న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఘటనలో ఉగ్రవాదులందరినీ మట్టుపెట్టినట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో, పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ యునైటెడ్ జిహాదీ కౌన్సిల్ ఈ దాడులకు తామే పాల్పడ్డామంటూ ప్రకటించింది. పాకి స్తాన్‌కుచెందిన ఒక న్యూస్ ఏజెన్సీకి అందిన ఒక మెయిల్ ప్రకారం ఈ దాడు లకు యునైటెడ్ జిహాదీ కౌన్సిల్ పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘట నకు పాకిస్తాన్‌కు ఎటువంటి సంబంధంలేదని ఆ ఉగ్రవాద సంస్థ పేర్కొంది. కాగా పాకిస్తాన్, అక్కడి నిఘా వర్గాల మద్దతులో ఈ ఉగ్రవాద సంస్థ 1994లో ఏర్పాటైంది. ఇది 15 ఉగ్రవాద సంస్థలలో భాగస్వామ్యం వహి స్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రముఖ ఉగ్రవాద సంస్థ హిజాబుల్ ము జాహుద్దీన్‌కు అత్యంత సన్నిహితమైన సంస్థగా దీనికి పేరుంది. కాగా యు నైటెడ్ జిహాద్ కౌన్సిల్‌కు ఉగ్రవాది సయ్యద్ సలా హుద్దీన్ చీఫ్‌గా ఉన్నాడు. తమకు చెందిన హైవే స్క్వాడ్ దాడులు చేసినట్లు యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ పేర్కొంది. అయితే ఈ ప్రకటనను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇదిలా ఉండగా పఠాన్‌కోట్ వైమానిక స్థావరాన్ని ఉగ్రవాదులు ఎంచుకోవడం వెనుక పెద్దవ్యూహమే ఉంది. భారత్-పాక్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వైమానిక స్థావరం. పాకిస్థాన్ నుంచి భారత్‌పై దాడి జరిగితే మొదటి రక్షణ కవచం ఇది. జమ్మూ కశ్మీర్ లో నిర్వహించే ఆపరేషన్స్‌కు ఇది సపోర్టుగా ఉంటుంది. 75 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ వైమానిక స్థావరంలో మిగ్-21 ఫైటర్ విమానాలు 108మంది స్వ్కాడ్రన్ లీడర్స్ ఉంటారు. 125 హెలికాప్టర్ యూనిట్ గ్లాడియేటర్స్‌కు కూడా ఇది స్థావరం. 1965 యుద్ధం నుంచి పాకిస్థాన్ పఠాన్‌కోట్‌ను టార్గెట్ చేసింది. 1971లో జరిగిన యుద్ధంలో ఇక్కడి రన్ వే కొంచెం దెబ్బతింది. ఈ ఎయిర్ బేస్‌ను ప్రైడ్ ఆఫ్ ఇండియాగా పేర్కొనడం గమనార్హం!



No comments:
Post a Comment