74 % మందికి పొట్ట, భారీ నడుము..
10 నగరాల్లో సఫోలా లైఫ్ అధ్యయనం
భారత మహిళల్లో గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉందని, వారిలో ఆ ప్రమాదాన్ని గుర్తించడం, చికిత్స చేయడం చాలా తక్కువగా జరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం ప్రకటించింది. మంగళవారం (సెప్టెంబరు 29) ‘ప్రపంచ హృదయ దినోత్సవం’ సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆగ్నేయాసియా ప్రాం తంలో.. వంటచెరకుతో వాడే పొయ్యిల వల్లా మహిళలు గుండె వ్యాధుల బారిన పడుతున్నారని ఆమె చెప్పారు.
‘ప్రతి చోటా.. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యవంతమైన గుండె..’ నినాదంతో ఈసారి ప్రపంచ గుండె దినాన్ని నిర్వహిస్తామన్నారు. అంతేగాకుండా.. 2025 నాటికి ఆగ్నేయాసియాలో గుండె వ్యాధుల వల్ల సంభవించే అకాల మరణాలను 25 శాతానికి తగ్గించేలా లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ఖేత్రపాల్ చెప్పారు. కాగా, నగరాల్లో నివసించే 61 శాతం మంది మహిళలు గుండెవ్యాధుల బాధితులేనట. అందులోనూ 30 నుంచి 45 ఏళ్ల లోపువారే ఎక్కువ. ‘సఫోలా లైఫ్’ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఈ నివేదికను సోమవారం విడుదల చేశారు.
పది పెద్ద నగరాల్లో 1300 మంది మహిళలపై ఈ సర్వే చేశారు. 74 శాతం మంది మహిళలకు భారీ పొట్ట, భారీ నడుము కొలత ఉన్నట్లు, 86 శాతం మంది మహిళల బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మారుతున్న ఆహారపుటలవాట్లు, అనారోగ్యకరమైన ఆహారం, ఆలస్యంగా భుజించడం వంటి కారణాల వల్ల మహిళల్లో గుండె వ్యాధుల ప్రభావం పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
No comments:
Post a Comment