టీడీపీకి, ఎర్రబెల్లికి అంత సీన్ లేదు
నిజామాబాద్ : తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లికి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని.. వైఎస్సార్ కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు పెద్దపటోళ్ల సిద్ధార్థరెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ తొలి ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అమరవీరుల త్యాగఫలితంగా సిద్ధించిన తెలంగాణలో వారి ఆశయ సాధన కోసం ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటుకు ప్రయత్నించి.. రెడ్ హ్యాండెడ్ గా టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డా.. ఆ పార్టీకి ఇంకా సిగ్గురాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని ఈ సందర్భంగా సిద్ధార్థరెడ్డి సూచించారు.

No comments:
Post a Comment