అవినీతి రహిత సమాజం కోసం మహిళలు కృషి : జాయింట్ కలెక్టర్ ఎ.రవీంధర్ రెడ్డి.
నిజామాబాద్ : అవినీతి రహిత సమాజం కోసం మహిళలు ఎక్కువగా కృషి చేస్తున్నారని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎ.రవీంధర్ రెడ్డి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్బంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ, వివిధ స్వఛ్చంద సంస్థలు, మహిళా సంస్థలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ర్యాలీని జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఇప్పటికే ఎంతో చైతన్యవంతులై అన్ని రంగాల్లో ముందుకెళుతున్నారని అన్నారు. మహిళ లనుకుంటే సాధించలేనిధి ఏమిలేదని రుజువు చేస్తున్నారన్నారు. విద్య, రాజకీయ, సైనిక, క్రీడల రంగాలలో మహిళలు అంతర్జాతీయ స్థాయిలో దేశానికి గుర్తింపు తెస్తున్నారని ఆయన అన్నారు. మహిళలకు పూర్తి రక్షణ, భద్యత కల్పించాలని, కన్న తల్లిగా గౌరవించాలని అన్నారు. పార్లమెంట్ వరకు మహిళలు వెళ్లగలుగుతున్నారని ఉన్నత స్థాయికి చేరుకున్నారని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతీయ మహిళల్లో నిరాక్షరాస్యత ఉందని మహిళలు అక్షరాస్యులు కావాలని, విద్య నేర్చుకోవలసిన అవసరం ఎంతయినా ఉన్నదనిసూచించారు. ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న మహిళలు పారదర్శకతతో పని చేస్తున్నారని ఆయన తెలిపారు. మహిళలు ఉన్న చట్టాలపై పూర్తి అవగామాన చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి రాములు, మెప్‌మా పిడి సత్యనారాయణ, డియమ్‌అండ్ హెచ్‌ఓ డాక్టర్ బసవేశ్వరి, మున్సిపల్ కమీషనర్ వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment