బోధన్ బంద్ విజయవంతం
షుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్
నిజామాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ ఫ్యాక్టరీ రక్షణ సమితి శనివారం ఇచ్చిన బంద్ విజయవంతమైంది. టీఆర్‌ఎస్ పార్టీ మినహా అన్ని రాజకీయ, ప్రజాసంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. కార్మికులు, రైతులు అన్ని రాజకీయ పక్షలు బోధన్ పట్టణంలో ఊరేగింపు నిర్వహించి వాణిజ్య, వ్యాపార దుకాణాలు మూసి వేయించారు. పెట్రోల్ బంక్‌లు, సినిమా థియేటర్లు, బ్యాంక్‌లు మూసి వేయించారు. బంద్‌కు ఆర్టీసీని మినహాయించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ రక్షణ సమితి కన్వీనర్ రాఘవులు మాట్లాడుతూ బోధన్ చెరకు రైతులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని ప్రభుత్వం నడపాలని డిమాండ్ చేశారు.

No comments:
Post a Comment