తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రపంచానికి చాటాలి : మంత్రి ఈటెల
కరీంనగర్ : తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు చాలా గొప్పవని, ప్రపంచానికి చాటాలని రాష్ట్ర ఆర్థిక పౌర సరఫరాల శాఖమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలలో భాగంగా 5వ రోజు శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై జరిగిన రాష్ట్రస్థాయి సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన మాట్లాడుతూ తెలంగాణ చరిత్రను భావితరాలకు అందించాలని అన్నారు. తెలంగాణ ఉద్యమం మరువలేనిదని, ఉద్యమాన్ని మలుపుతిప్పింది కేసిఆర్ అని అన్నారు. 1969లో ప్రారంభం అయిన తెలంగాణ ఉద్యమం 2001లో తిరిగి పుంచుకుందని అన్నారు. తెలంగాణ సాధనకు కేసిఆర్‌ఉ కేంద్రమంత్రి పదవికి, ఎఉంపి స్థానానికి, రాష్ట్రంలో శాసనసభ్యులు రాజీనామాలు చేశారని తెలిపారు. తెలంగాణ 14 సంవత్సరాల ఉద్యమంలో ఎన్నో అవమానాలు భరించామని, అనేక మంది అమరవీరుల త్యాగాల ఫలితం, మేధావులు, ఉద్యమకారులు, కవులు, సాహితీవేత్తల ఫలితంగా తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. పదవుల కోసం కాదని, పాలకులుగా కాకుండా రాష్ట్రానికి సేవకులుగా పనిచేస్తామని అన్నారు. కరీంనగర్ చైతన్యవంతమైన జిల్లా అని, జిల్లాను విత్తనోత్పత్తి కేంద్రంగా, ధాన్యాగారంగా, అభివృద్ధి చేస్తామని అన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు తుల ఉమ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర అవతరణ వేడుకలను జిల్లాలో పండుగ వాతావరణంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని అన్నారు. ప్రజల ఆకాంక్షలకనుగుణంగా ప్రభుత్వం పాదర్శకమైన పాలన అందిస్తామని తెలిపారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్, శాసనసభ్యులు గంగుల కమలాకర్, అదనపు జేసీ నాగేంద్ర, చరిత్రకారులు, సాహితీవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment