'మన వ్యవసాయం'పై రైతులకు అవగాహన కల్పించండి
కరీంనగర్ : మన తెలంగాణ - మన వ్యవసాయం అనే కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించాలని అగ్రికల్చర్ ఎడి రవీందర్‌రెడ్డి తెలిపారు. జగిత్యాల డివిజన్‌లోని సారంగపూర్ తదితర ప్రాంతాలలో అవగాహన సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు సోయా విత్తనాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకోవడంతో పాటు 50శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేస్తుందన్నారు. విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చెరువులలో ఉన్న పూడికతీత తీస్తారు. దీనిద్వారా చెరువులలో నీటినిల్వ సామర్థ్యం పెరుగుతుందన్నారు. తద్వారా భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని అన్నారు. పూడికమట్టిని రైతులు తమ పంటపొలాల్లో వేసుకోవచ్చారు. మిషన్ కాకతీయ ద్వారా రైతులు తమ పంటలను బాగా పండించుకోవచ్చని అన్నారు.

No comments:
Post a Comment