మండలంలోని అంకాపూర్ గ్రామాన్ని శనివారం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా రైతుల బృందం సందర్శించింది. నల్గొండ జిల్లాకు చెందిన దుగ్గపల్లి, బాబాసాయిపేట, నందిపాడు, దుప్పాలపల్లి, రాంచంద్రపురం గ్రామాల రైతులను అంకాపూర్‌లో పంటలను పరిశీలించడానికి తీసుకువచ్చినట్లు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వీరంజనేయులు, ఎన్.శంకర్‌లు తెలిపారు. మొదట గ్రామంలోని గురడిరెడ్డి రైతు సంఘంలో సంఘం కార్యదర్శి కేకే. భాజన్నతో సమావేశమై పంటల సాగు పద్ధతులను తెలుసుకున్నారు. అనంతరం క్షేత్రస్థాయికి వెళ్లి ప సుపు, ఎర్రజొన్న, కూరగాయ పంటల సాగు పద్ధ్దతులను పరిశీలించారు. ఈ సందర్భంగా సందర్శ న రైతులు మాట్లాడుతూ.. డ్రిప్, నీటి కుండీల ద్వారా పంటలకు నీరందించే విధానాలు బాగున్నాయని కొనియాడారు. పంటల్లో కలుపు మొక్క లు లేకుండా చేయడం బాగుందన్నారు.


No comments:
Post a Comment