీటి నిర్మాణాలకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు నిర్ధేశించిన లక్ష్యం లో ఇప్పటి వరకు కేవలం 27శాతం మాత్రమే పూర్తి అయ్యాయని ఇంకా 77శాతం మరుగుదొ డ్ల నిర్మాణాలను చేపట్టాల్సి ఉందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు గ్రామాల్లో నిర్మించకపోవడం వల్ల ఈగలు,
దోమలు పెరిగి ప్రజలు రోగాలబారిన పడుతున్నారన్నారు. వీటి నివారణకు స ర్పంచులు బాధ్యత వహించి ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండేలా చూడాలని సూచించారు. 2014డిసెంబర్ వరకు చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణానికి డ్వామా ద్వారా బిల్లు లు చెల్లించామని తెలిపారు. జనవరి 2015 నుంచి చేపట్టే మరుగుదొడ్లకు గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ ద్వారా చెల్లింపులు చేస్తామని పేర్కొన్నారు. నూతన విధానం ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం కోసం 12000ను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఈ విషయాన్ని గ్రామస్థాయిలో ప్రచారం చేసి ప్రతి ఒక్కరూ మరుగుదొ డ్డి నిర్మించుకునేలా చూడాల్సిన బాధ్యత సర్పంచులు, అధికారులపై ఉందన్నారు. ఈసందర్భం గా పలువురు సర్పంచ్‌లు మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి తమ వంతు బా ధ్యతగా కృషి చేస్తామని తెలిపారు.
కొన్ని గ్రామా ల్లో వీటి నిర్మాణాలకు సంబంధించిన ఉత్తర్వూ లు లేనప్పటికీ సర్పంచులుగా సొంత పూచిపై మరుగుదొడ్లు నిర్మిస్తే ఇప్పటి వరకు బిల్లులు రాలేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ వెంటనే మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. దారిధ్య్రరేఖకు దిగువన ఉన్న వారందరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మంచుకోడానికి అర్హులన్నారు. పెండింగ్‌లో ఉన్న మరుగుదొడ్ల నిర్మాణాలను యుద్ధ్దప్రతిపాదికన మార్చి 15 లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జి ల్లాస్థాయిలో 100శాతం మరుగుదొడ్లను ని ర్మించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సర్పంచులను కలెక్టర్ కోరారు. ఈసమీక్షా సమావేశంలో డీపీఓ పోచయ్య, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఇంద్రసేన్, డివిజనల్ పంచాయతీ అధికారి సుదర్శన్, డ్వామ ఏపీడీ మధుసుధన్‌రావ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment