Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Tuesday, 29 September 2015

ఇస్రో విశ్వశోధన

మొన్న చంద్రుడి వైపు చూపు… నిన్న అంగారకుడిపై అన్వేషణ… నేడు విశ్వాంతరాళ శోధనకు శ్రీకా రం… ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఇస్రో సాగిస్తున్న అంతరిక్ష ప్రస్థానమిది. భారతదేశ తొలి స్పేస్‌ అబ్జర్వేటరీ ‘ఆసో్ట్రశాట్‌’ను ఇస్రో సోమవారం విజయవంతంగా ప్రయోగించింది. ఇప్పటి వరకు అమెరికా, జపాన్‌, రష్యా, యూరోప్‌ మాత్రమే స్పేస్‌ అబ్జర్వేటరీలను కలిగి ఉన్నాయి. ఇస్రో నమ్మినబం టు పీఎస్‌ఎల్‌వీ.. ఆసో్ట్రశాట్‌తోపాటు అమెరికాకు చెందిన 4 ఉపగ్రహాలు సహా మొత్తం 6 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. అమెరికాకు చెందిన3wsz ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించడం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో భారత ప్రధాని మోదీ భేటీకి కొద్ది గంటల ముందు ఈ ప్రయోగం జరగడం యాదృచ్ఛికం. జూ నాలుగు అమెరికా ఉపగ్రహాలు సహా 6 విదేశీ ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం పీఎస్‌ఎల్‌వీకి 30వ విజయం :ఇరవై రెండేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో పీఎస్‌ఎల్‌వీకి ఇది 30వ విజయం. తొలి పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను 1993 సెప్టెంబరు 20న ఇస్రో ప్రయోగించింది. నాటినుంచి నేటిదాకా పీఎస్‌ఎల్‌వీని 31 సార్లు ప్రయోగిస్తే తొలిసారి మినహా మిగిలిన 30సార్లు గ‘ఘన’ విజయాలను నమోదు చేసింది. శ్రీహరికోట సెప్టెంబరు 28: దేశీయ స్పేస్‌ పోర్టు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట షార్‌ కేంద్రం.. సోమవారం ఉదయం 10 గంటలు.. ప్రథమ ప్రయోగ వేదికపై రోదసిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా పీఎస్‌ఎల్‌వీ-సీ30.. కౌంట్‌డౌన్‌ చివరి దశకు చేరుకుంది.. జీరోపాయింట్‌లోని మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లో కంప్యూటర్ల ముందున్న శాస్త్రవేత్తల్లో ఒకింత ఉత్కంఠ.. కౌంట్‌డౌన్‌ జీరోకు చేరుకుంది.. ఒక్కసారిగా రాకెట్‌ అడుగుభాగాన అమర్చిన 6 బూస్టర్లు నిప్పులు చిమ్మగా సంధించిన బాణంలా పీఎస్‌ఎల్‌వీ-సీ30 రోదసిలోకి దూసుకెళ్లింది.. నిమిషాలు గడుస్తున్నాయి.. పీఎస్‌ఎల్‌వీ నింగికెగిసిన 21.09 నిమిషాలకు మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఒక్కసారిగా హర్షధ్వానాలు మిన్నంటాయి. భారతదేశ తొలి స్పేస్‌ అబ్జర్వేటరీ ‘ఆస్ట్రోశా ట్‌’ ఉపగ్రహం సహా మరో 6 విదేశీ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ విజయవంతంగా అంతరిక్షంలోకి చేర్చింది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నాలుగు దశల మోటార్లతో ప్రయాణిస్తూ 21.09 నిమిషాలకు 650 కిలోమీటర్ల ఎత్తుకు చేరి ఆస్ట్రోశా ట్‌ సహా ఆరు విదేశీ ఉపగ్రహాలను రోదసిలోకి నెట్టి రాకెట్‌ విడిపోయింది. 22.51 నిమిషాలకు అదే ఎత్తులో ఆస్ట్రోశా ట్‌మిగిలిన ఆరు విదేశీ ఉపగ్రహాల నుంచి విడిపోయింది. 23.01 నిమిషాలకు లపాన్‌-ఏ2 (ఇండోనేషియా), 23.45 నిమిషాలకు ఎన్‌ఎల్‌ఎస్‌-14 (కెనడా), 24.03 నిమిషాలకు అమెరికాకు చెందిన లెమూర్‌-1, 24.11 నిమిషాలకు లెమూర్‌-2, 25.02 నిమిషాలకు లెమూర్‌-3, 25.53 నిమిషాలకు లెమూర్‌-4 ఉపగ్రహాలు విడిపోయాయి. భూమికి 650 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్యరేఖకు 6 డిగ్రీల వాలులోని కక్ష్యలో ఈ ఉపగ్రహాలు స్థిరపడ్డాయి. వెంటనే బెంగుళూరు ఇస్ట్రాక్‌లోని మిషన్‌ ఆపరేషన్స్‌ కాంప్లెక్స్‌ (ఎంవోఎక్స్‌) ఆస్ట్రోశా ట్‌ ఉపగ్రహాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకొంది.ఎంవోఎక్స్‌ సిబ్బంది ఉపగ్రహంలోని రెండు సోలార్‌ ప్యానళ్లను విచ్చుకొనేలా చేశారు. తాజాగా ప్రయోగించిన 6 విదేశీ ఉపగ్రహాలతో భారతదేశం ఇప్పటి వరకు ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 51కి చేరింది. ఇవి జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ తదితర 20 దేశాలకు చెందినవి. తాజా ప్రయోగానికి ఇస్రో రూ.328 కోట్లు ఖర్చు చేసింది. రాకెట్‌ తయారీకి రూ.150 కోట్లు, ఆస్ట్రోశా ట్‌ఉపగ్రహ తయారీకి రూ.178 కోట్లు ఖర్చుచేశారు. అయితే విదేశీ ఉపగ్రహాలను ఈ రాకెట్‌ ద్వారా ప్రయోగించడంతో విదేశీ మారకద్రవ్యం సమకూరనుంది.

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks