Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Wednesday, 6 January 2016

షహర్ హమారా ... మేయర్ హమారా

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కార్యకర్తలను కార్యోన్ముకులను చేసేందుకు ఈనెల 9న నిజాం కళాశాల మైదానంలో తెలుగుదేశం పార్టీ జాతీయా అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జీహెచ్ఎంసీ ఎన్నికల శంఖారావాన్ని పూరించబో తున్నట్లు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు. మంగళవారంనాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో గ్రేటర్ పార్టీ అ�ధ్యక్షుడు మాగంటి గోపినాథ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి మీడియా ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ షహర్ హమారా... మేయర్ హమారా..అమన్‌శాంతి అనే నినాదంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొంటామన్నారు. హైదరాబాద్ ఓటర్లు టీడీపీ-బీజేపీ కూటమికే మద్దతు తెలపనున్నారని రమణ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 


గ్రేటర్ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజార్జీ వార్డుల్లో విజయం సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని స్పష్టం చేవారు. గతంలో టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పార్టీ జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలను పరోక్ష పద్దతిలో నిర్వహించి, ఇష్టానుసారంగా వ్యవహరించిందని ఆరోపించారు. కోర్టులు ఎన్నికలు నిర్వహించ మని మెట్టికాయ వేస్తే..జనాభా పెరిగిందని, 150 డివిజన్లకు బదులు 200డివిజన్లు చేయాలి అని సాకులు చెప్పి తీవ్ర జాప్యం చేసిందని విమర్శించారు. చివరికి టీఆర్ఎస్ పార్టీకి 200డివిజన్లకు అభ్యర్థులు దొరకని పరిస్థితిలో 150 డివిజన్లకే పరిమితం చేశారని దుయ్యబట్టారు. దీనితో పాటు నగరంలోని చెరువులను పునరుద్దరిస్తామని, ట్రాఫిక్, వాయు కాలుష్యాన్ని నియంత్రి స్తామని, మురికివాడల్లో వసతులు మెరుగుపరుస్తామని, ఎక్స్‌ప్రెస్‌రహ దారులు, స్వశాన వాటికలను ఆధునీకరిస్తామని ఇలా అనేక వాగ్ధానాలు చేసి, 18 మాసాల్లో ఎలాంటి పురోగతి సాధించలేదని రమణ ఆరోపించారు. 

ప్రజలను మభ్యపెట్టడంలో కేసీఆర్ కుటుంబీకుల దిట్టా : 
ప్రజలను మభ్యపెట్టడంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారని విమర్శించారు. అసలు సీఎంకు అధికారాలు ఎక్కువగా ఉంటాయా? మేయర్‌కు ఎక్కువ ఉంటాయా? అనే విషయాన్ని కూడా మరిచి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అనేక అవకతవకలకు, అక్రమాలకు తెరతీశారని అన్నారు. మూసీలో మురికి పారదోలుతామని చెప్పి..జీహెచ్ఎంసీని మురికి కూపంగా తయారు చేశారని తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గోరంత పనిచేసి కొండంత ప్రచారం చేస్తున్నదన్నారు. రాజకీయ జన్మనించిన్చన టీడీపీని విమర్శిస్తున్నారని, ఈనెల 6,7 తేదీలలో జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు, 150 డివిజన్ల సమన్వయ కర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 

18 మాసాల్లో నగరాభివృద్ధి శూన్యం :మాగంటి
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 18మాసాలు గడుస్తున్నా నగరాభివృద్ధి శూన్యమని గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఆరోపించారు. ఇప్పటివరకు ఒకే మారు నగరానికి చెందిన ఎమ్మెల్యేలతో చర్చించారని అందులో తీసుకున్న నిర్ణయాలలో ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆరోపించారు. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి నివేదికను వెల్లడించాలేదని, మూసీ ప్రక్షాళన అని ఇప్పటి వరకు చేపట్టలేదన్నారు. నగరంలో భారీ ఎత్తున ఓట్లను తొలగించడం, రిజర్వేషన్ల పక్రియ, డీ లిమిటేషన్, 15రోజుల్లో ఎన్నికల నిర్వహణ అంటూ ప్రభుత్వం చేస్తున్న చర్యలన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గుణపాఠం చెబుతారని గోపినాథ్ వెల్లడించారు. 

అభ్యర్థులు దొరకని స్థితిలో టీఆర్ఎస్ : ఎన్నికల ప్రక్రియను 45 రోజుల నుంచి 15రోజులకు కుదించారని, ఇప్పటి దాక రిజర్వేషన్లను కూడా వెల్లడించలేదని, అనేక వార్డుల్లో టీఆర్ఎస్‌కు అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొందని రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రకాశ్‌గౌడ్ ఆరోపించారు. ఎన్నికల్లో 50శాతమ మహిళలకు రిజర్వేషన్లు చేశామని గొప్పలు చెబుతున్న టీఆర్ఎస్ నేతలు కేబినెట్‌లో మహిళలకు స్థానం ఎందుకు కల్పించలేదని కేసీఆర్‌ను కవిత ప్రశ్నిస్తే బాగుంటుందన్నారు.

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks