విద్యార్థులు పోటీతత్వం పెంపొందించుకోవాలి
కరీంనగర్ : విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల్లో పాల్గొంటే ఆలోచన శక్తి పెంపొంది భవిష్యత్‌లో ఉన్నతస్థానాలకు చేరుకుంటారని పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలలో భాగంగా శనివారం రెవెన్యూ గార్డెన్స్‌లో జిల్లా విద్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖన పోటీలను ఎంపి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ బిడ్డలు అన్యాయానికి గురికావద్దని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని అన్నారు. నేటితరం పిల్లల బంగారు భవిష్యత్‌కు తెలంగాణ ప్రభుత్వం బాటలు వేస్తుందని అన్నారు. కొత్తరాష్ట్రంలో యువతకు మంచి అవకాశాలున్నాయని అన్నారు. నీతి, నిజాయితీ, పారదర్శకంగా ఎంపికలు జరుగుతాయని, విద్యార్థులు పోటీతత్వం పెంపొందించుకొని అవకాశాల కోసం పోటీపడాలని అన్నారు. విద్యార్థులు నైపుణ్యతను పెంపొందుకోవాలని సూచించారు. తెలంలగలాన రాష్ట్రంలో ఐఎఎస్‌లు చాలా తక్కువమంది ఉన్నారని, నేటి యువత లక్ష్యం ఐఎఎస్‌పై పెట్టాలని అన్నారు. చిత్రలేఖనంలో చిన్నారుల ఆలోచనలు చాలా బాగున్నాయని హరితహారం వారు గీసిన చిత్రాలు అద్భుతమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు తుల ఉమ, జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్, ఎజెసి నాగేంద్ర, జిల్లావిద్యాధికారి లింగయ్య, జడ్పీటీసీలు, ఎంపిపిలు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment