భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఇంటర్ పరీక్షలకు సిద్దం కావాలి : జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్
నిజామాబాద్ : భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఇంటర్ పరీక్షలకు విద్యార్థులు సిద్దం కావాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ సూచించారు. బుధవారం స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఈ నెల 9 నుండి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై ముఖ్య పర్యవేక్షకులు, సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏ పరీక్షా కేంద్రంలో కూడా విద్యార్థులు ఆక్రమ పద్దతిలో పరీక్షలు రాసే అవకాశం కల్పించవద్దని, అందుకు ప్రోత్సహించడం వలన వారి భవిష్యత్ పాడుచేసినవారవుతారని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు అవకాశం ఇచ్చే విద్యా సంస్థలపై చర్యలు ఉంటాయన్నారు. విద్యార్థులు కూడా సులభంగా, కష్టపడకుండా పరీక్షలు రాసే ఆలోచనకు స్వస్తి చెప్పి సరైన పద్దతిలో పరీక్షలకు సంసిద్దులు కావాలన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలు రాయడం వల్ల తదుపరి పై తరగతులకు వెల్లడమే కాకుండ మంచి ప్రతిభకు పునాదులు వెసుకున్నవారవుతారన్నారు.
ఈ నెల 9 నుండి 23 వరకు ఉదయం 9 నుండి 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. విద్యార్థులు నిర్ణిత సమయానికి ముందే వారి వారి పరీక్ష కేంద్రాలకు హజరుకావాలని సూచించారు. జిల్లాలో 73 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రెండు సంవత్సరాల విద్యార్థులు కలిపి60,592 మంది విద్యార్థులు కాగా మొదటి సంవత్సరం జనరల్ 27,497 మంది ఓకేషనల్ 1,753 మంది ఉన్నారన్నారు. పోలీసు , రెవెన్యూ అధికారులు బృందాలుగా ఫ్లయింగ్, సిట్టింగ్ స్వాడ్స్ ఆధ్వర్యంలో పరీక్షలు పకడ్బందీగా జరగనున్నాయన్నారు. సెల్‌ఫోన్‌లు, పేజర్‌లు, క్యాలిక్యూలెటర్‌లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు అనుమతించబడవని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐఓ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment