పాత బకాయిలు చెల్లించాలి : చెరుకు రైతులు
కరీంనగర్ : పాత బకాయిలు చెల్లించాలంటూ చెరువు రైతులు గత కొంతకాలంగా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వద్ద నిరాహారదీక్షలు చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీల ద్వారా చెరుకు రైతుల బకాయిలు చెల్లిస్తామని చెబుతున్నారు కాని అవి అమలుకు నోచుకోవడం లేదన్నారు. పాత బకాయిలు రాకపోవడంతో తాము ఆర్థికంగా మరింత దెబ్బతింటున్నామని అన్నారు. పాత బకాయిలు రాకపోతే తమ జీవనం ఎలా సాగుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పాత బకాయిలు రాకపోవడంతో తాము పంటలు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నామని, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని తెలిపారు. పాత బకాయిలు రాకపోతే రైతులకు ఆత్మహత్యలే శరణమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చెరుకు రైతుల పరిస్థితిని అర్థంచేసుకుని ఆదుకోవాలని వారు కోరారు.

No comments:
Post a Comment