నిర్మల భారత్ సాధన కోసం మరుగుదొడ్లు,మూత్రశాలలూ విస్తారంగా నిర్మించాలి....
బహిరంగంగా చర్చించుకోవడానికి ఇష్టపడని విషయాల్లో మల మూత్ర విసర్జన అంశం ఒకటి. కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల కలిగే అనర్థాలపై చాలామందికి అవగాహన లేదు. అందుకే దీనిని అప్రధాన అంశంగా భావిస్తూ సమస్యను దాటవేస్తుంటారు. పట్టణ ప్రాంతాల్లో జనసమ్మర్దం ఎక్కువగా ఉండే బస్టాండులు, రైల్వేస్టేషన్లలో తగినన్ని మరుగుదొడ్లు లేకపోవడం, వాటి నిర్వహణలో లోపాల వల్ల కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. కలిమి కలిగినవారికి ఇదొక సమస్య కాకపోవచ్చు కాని, పట్టణ ప్రాంత మురికివాడల్లోని పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంత వాసులకు ఇదొక తీవ్ర సమస్యే. ప్రపంచవ్యాప్తంగా ఆరుబయట మల విసర్జన చేసే ప్రజల్లో అరవై శాతం మన దేశానికి చెందినవారే. మరుగుదొడ్ల సౌకర్యం లేని కారణంగా అధికంగా ఇబ్బందుల పాలవుతోంది మహిళలే. చీకట్లో తప్ప మల విసర్జనకు అవకాశం లేని పరిస్థితుల్లో వీరు- అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. మలబద్దకం, మొలల సమస్య, అజీర్ణం వంటి సమస్యలకు ఇది కారణమవుతోంది. ఆరు బయట మల విసర్జన జరిగే ప్రాంతాల్లో పాదరక్షలు లేకుండా తిరగడం వల్ల బద్దెపురుగు బాక్టీరియా సోకే అవకాశం ఉంది..
వివిధ రాష్ట్రాల్లో విసర్జకాలను ఎత్తిపోయవలసిన మరుగుదొడ్లు ఉండటం వల్ల, ఆ పనికి మనుషుల్నే ఉపయోగిస్తున్నారు. ఈ అమానవీయ వృత్తిని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం 1993లో ఒక చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం డ్రై లెట్రీన్స్ నిర్మాణాన్నీ నిషేధించింది. కానీ, ఇప్పటికీ వాటి నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ఈ వృత్తిపై నిషేధం, అందులో ఉన్న వారి ఉపాధికి సంబంధించిన తాజా బిల్లును కేంద్ర క్యాబినెట్ మొన్న ఆగస్టులో ఆమోదించింది. ఈ వృత్తిలో సుమారు పదమూడు లక్షల మంది కొనసాగుతున్నారు. లాభాల బాటలో నడుస్తున్న రైల్వే శాఖ సైతం విసర్జకాన్ని ఎత్తివేయడానికి మనుషుల్నే ఉపయోగిస్తోంది. ప్రత్యామ్నాయాలను అన్వేషించడంలో ఈ శాఖ దశాబ్దాలుగా నిర్లక్ష్యం వహిస్తోంది. ఫలితంగా ప్రపంచంలోనే 'అతిపెద్ద ఆరుబయట మరుగుదొడ్డి'గా భారత రైల్వే శాఖ అపకీర్తిని మూటకట్టుకుంది.
మన దేశంలో శిశు మరణాలకు ప్రధాన కారణం డయేరియా, శ్వాసకోశ వ్యాధులు. మల విసర్జన తరవాత సబ్బుతో చేతులు కడుక్కునే చిన్న చర్య ద్వారా డయేరియాని 40శాతం, శ్వాసకోశ వ్యాధులను 30శాతం తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరుగుదొడ్ల వినియోగం లేకపోవడం, సరైన పారిశుద్ధ్య వసతులు లేకపోవడం వల్ల కలిగే అనారోగ్యంతో మనదేశం ఏటా 24,000కోట్ల రూపాయల మేరకు నష్టపోతోంది.మన రాష్ట్రంలోని చాలా పట్టణాల్లో మరుగుదొడ్ల పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. రాష్ట్రంలోని సగం పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేదు. అరవై ఆరు శాతం పాఠశాలల్లో అమ్మాయిలకు శౌచాలయ సౌకర్యం లేదు. మరుగుదొడ్లు ఉన్నా వాటి నిర్వహణ లోపం వల్ల అవి నిరుపయోగమవుతున్నాయి. అమ్మాయిలు చదువు మానివేయటానికి ఇదీ ఓ కీలక కారణం.

-వేణు గోపాల్. వి

No comments:
Post a Comment