ఉపాధిహామి కూలీలకు ఆర్థిక వెసులుబాటు కలిగేలా చర్యలు : కలెక్టర్ రోనాల్డ్ రోస్
నిజామాబాద్ : జిల్లాలోని ఉపాధిహామి కూలీలకు సరైన పనులు కల్పించి తద్వారా వారికి ఆర్థిక వెసులుబాటు కలిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ యంపిడివోలనె ఆదేశించారు. మంగళవారం స్థానిక ప్రగతిభవన్ సమావేశ మందిరంలో ఉపాధిహామి పథకంపై యంపిడివోలు, డ్వామా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 10.72 లక్షల మంది జాబ్‌కార్డులు కలిగిన కూలీలకు గానూ 3.88 లక్షల మందికి మాత్రమే 43.16 శాతంతో ఇప్పటికే పనులు కల్పించాలని తెలిపారు. గత ఆరు నెలలుగా పలుమార్లు సమీక్షల ద్వారా , వీడిమో కాన్ఫురెన్సు ద్వారా పనులు కల్పించాల్సిందిగా ఆదేశించినప్పటికీ పనులు గుర్తించడంలో, కూలీలకు పనులు కల్పించడంలో అధికారులు శ్రద్ద చూపుతున్నట్లు కనిపించడం లేదన్నారు. కూలీలందరికి 100 రోజుల పని కల్పించుటకుగానూ 150 శాతం పనులను గుర్తించాల్సి ఉన్నప్పటికీ చాలా మండలాల్లో ఈ పనులు సక్రమంగా జరగడం లేదని ఆసహానం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో కూలీ మొత్తం జనరేట్ చేయవలసి ఉన్నప్పటికీ సకాలంలో జరగడం లేదని, ఇంకా 122.73 కోట్ల రూపాయలు విడుదల చేయగా118.57 కోట్ల రూపాయలు కూలీలకు చెల్లించడం జరిగిందని తెలిపారు.
ప్రతి గ్రామ పంచాయతీల్లో కనీసం 100 మందికి ప్రతి రోజు పనులు కల్పించాలని ఆదేశించినప్పటికీ 120 గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభం కాలేదన్నారు. ఈ సమావేవంలో డ్వామా పడి వెంకటేశ్వర్లు, డిఆర్‌డిఎ పిడి వెంకటేశం అధికారులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment