- 103 వ భారతీయ విజ్ఞాన సదస్సులో ప్రధాని మోడీ
- ప్రజాసంక్షేమమే లక్ష్యం
- టెక్ పరిజ్ఞానంలో కలిసిరండి
- భారత్‌ను టాప్‌లో నిలుపుదాం
- ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు
మైసూరు : ప్రజా సంక్షేమం, ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా శాస్త్రవేత్తలు పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 103వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను మోడీ ఆదివారం బెంగళూరులో ప్రారంభించారు. అనంతరం దేశవిదేశాలకు చెందిన శాస్త్రవేత్తలను ఉద్దేశించి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతోనే సుపరిపాలన సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. అలాగే 2030 నాటికి దేశంలో పేదరిక నిర్మూలన, అభివృద్ధిలో భారత్‌ను ఆగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. శాస్త్ర, పరిశోధన రంగాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు.
మైసూరు విశ్వవిద్యాలయానికి శతాబ్ది ఉత్సవాలు జరగనున్నాయని ఈ సందర్భంగా మోడీ గుర్తు చేశారు. అలాంటి తరుణంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు ఈ విశ్వవిద్యాలయం వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు. ఇండియన్ సైన్స్ కాం గ్రెస్, మైసూరు విశ్వవిద్యాలయం రెండూ ఒకేసారి తమ ప్రయాణాన్ని ప్రారంభించాయని మోడీ పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో దేశ విదేశాలకు చెందిన శాస్త్రవేత్తలతో కలసి ఈ సదస్సులో పాల్గొనడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో భాగస్వాములు కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు మోదీ విజ్ఞప్తి చేశారు.
గొప్ప నేతలంతా మైసూరు విశ్వవిద్యాలయంలోనే చదువుకున్నారని చెప్పారు. ఈ సదస్సుకు 10 వేల మంది దేశ విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. 30 మంది శాస్త్రవేత్తలకు మోదీ పురస్కారాలను ప్రదానం చేశారు. భారతదేశం దేశీయ రక్షణ ఉత్పత్తులపై దృష్టి సారించినపుడే రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధ్య మవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మన దేశ రక్షణరంగ అవసరాల దృష్ట్యా దేశీయ ఆయుధాలను సమకూర్చుకోవాల్సిన అవసరముందన్నారు. కర్ణాటక లోని బీదర్‌హల్లా కావెల్ జిల్లాలో హెచ్ఎఎల్‌కు అనుబం ధంగా రూ. 5 వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయ నున్న గ్రీన్‌ఫీల్డ్ హెలికాప్టర్ ప్రాజెక్టుకు ఆదివారం ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సాయంతో ప్రభు త్వం దేశీయ రక్షణ రంగ ఉత్పత్తులు సాగించేదిశగా దృష్టి సారించనున్నదన్నారు. ఐఎఎఫ్ సిబ్బంది దేశంలో ఎటు వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని పోరాటానికి అన్ని పరిస్థితుల్లోనూ సిద్ధంగా ఉంటుంద న్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యర్థులను ఎదు ర్కొనేందుకు అవసరమైన ఆయుధాలను సమకూర్చుకో వాల్సిన అవసరముందన్నారు.
అయితే భారత్ రక్షణ ఆయుధాలను దిగుమతి చేసుకోవడం వలన అత్యధిక వ్యయమవుతున్నదని, అందుకే భారత్‌లో రక్షణ ఆయు ధాల ఉత్పత్తి సాగించడం ద్వారా స్వయం సమృద్ధి సాధిం చవచ్చన్నారు. అయితే ఇందుకోసం భారత్ మరింత సాం కేతిక అభివృద్ధిని సాధించాల్సిన అవసరముందన్నారు. కాగా హెచ్ఎఎల్ సంస్థ రానున్న 15 సంవత్సరాల్లో 600 హెలీకాప్టర్లను ఉత్పత్తి చేస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు వలన ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4 వేల మందికి ఉద్యో గాలు లభిస్తాయన్నారు. ఈ జిల్లా ఖ్యాతి త్వరలో ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుందన్నారు.



No comments:
Post a Comment