తెలంగాణ అవతరణ దినోత్సవంలో యువతీ యువకులకు పోటీలు
నిజామాబాద్ : తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి తెలంగాణ సాంస్కృతి యువజన ఉత్సవ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్ తెలిపారు. 15 నుండి 35 సంవత్సరాల లోపు యువతీ యువకులకు ఈ నెల 5వతేదీన న్యూ అంబేద్కర్ భవన్‌లో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వ్యాసరచన, మ్యూజిక్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, తదితర పోటీలను నిర్వహిస్తున్నామని, పోటీల్లో పాల్గొనే వారు పోటీలకు కావాల్సిన పరికరాలను తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

No comments:
Post a Comment