ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగేలా కృషి : టియుడబ్ల్యూజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.రమణ, ఉపాధ్యాక్షులు రమేష్ హజరీ, ఇస్మాయిల్.
నిజామాబాద్ : టియుడబ్ల్యూజె రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ నాయకత్వంలో జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర, జిల్లా నాయకత్వం పని చేయాల్సి ఉంటుందని అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వంతో పోరాడి ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని టియుడబ్ల్యూజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.రమణ, ఉపాధ్యాక్షులు రమేష్ హజరీ, ఇస్మాయిల్.సంయుక్తంగా పేర్కోన్నారు. ప్రతి జర్నలిస్టుతో పాటు డెస్క్ జర్నలిస్టులకు, చిన్న పత్రికలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నామని, అది పలించే దిశగా ముందడుగు పడిందని అన్నారు.
కేసిఆర్‌కు కృతజ్ఞతలు : టియుడబ్ల్యుజె
తెలంగాణ జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, సంక్షేమ నిధికి రూ.10 కోట్లు విడుదల చేసి ఆ నిధిని రూ.100 కోట్లకు పెంచాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు టియుడబ్ల్యూజె జిల్లా కమిటి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన అనంతరం తొలిసారిగ జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు బాలార్జున్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది.
సమావేవంలో తీర్మానాలు :
1. పని చేస్తున్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వానికి వినతి.
2.డెస్క్ జర్నలిస్టులను వేరుగా చూపుతూ ఒక జర్నలిస్టు సంఘం చేస్తున్న కుట్రను తిపికొట్టాలని, ఆ కుట్రను ప్రభుత్వం లెక్క చేయకుండా డెస్క్ జర్నలిస్టులందరికి అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, అన్ని సంక్షేమ కార్యక్రమాలను అందేలా చూడాలని వినతి.
3. కేసిఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జివో ద్వారా 200 గజాల ఇళ్ల స్థలాలను ఇవ్వాలని వినతి.
4.ఇటీవల మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు సంక్షేమనిధి ద్వారా పెన్షన్ సౌకర్యాన్ని కల్పింస్తునందున వృద్దులైన జర్నలిస్టులకు పెన్షన్, ఉద్యోగ భద్రతకై చర్యలు తీసుకోవాలని తీర్మాణం చేయనైనది.
5. ప్రెస్ అకాడమి ద్వారా జిల్లాలోని జర్నలిస్టులకు శిక్షణ తరగతులను నిర్వహించాలి.
6. చిన్న పత్రికలకు 40 శాతం పత్రికా ప్రకటనలతో పాటు అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలని తిర్మాణం.
ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజె రాష్ట్ర ఉపాధ్యాక్షులు, జిల్లా గౌరవ అధ్యక్షులు జమాల్‌పూర్ గణేష్, జిల్లా డిప్యూటి జనరల్ సెక్రెటరి ధనుంజయ్, జిల్లా ఉపాధ్యాక్షులు కుంచం శ్రీనివాస్‌తో పాటు కమిటి సభ్యులు పాల్గొన్నారు.



No comments:
Post a Comment