పోలీస్ శాఖలో సి.సి.టి.ఎన్.ఎస్ ప్రాజెక్టు ప్రారంభించిన జిల్లా ఎస్పీ
నిజామాబాద్ : నేరాల నియంత్రణ కోరకు, సిబ్బందికి పనిభారం తగ్గించాలని భారతదేశ వ్యాప్తంగా సి.సి.టి.ఎన్.ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారిగా సి.సి.టి.ఎన్‌ఎస్ కార్యక్రమం జిల్లాలో ఎస్పీ ఎస్. చంధ్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ క్రైం క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్‌వర్కింగ్ సిస్టమ్ నిర్విరామంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇ-కాప్స్‌కు బదులుగా భారతదేశ వ్యాప్తంగా ఎంటర్ ప్రైజ్ ఇ-కాప్స్‌గా అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ యొక్క ఇ-కాప్స్ అనేది భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ప్రారంభించడం జరిగిందన్నారు. సరికొత్త శాస్త్ర సాంకేతిక పద్దతులలో దీనిని అనుసందానం చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. జిల్లాలో నేరాల నియంత్రణ కోసం చాలా ఉపయోగపడి నేరాల శాతాన్ని తగ్గించవచ్చాన్నారు. పిర్యాదుదారులు ఇంటర్‌న్నెట్ ద్వారా కూడా తమ ణిర్యాదులు నమోదు చేసుకొని తదుపరి అట్టి కేసు యోక్క వివరాల స్టేటస్ తెలుసుకోవచ్చునని అన్నారు. పోలీసుల పనితీరు ఎంతో మెరుగుపడి సిబ్బందికి పనిభారం తగ్గి సమయం ఎంతో ఆదా అవుతుందని తెలిపారు. ఫిర్యాదుదారులు ఎఫ్‌ఐఆర్ నమోదు నుండి అంతిమ రిపోర్టు వరకు అన్ని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ( అడ్మిన్) ఆర్. ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment