Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad
Showing posts with label Karimnagar. Show all posts
Showing posts with label Karimnagar. Show all posts

Wednesday, 11 May 2016

కరీంనగర్ డి ఇ ఓ


కరీంనగర్‌ కార్పొరేషన్‌లో స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ - 23న ఎన్నికలు

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ - 23న ఎన్నికలు
కరీంనగర్‌ :
బల్దియాలో ఎన్నికల సందడి మొదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలకు ఎట్టకేలకు నోటిఫికేషన్‌ వెలువడింది. దీంతో ఆశావహులు నేతలను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థలో స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలకు బల్దియా అధికారులు
నోటిఫికేషన్‌ జారీ చేశారు. 16వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.17 నా మినేషన్ల పరిశీలన, 18 నుంచి 20 వరకు అభ్యర్థుల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 23న ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల నిర్వహణతో నగరపాలక సంస్థలో వి విధ అభివ ద్ధి పనులకు వేగం గా అనుమతులు వచ్చే అవకాశముంది. ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో బల్దియాలో ఒక్కసారి ఎ న్నికల సందడి
మొదలైంది. బల్దియాలో అత్యధిక బలం టీఆర్‌ఎస్‌కు ఉండడం వారి నుంచే పోటీ ఎ క్కువగా కనిపిస్తున్నది. ముఖ్యంగా అధికార పార్టీ లో ఆశావహుల
సందడి మొదలైంది. ఈ పదవుల్లో తమకు అవకాశం కల్పించాలంటూ ఇప్ప టికే పలువురు టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ఎమ్మెల్యే, మేయర్లకు విన్నవిస్తున్నారు.
జీఓ 54 ప్రకారం స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలు ని ర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీని ప్ర కారం 50 డివిజన్లకు కలిపి ఐదుగురు సభ్యులను
ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈమేరకు పోటీలో ఉన్న అభ్యర్థులకు కార్పొరేటర్లు ఒక్కొక్కరు ఐదు ఓట్లు వేయాల్సి ఉంటుంది. అత్యధిక ఓట్లు వచ్చిన వారిని
స్టాండింగ్‌ కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటిస్తారు.నగరపాలక సంస్థలో రెండేళ్లుగా ఎదురుచూస్తున్న స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలకు ప్రభుత్వం
తెర తీ యడంతో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లలో పోటీ మొదలైంది. బల్దియాల్లో పాలకవర్గం కొలువుదీరిన తొ లినాళ్లలోనే ఈ కమిటీల పదవులపై కార్పొరేటర్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆరంభంలో పలువురు ఈ కమిటీ పదవుల కోసం ఎమ్మెల్యేలు, మేయర్ల చుట్టు ప్రదక్షిణలు కూడా చేశారు. అయి తే రాష్ట్ర విభజన
నేపథ్యంలో స్టాండింగ్‌ కమిటీల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ కాక ఇప్పటివరకు నగరపాలక సంస్థ ల్లో ఈ కమిటీల ఎన్నికలు
జరగలేదు.
కాగా ప్రస్తు తం నోటిఫికేషన్‌ జారీకావడంతో కార్పొరేటర్లు ఈ పదవుల కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నా రు. మొత్తం 50 డివిజన్లుండగా బీజేపీ,
ఎంఐఎంలకు ఇద్దరు సభ్యుల చొప్పున, కాంగ్రెస్‌కు తొమ్మిది మంది సభ్యుల బలం ఉంది. టీఆర్‌ఎస్‌ అత్యధికంగా 37మంది ఉన్నారు. దీంతో ఈ కమిటీల్లో
పూర్తిస్థాయిలో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లకే అవకాశం దక్కనుండడంతో పోటీ తీవ్రం కానుంది. ఈ విషయంలో ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు ఎమ్మెల్యేకు
తమకు తప్పనిసరిగా ఈ కమిటీలో అవకాశం కల్పించాలని విన్నవిస్తున్నట్లు సమాచారం.
అలాగే మేయర్‌ ఎన్నికల సమయంలో ప లువురు కాంగ్రెస్‌, స్వతంత్రులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారు ఇప్పుడు ఈ కమిటీలో తమకు అ వకాశం
ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఎమ్మెల్యే రెండు రోజుల్లో విదేశాలకు వేళ్లే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఈ ఎ న్నికల్లో పోటీ చేసే
అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి నిర?యాలు తీసుకుంటారన్న విషయం లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీలో పలువురు కార్పొరేటర్ల మధ్య
విభేదాలున్న సమయంలో ఈ ఎన్నికలు నిర్వహిస్తుండడగా ఎమ్మె ల్యే, మేయర్ల్లు.. అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చే శారన్న విషయంలో ఆసక్తిగా మారింది.

కరీంనగర్‌ : రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రబలుతున్న అతిసారం..

కరీంనగర్‌ జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో డయేరియా(అతిసారం) ప్రబలుతుంది. గత వారం రోజుల నుంచి ఒక్కసారిగా వాతావరణంలో
మార్పులు చోటుచేసుకోవటంతో ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారు.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ వేడిమి సాయంత్రానికల్లా ఈదురుగాలులు, వర్షాలు కురవటంతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. దీంతో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రితో పాటు సింగరేణి సంస్థ ప్రాంతీయ వైద్యశాలలో సుమారు వంద మందికి పైగా డయేరియా బాధితులు చికిత్స
పొందుతున్నారు. సింగరేణి సంస్థ కార్మికుల గ హాలతో పాటు రామగుండం నగర పాలక సంస్థ సారధ్యంలో మంచినీటిని సరఫరా చేస్తుంది. కాగా ఇటీవల
కురుస్తున్న ఆకాల వర్షంతో మంచినీరు కాస్తా కలుషితం కావటంతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. కలుషిత నీరు తాగిన పెద్దలకు, చిన్నారులకు
వాంతులు, వీరేచనాలు రావటంతో ఆస్పత్రికి వరుస కడుతున్నారు. దీంతో ఎప్పటికప్పుడు వైద్యులు బాధితులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకున్నప్పటికి కలుషితమైన నీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచనలు ఇస్తున్నారు.
సాధారణంగా రోజు వచ్చే నీటినే తాగుతున్నమని, ఒక్కసారిగా వాంతులు వస్తున్నయని డయేరియా బాధితులంటున్నారు. నీరు కలుషితం కాకుండా
చూసుకోవాలని కోరుకుంటున్నారు.

Thursday, 14 April 2016

కరీంనగర్‌ : వడగాల్పులనుంచి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి : కలెక్టర్‌

వడగాల్పులనుంచి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి : కలెక్టర్‌

కరీంనగర్‌ :
  జిల్లాలో మరోరెండు రోజులపాటు వడగాల్పులు వీస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్‌ నీతూ ప్రసాద్‌ సూచించారు. ఈ రోజుల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతుండంతో ఉదయం పదకొండు గంటలనుంచి సాయంత్రం నాలుగు గంటలవరకు అత్యవసర పనుల కోసం మాత్రమే బయటకు రావలిసిందిగా ఆమె సూచించారు. వడదెబ్బ కేసులకోసం ప్రభుత్వ ఆసుపత్రులో చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అవసరమనిసిస్తే ఓఆరెస్‌ ను తాగాలని సూచించారు. వేసవిలో మఖ్యంగా వృద్దులు, పిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. నీళ్లను ఎక్కువ మోతాదులో తీసుకోవాలని అన్నారు. వేసవిలో నీటీశాతం అధికంగా వున్న అహారపదార్ధాలను తీసుకోవాలని నీతూ ప్రసాద్‌ సలహా ఇచ్చారు. 

Monday, 4 January 2016

కరీంనగర్: ప్రజావాణి పిర్యాదులు స్వీకరించిన నీతూ ప్రసాద్

DPRO KNR తేది  4-1-2016,. ఫోటోలు, కలెక్టరేటు ఆడిటోరియంలో  ప్రజావాణి కార్యక్రమంలో  ధరఖాస్తులు  స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్  నీతూ ప్రసాద్


Friday, 1 January 2016

Saturday, 6 June 2015

కరీంనగర్‌ :రాజన్నను దర్శించిన హైకోర్టు జడ్జీ

రాజన్నను దర్శించిన హైకోర్టు జడ్జీ
కరీంనగర్‌ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని శనివారం హైకోర్టు జడ్జీ సుభాషినిరెడ్డి దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి కల్పించి ఆయనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మండపంలో ఆయనకు వేదపండితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి చిత్రపఠాన్ని బహూకరించారు. శాలువా కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన ఆలయం పరిసర ప్రాంతాలను పర్యవేక్షించారు. ఈయన వెంట వేములవాడ జడ్జీ, తదితర అధికారులున్నారు. 

కరీంనగర్‌ :రైతులకు అవగాహన సదస్సు

రైతులకు అవగాహన సదస్సు
కరీంనగర్‌ : మన తెలంగాణ- మన వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సును శనివారం మేడిపల్లి మండలంలో వ్యవసాయ అధికారి నరేష్‌ ఆధ్వర్యంలో జరిగింది. నరేశ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు సదస్సుల ద్వారా విత్తనాల పంపిణీ, వ్యవసాయ విధివిధానాలపై అవగాహనలు ఇవ్వడం జరుగుతున్నదని అన్నారు. పంటసాగులో రైతులు తక్కువపెట్టుబడిని పెట్టి అధిక పంటను పొందేలా అధికారులు తగు సూచనలు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. 50 శాతం సబ్సిడీ విత్తనాలపై వ్యవసాయ పనిముట్లపై అందుతుందని అన్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని నరేష్‌ అన్నారు. 

కరీంనగర్‌ :రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాల్లో పాల్గొన్న యువత

రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాల్లో పాల్గొన్న యువత
కరీంనగర్‌ : రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా జిల్లాలోని మండల గ్రామాల్లోని మహిళలు, యువకులు పెద్దఎత్తున సంబరాలు జరుపుతున్నారు. ఈ నెల 2 నుంచి ప్రతిరోజు యువకులు క్రికెట్‌, వాలీబాల్‌ పోటీల్లో పాల్గొంటున్నారు. అలాగే మహిళలు బతుకమ్మలు, కోలాటాలు, నృత్యాలతో సంబరాలు జరుపుకుంటున్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ 60 సంవత్సరాల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టడం హర్షదాయకమని అన్నారు. మన తెలంగాణ, మన నీరు, మన బొగ్గు స్వచ్ఛందంగా వాడుకుంటున్నామని, ఇప్పుడు ఎంతో సంతృప్తికరంగా ఉందని అన్నారు. ఎక్కడ చూసినా రోడ్ల అభివృద్ధి జరుగుతున్నది. దీనితో బంగారు తెలంగాణకు బాటలు ఏర్పడుతున్నట్లు కనబడుతోందని అన్నారు. రైతుల కోసం మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడికలు తీయడం, వాటర్‌గ్రిడ్‌ పథకం ఏర్పాటు చేయడం వంటివి చూస్తుంటే తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో కన్నా అభివృద్ధిలో ముందుందని అన్నారు. నిడ్మానూరు, ఎల్లంపల్లి, ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని అన్నారు. 20 సంవత్సరాల క్రిందటే రాష్ట్రం వచ్చి ఉంటే నేడు మరో సింగపూర్‌ను తలపించేదని అన్నారు. 

కరీంనగర్‌ : విద్యార్థులు పోటీతత్వం పెంపొందించుకోవాలి

విద్యార్థులు పోటీతత్వం పెంపొందించుకోవాలి
కరీంనగర్‌ : విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల్లో పాల్గొంటే ఆలోచన శక్తి పెంపొంది భవిష్యత్‌లో ఉన్నతస్థానాలకు చేరుకుంటారని పార్లమెంట్‌ సభ్యులు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలలో భాగంగా శనివారం రెవెన్యూ గార్డెన్స్‌లో జిల్లా విద్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖన పోటీలను ఎంపి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ బిడ్డలు అన్యాయానికి గురికావద్దని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని అన్నారు. నేటితరం పిల్లల బంగారు భవిష్యత్‌కు తెలంగాణ ప్రభుత్వం బాటలు వేస్తుందని అన్నారు. కొత్తరాష్ట్రంలో యువతకు మంచి అవకాశాలున్నాయని అన్నారు. నీతి, నిజాయితీ, పారదర్శకంగా ఎంపికలు జరుగుతాయని, విద్యార్థులు పోటీతత్వం పెంపొందించుకొని అవకాశాల కోసం పోటీపడాలని అన్నారు. విద్యార్థులు నైపుణ్యతను పెంపొందుకోవాలని సూచించారు. తెలంలగలాన రాష్ట్రంలో ఐఎఎస్‌లు చాలా తక్కువమంది ఉన్నారని, నేటి యువత లక్ష్యం ఐఎఎస్‌పై పెట్టాలని అన్నారు. చిత్రలేఖనంలో చిన్నారుల ఆలోచనలు చాలా బాగున్నాయని హరితహారం వారు గీసిన చిత్రాలు అద్భుతమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు తుల ఉమ, జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌, ఎజెసి నాగేంద్ర, జిల్లావిద్యాధికారి లింగయ్య, జడ్పీటీసీలు, ఎంపిపిలు తదితరులు పాల్గొన్నారు. 

కరీంనగర్‌ :తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రపంచానికి చాటాలి : మంత్రి ఈటెల

తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రపంచానికి చాటాలి : మంత్రి ఈటెల
కరీంనగర్‌ : తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు చాలా గొప్పవని, ప్రపంచానికి చాటాలని రాష్ట్ర ఆర్థిక పౌర సరఫరాల శాఖమంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలలో భాగంగా 5వ రోజు శనివారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై జరిగిన రాష్ట్రస్థాయి సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన మాట్లాడుతూ తెలంగాణ చరిత్రను భావితరాలకు అందించాలని అన్నారు. తెలంగాణ ఉద్యమం మరువలేనిదని, ఉద్యమాన్ని మలుపుతిప్పింది కేసిఆర్‌ అని అన్నారు. 1969లో ప్రారంభం అయిన తెలంగాణ ఉద్యమం 2001లో తిరిగి పుంచుకుందని అన్నారు. తెలంగాణ సాధనకు కేసిఆర్‌ఉ కేంద్రమంత్రి పదవికి, ఎఉంపి స్థానానికి, రాష్ట్రంలో శాసనసభ్యులు రాజీనామాలు చేశారని తెలిపారు. తెలంగాణ 14 సంవత్సరాల ఉద్యమంలో ఎన్నో అవమానాలు భరించామని, అనేక మంది అమరవీరుల త్యాగాల ఫలితం, మేధావులు, ఉద్యమకారులు, కవులు, సాహితీవేత్తల ఫలితంగా తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. పదవుల కోసం కాదని, పాలకులుగా కాకుండా రాష్ట్రానికి సేవకులుగా పనిచేస్తామని అన్నారు. కరీంనగర్‌ చైతన్యవంతమైన జిల్లా అని, జిల్లాను విత్తనోత్పత్తి కేంద్రంగా, ధాన్యాగారంగా, అభివృద్ధి చేస్తామని అన్నారు. జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు తుల ఉమ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర అవతరణ వేడుకలను జిల్లాలో పండుగ వాతావరణంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని అన్నారు. ప్రజల ఆకాంక్షలకనుగుణంగా ప్రభుత్వం పాదర్శకమైన పాలన అందిస్తామని తెలిపారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌, శాసనసభ్యులు గంగుల కమలాకర్‌, అదనపు జేసీ నాగేంద్ర, చరిత్రకారులు, సాహితీవేత్తలు తదితరులు పాల్గొన్నారు. 

Wednesday, 3 June 2015

కరీంనగర్‌ : పాత బకాయిలు చెల్లించాలి : చెరుకు రైతులు

పాత బకాయిలు చెల్లించాలి : చెరుకు రైతులు
కరీంనగర్‌  : పాత బకాయిలు చెల్లించాలంటూ చెరువు రైతులు గత కొంతకాలంగా మల్లాపూర్‌ మండలంలోని ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద నిరాహారదీక్షలు చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీల ద్వారా చెరుకు రైతుల బకాయిలు చెల్లిస్తామని చెబుతున్నారు కాని అవి అమలుకు నోచుకోవడం లేదన్నారు. పాత బకాయిలు రాకపోవడంతో తాము ఆర్థికంగా మరింత దెబ్బతింటున్నామని అన్నారు. పాత బకాయిలు రాకపోతే తమ జీవనం ఎలా సాగుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పాత బకాయిలు రాకపోవడంతో తాము పంటలు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నామని, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని తెలిపారు. పాత బకాయిలు రాకపోతే రైతులకు ఆత్మహత్యలే శరణమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చెరుకు రైతుల పరిస్థితిని అర్థంచేసుకుని ఆదుకోవాలని వారు కోరారు. 

కరీంనగర్‌ : 'మన వ్యవసాయం'పై రైతులకు అవగాహన కల్పించండి

'మన వ్యవసాయం'పై రైతులకు అవగాహన కల్పించండి
కరీంనగర్‌  : మన తెలంగాణ - మన వ్యవసాయం అనే కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించాలని అగ్రికల్చర్‌ ఎడి రవీందర్‌రెడ్డి తెలిపారు. జగిత్యాల డివిజన్‌లోని సారంగపూర్‌ తదితర ప్రాంతాలలో అవగాహన సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు సోయా విత్తనాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకోవడంతో పాటు 50శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేస్తుందన్నారు. విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మిషన్‌ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చెరువులలో ఉన్న పూడికతీత తీస్తారు. దీనిద్వారా చెరువులలో నీటినిల్వ సామర్థ్యం పెరుగుతుందన్నారు. తద్వారా భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని అన్నారు. పూడికమట్టిని రైతులు తమ పంటపొలాల్లో వేసుకోవచ్చారు. మిషన్‌ కాకతీయ ద్వారా రైతులు తమ పంటలను బాగా పండించుకోవచ్చని అన్నారు. 

కరీంనగర్‌ :పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మధు

పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మధు
కరీంనగర్‌  : పుష్కరాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పి.మధు అన్నారు. కాళేశ్వరంలోని ఆలయానికి వచ్చే భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. గోదావరిలో నిర్మిస్తున్న పుష్కరిణి ఘాట్లు, తాత్కాలిక షెడ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నాణ్యతతో కూడిన పనులను వేగవంతం చేయాలన్నారు. పనులలో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో చేపట్టబోయే పుష్కరాలు గుర్తుండేలా సీఎం చర్యలు చేపట్టారని అన్నారు. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ ఇతర రాష్ట్రాల నుండి ఈ పుష్కరాలకు వస్తారని అన్నారు. గోదావరి నది ఈ ప్రాంతంలో రెండు నదులుగా ప్రవహించడం వల్ల కాళేశ్వర ఆలయానికి మంచి విశిష్టత ఉందన్నారు. 
Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks