మిషన్ కాకతీయతో తెలంగాణ భూములు సస్యశ్యామలం : తెలంగాణ సిఎం కెసిఆర్
నిజామాబాద్ ( కామారెడ్డి) : మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణ భూములను సస్యశ్యామలం చేయడానికి చిత్తశుద్దితో కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంధ్రశేఖర్ రావు తెలిపారు. గురువారం నిజామాబాద్ జిల్లాలోని సదాశివనగర్ మండల కేంద్రంలోని పాత చెరువు వద్ద మిషన్ కాకతీయ మన ఊరు- మన చెరువు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వెయ్యి ఏళ్లక్రితం కాకతీయ రెడ్డి రాజుల పరిపాలనలో చెరువుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని, యుద్దాలలో గెలిచినప్పటికీ చెరువులను ద్వసం చేయకుండా అప్పటి రాజులు వాటిని కాపాడారని గుర్తుచేశారు. కాని ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన తెలంగాణ పరిధిలోని చెరువులు నిరాదరణకు గురై గ్రామాలలో వ్యవసాయానికి సాగునీటికై ఇబ్బందులు పడవలసి వచ్చిందన్నారు. తమ ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 46 వేలకు పైగా చెరువులలో పూడికతీసి పునరుద్దరించనున్నామన్నారు. తద్వారా పంట చేలకు సారవంతమైన మట్టిని తోడుకోవడంతో పాటు గ్రామాల్లో భూగర్బ జలాలు పెరిగే అవకాశం ఉందని, పోలాలకు ఎరువుల వాడకం తగ్గి దిగుబడి పెరుగుతుందని ఆయన పేర్కోన్నారు. ఈ చెరువులు నిండి మూడు సంవత్సరాల పాటు నీటికి ఇబ్బంది లేకుండ ఉంటుందన్నారు. ఈ సంవత్సరం 9 వేల చెరువులను రాష్ట్ర వ్యాప్తంగా పునరుద్దరించనున్నామని, ఈ కార్యక్రమం పకడ్బందీగా నాణ్యతపరంగా ఆక్రమాలకు తావులేకుండ అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో చెరువుల పనులకు నాణ్యతలేని పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించవద్దని, ప్రస్తుత మిషన్ కాకతీయ పనుల్లో ఆక్రమాలకు తావిస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
40 వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో వాటర్‌గ్రీడ్ కార్య్కమాన్ని చేపడుతున్నామని, వచ్చే నాలుగేళ్లలో ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీటిని అందిస్తామని అన్నారు. ఇందుకై 15 వేల చోట్ల క్రాసింగ్‌లకు చర్యలు తీసుకోవలసి ఉన్నదని, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి శాఖల అధికారులు ఇందుకై త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాట్లలో భాగంగా కామారెడ్డిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయుటకు తాను బాద్యత తీసుకుంటానన్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్దికి సంబంధిత శాసనసభ్యులు ఏనుగు రవీంధర్ రెడ్డి కోరిక మేరకు పలు హామిలు ఇచ్చారు. మిషన్ కాకతీయలో ఈ నియోజకవర్గానికి గతంలో మంజూరు చేసిన 30 కోట్ల రూపాయలకు అదనంగా మరో 30 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. తాను ప్రారంభించిన పాత చెరువుకు గతంలో మంజూరు చేసిన 37 లక్షల రూపాయలకు అదనంగా సియం సహాయనిధి నుండి మరో కోటి రూపాయలు మంజూరు చేస్తున్నామన్నారు. ప్రాణహిత చేవేళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవరగ&ంలోని 50 వేల ఎకరాలకు నీరంధించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గానికి 132 కెవి సభ్‌స్టేషన్, 33/11 కెవి.సభ్‌స్టేషన్‌లు 11.3.15 మెగావాట్ల ట్రాన్సుపార్మర్లు, తాడ్వాయి మండల కేంద్రంలో ఐటిఐ, ఎల్లారెడ్డిలో 100 పడకల ఆసుపత్రి, నాగిరెడ్డిపేట్ -మాల్ తుమ్మెద పరిధి 2 వేల ఎకరాలలో వ్యవసాయ పరిశోధనకై వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, క్రైస్తవులకు కమ్యూనిటి హాల్, ముస్లీంలకు 3 మండలాల పరిధిలో పెద్ద షాదిఖానా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నియోజక పరిధిలోని 6 మండలాలకు 50 లక్షల రూపాయల చోప్పున సిఎం సహాయ నిధి నుండి మంజూరు చేస్తున్నామని ఈ పరిధిలో 100 గ్రామాలకు 5 లక్షల రూపాయల చోప్పున అభివృద్ది కార్యక్రమాలకు మంజూరు చేస్తున్నామన్నారు. కాయిత లంబాడీలను ఎస్సీల్లో కలుపడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
అసెంబ్లీ కార్యక్రమాల అనంతరం ప్రజా ప్రతినిధులు హైదరాబాద్‌లో ఉండకుండ చెరువుల పునరుద్దరణకు గ్రామాల్లో పర్యటించాలని తెలిపారు. చెరువు కట్టల వెంట ఈతవనం పెంచాలని అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా రైతులు ఎక్కువగా చెరువుల , బోర్లపైననే ఆధారపడ్డారని, జిల్లలో 3,251 చెరువులకు గాను 700 చెరువులను మొదటి విడతగా పునరుద్దరించనున్నామని, 457 చెరువులకు అనుమతి లభించిందని, 401 చెరువులకు టెండర్లు పిలిచామని, 251 ప్రక్రియ పూర్తి అయిందన్నారు. ఈ కార్యక్రమం విజయవంత చేయాల్సిన భాద్యత మనందరిపైన ఉన్నదని తెలిపారు.
రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధించడానికి మిషన్ కాకతీయ కార్యక్రమానికి రూపకల్పన చేశామన్నారు. గత ప్రభుత్వాలు పిర్లక్ష్యం చెయడం వలన గంగాళాల్ల ఉన్న చెరువులు తాంబాలాల్లా మారిపోయాయన్నారు. ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించనున్నామన్నారు. 46,407 చెరువలకు గాను ఈ సంవత్సరం 9,573 పునరుద్దరించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 2,210 టెండరు ప్రక్రియ పూర్తిఅయిందన్నారు. తెలంగాణ సాధన స్పూర్తిగాఈ చెరువుల పునరుద్దరణ కార్యక్రమాన్ని ఉద్యమంల ప్రజలు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డిప్యూటి స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి, నీటి పారుదల రాష్ట్ర సలహాదారులు ఆర్. విద్యాసాగర్ రావు, ప్రిన్సిపల్ కార్యదర్శి జోషి, జిల్లా కలెక్టర్ డి. రోనాల్డ్ రోస్, జహీరాబాద్ ఎంపి బీబీపాటిల్, శాసనమండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ దపేదార్ రాజు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment