హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కును వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వరంగల్ జిల్లాలో పర్యటనలో ఉన్న ఆయన అభివృద్ధి కార్యక్రమాలపై ఈరోజు అధికారులతో చర్చించారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమీక్ష వివరాలు వెల్లడించారు.జిల్లాలో 2-3వేల ఎకరాల విస్తీర్ణంలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయాలని ఆలోచన ఉందన్నారు. టెక్స్‌టైల్ భూసేకరణ కోసం జిల్లా కలెక్టర్ ఇప్పటికే రూ.100 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. మిషన్ భగీరథ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించినట్లు కేసీఆర్ తెలిపారు. ఈ పథకం కింద వరంగల్ జిల్లాలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాలకు గోదావరి నీరు అందించనున్నట్లు వెల్లడించారు.
మరికొన్ని నిర్ణయాలు
* వరంగల్‌కు 30వేల రెండు పడక గదుల ఇళ్ల మంజూరు. వీటిలో 2శాతం ఇళ్లు మాజీ సైనిక ఉద్యోగులకు కేటాయింపు
* వరంగల్ పోలీసు కమిషనరేట్ కోసం 12 అంతస్తుల భవనం నిర్మాణం
* 250-300 ఎకరాల్లో థీమ్ పార్కు ఏర్పాటు
* కేఎంసీ పరిసరాల్లో ట్విన్ టవర్లతో మల్లీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం
* కేంద్రీయ కారాగారం మామునూరుకు బదిలీ చేయాలని నిర్ణయం
* రాష్ట్రంలోని మాజీ సైనికుల ఆస్తులు భార్య పేరిట ఉంటే ఆస్తి పన్ను మినహాయింపు
* వరంగల్‌లో అన్ని సదుపాయాలతో జర్నలిస్టు కాలనీ ఏర్పాటుa


No comments:
Post a Comment