ఎయిమ్స్ తరహాలో జిల్లా ఆసుపత్రిని మెరుగుపరుస్తాం : ఎంపి కవిత
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిని ఎయిమ్స్ తరహాలో తయారు చేస్తామని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేకంగా జిల్లా ఆసుపత్రికి 95 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారని అన్నారు. బుధవారం ఆసుపత్రిలో జనజాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్లను సదరం క్యాంపుకు ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ తరహాలోనే ప్రముఖులందరు చికిత్స చేయించుకునే విధంగా జిల్లాలోని ఆసుపత్రిని కూడా అన్ని హంగులతో మెరుగుపరుస్తామని అన్నారు. సదరం క్యాంపు 60 రోజుల పాటు నిరంతరంగా వికలాంగులకు సర్టిఫికెట్లు అందజేయాలని, ఏ ఒక్క వికలాంగుడు ఇబ్బందులు పడకుండా సర్టిఫికెట్లు అందజేయాలని కోరారు. అవినీతి కేసులో చంద్రబాబునాయుడిపై ఏ-1 ముద్దాయిగా కేసు నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్‌గుప్తా, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment